MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • ప్రభాస్‌తో `కన్నప్ప` చేసేందుకు కృష్ణంరాజు ప్లాన్‌.. మంచు విష్ణు వద్దకు ఎలా వెళ్లింది? మోహన్‌బాబు ఏం చేశాడు?

ప్రభాస్‌తో `కన్నప్ప` చేసేందుకు కృష్ణంరాజు ప్లాన్‌.. మంచు విష్ణు వద్దకు ఎలా వెళ్లింది? మోహన్‌బాబు ఏం చేశాడు?

మంచు విష్ణు చేస్తున్న `కన్నప్ప` మూవీ ముందు ప్రభాస్‌ చేయాల్సిందా? విష్ణు వద్దకు ఎలా వచ్చింది? మోహన్‌ బాబు, కృష్ణంరాజు ల మధ్య ఏం జరిగిందనేది చూస్తే,  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Jun 15 2024, 11:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

మైథలాజికల్‌ అంశాలతో మంచు విష్ణు `కన్నప్ప` సినిమా చేస్తున్నాడు. ఇందులో తనే మెయిన్‌ లీడ్‌గా చేస్తున్నాడు. కన్పప్ప పాత్రలో కనిపించబోతున్నారు మంచు విష్ణు. ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహించారు. మోహన్‌బాబు నిర్మించిన ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. తాజాగా టీజర్‌ని విడుదల చేశారు. దీనికి మంచి స్పందన లభించింది. అదే సమయంలో అంచనాలను రీచ్‌ కాలేకపోయింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. `కన్నప్ప` సినిమా ముందు ఎవరు చేయాల్సింది, ఎవరి వద్దకు వెళ్లింది? ఎలా వెళ్లింది, మంచు మోహన్‌ బాబు, కృష్ణంరాజు మధ్య జరిగిన డిస్కషన్‌ ఏంటనేది తాజాగా రివీల్‌ అయ్యింది. మోహన్‌ బాబు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌అవుతుంది. 
 

37

`కన్నప్ప` సినిమాని గతంలో కృష్ణంరాజు చేశారు. `భక్త కన్నప్ప` పేరుతో ఈ మూవీ చేశారు. బాపు దర్శకత్వం వహించిన ఈ మూవీ 1976లో వచ్చింది. ఆకట్టుకుంది. ఇందులో కృష్ణంరాజు కన్నప్ప, అర్జున, తిన్నడు పాత్రల్లో మెరిశారు. వాణిశ్రీ, రావు గోపాల్‌రావు, అల్లు రామలింగయ్య వంటి వారు నటించారు. సినిమా పెద్ద హిట్‌. 
 

47

`భక్త కన్నప్ప` ఓపెన్‌ స్టోరీ. ఎవరైనా తీయోచ్చు. కానీ సినిమా పరంగా మాత్రం సినిమా హక్కులు ప్రభాస్‌ తండ్రి సూర్యనారాయణ వద్ద ఉన్నాయి. `భక్త కన్నప్ప`ని ఆయనే నిర్మించారు. ఈ నేపథ్యంలో మోహన్‌బాబు కి కూడా ఆ మధ్య `కన్నప్ప` సినిమా చేయాలని అనిపించిందట. దీంతో కృష్ణంరాజుతో ఈ విషయాన్ని చర్చించారట. ఇలా కన్నప్ప మూవీ విష్ణుతో చేయాలనుకుంటున్నాను, మీ వద్ద సినిమా రైట్స్ ఉన్నాయని అడిగాడట మోహన్‌బాబు. 
 

57

అంతే మరో మాట లేకుండా ఇచ్చేశాడట కృష్ణంరాజు. తన వద్ద ఉన్న కంటెంట్‌ కూడా ఇస్తానని మొత్తం ఇచ్చేశాడట. అయితే ఈ సందర్భంగా ఓ షాకింగ్‌ విషయం వెల్లడించాడు కృష్ణంరాజు. ఈ మూవీని తాను ప్రభాస్‌తో చేయాలనుకున్నాను, దానికోసమే వెయిట్‌ చేస్తున్నానని అసలు విషయం రివీల్‌ చేశాట. అయితే ఆ సమయంలో మోహన్‌బాబు వెనక్కి తగ్గాలనే ఫీలింగ్‌ కలిగినా, లేదు, విష్ణు కూడా తనకు మరో కొడుకు లాంటి వాడు, అతని కోసం ఇచ్చేస్తానని తెలిపాడట కృష్ణంరాజు. అలా ఈ మూవీ విష్ణుతో సెట్‌ అయ్యిందని వెల్లడించాడు. ఆయన గొప్పతనం ఏంటో అంతకంటే ఏం చెప్పాలని వెల్లడించారు మోహన్‌బాబు. టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ఈ విషయం చెప్పాడు. 

67

ఇక `కన్నప్ప` చిత్రం భారీ కాస్టింగ్‌తో రూపొందుతుంది. మంచు విష్ణుతోపాటు ప్రభాస్‌, మోహన్‌లాల్‌, అక్షయ్ కుమార్‌, శరత్‌ కుమార్‌, మోహన్‌బాబు, కాజల్‌, మధుబాల, బ్రహ్మానందం వంటి వారు నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, భారీ కాస్టింగ్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్లు ప్రతి సోమవారం వస్తుంటాయని తెలిపారు మంచు విష్ణు. వీక్‌ బై వీక్‌ అప్‌డేట్స్ వస్తాయని సోమవారంని `కన్నప్ప` మండేగా పిలవబోతున్నామని చెప్పారు విష్ణు. 
 

77

ఇక ఇందులో ప్రభాస్‌ పాత్ర గురించి చెబుతూ, ఆయన ఏ పాత్రలో కనిపించబోతున్నారనేది మున్ముందు వెళ్లడిస్తామని, మరో రెండు నెలల్లో ఆయన లుక్‌, పాత్ర డిటెయిల్స్ తో కూడా అప్‌ డేట్ వస్తుందన్నారు. ఆయన సినిమా మొత్తంలో కనిపిస్తారని వెల్లడించారు. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
కృష్ణంరాజు
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
ANR: పెళ్లై పిల్లలున్న హీరోయిన్‌తో ఏఎన్నార్ ఆన్ స్క్రీన్ రొమాన్స్... 275 రోజులు ఆడి రికార్డు సృష్టించిన సినిమా ఏదో తెలుసా?
Recommended image2
Ashika Ranganath: ఫ్లోరల్ ప్రింట్ చీరలో ఆషికా రంగనాథ్‌ మతిపోయే పోజులు.. హైలైట్‌ ఇదే
Recommended image3
Mahakali: మహాకాళి అవతారంలో శ్రియా రెడ్డి.. సలార్ స్టార్ బ్యాక్‌గ్రౌండ్, క్రికెట్ ఫ్యామిలీ కనెక్షన్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved