MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రభాస్ పెద్ద స్టార్ అవుతాడని కృష్ణంరాజుకు నమ్మకం కలిగింది ఎప్పుడో తెలుసా.. కొడుకులు లేకపోవడంపై సమాధానం

ప్రభాస్ పెద్ద స్టార్ అవుతాడని కృష్ణంరాజుకు నమ్మకం కలిగింది ఎప్పుడో తెలుసా.. కొడుకులు లేకపోవడంపై సమాధానం

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కృష్ణంరాజు అనుబంధం ఎలాంటిదో మాటల్లో చెప్పలేం. తన తమ్ముడి కొడుకైన ప్రభాస్ ని కృష్ణం రాజు తన భాద్యతగా, తన వారసుడిగా ఇండస్ట్రీకి తీసుకువచ్చారు. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Jul 25 2024, 09:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కృష్ణంరాజు అనుబంధం ఎలాంటిదో మాటల్లో చెప్పలేం. తన తమ్ముడి కొడుకైన ప్రభాస్ ని కృష్ణం రాజు తన భాద్యతగా, తన వారసుడిగా ఇండస్ట్రీకి తీసుకువచ్చారు. పెదనాన్న పేరు నిలబెట్టేలా ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా అందనంత ఎత్తుకు ఎదిగాడు. 

 

26

ప్రభాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పుడు కృష్ణంరాజుకి అంతగా అంచనాలు లేవు. మంచి హీరోగా ఎదిగి వరుసగా సినిమాలు చేస్తే చాలు అని అనుకున్నారు. కానీ ప్రభాస్ కొన్ని చిత్రాల్లో నటించిన తర్వాత హిట్లు ఫ్లాపులు పక్కన పెడితే కొన్ని విషయాలు కృష్ణం రాజుకి తెలిశాయి. 

 

36

దానిని బట్టి కృష్ణంరాజు తన వారసుడు ప్రభాస్ పెద్ద స్టార్ అవుతాడని అంచనా వేశారు. ఓ ఇంటర్వ్యూలో కృష్ణంరాజుకి యాంకర్ నుంచి ప్రశ్న ఎదురైంది. ప్రభాస్ ఈ స్థాయికి చేరుతాడు అని అంచనా వేశారా అని యాంకర్ అడిగారు. 

 

46

కృష్ణంరాజు బదులిస్తూ.. నాలో ఉన్న క్వాలిటీస్ ప్రభాస్ లో చాలా ఉన్నాయి. ఎలాంటి ఇగో లేదు. అందరితో కలుపుగోలుగా ఉంటాడు. ప్రభాస్ తో వర్క్ చేసిన ప్రతి డైరెక్టర్ నాతో మాట్లాడేవారు. ప్రభాస్ లో చిన్న నెగిటివ్ క్వాలిటీ కూడా లేదని నాకు చెప్పారు. 

 

56

నిర్మాతల నుంచి కూడా ఎలాంటి కంప్లైంట్ లేదు. హీరోకి అలాంటి లక్షణాలు ఉంటే తప్పకుండా స్టార్ అవుతాడు. ప్రభాస్ స్టార్ హీరో అవుతాడని అప్పుడే ఊహించినట్లు కృష్ణంరాజు తెలిపారు. ప్రభాస్ కూడా ఎవరి గురించి చెడుగా మాట్లాడడు అని కృష్ణంరాజు అన్నారు. 

 

66

అదే విధంగా కృష్ణంరాజు తనకి కొడుకులు లేకపోవడంపై స్పందించారు. మొదటి భార్యతో ఒక కూతురు.. రెండవ భార్య శ్యామల దేవితో ముగ్గురు కూతుళ్లు అని కృష్ణంరాజు తెలిపారు. కొడుకు లేడనే బాధ లేదని.. ప్రభాస్ నే తన వారసుడిగా భావిస్తున్నాను అని కృష్ణంరాజు తెలిపారు. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
కృష్ణంరాజు
ప్రభాస్
Latest Videos
Recommended Stories
Recommended image1
CSK Copyright Case: CSKకు షాకిచ్చిన సన్ టీవీ.. జైలర్, కూలీ మ్యూజిక్ వివాదం.. మద్రాస్ హైకోర్టులో కేసు!
Recommended image2
Carmeni Selvam: ధనవంతుడివి కావాలంటే అప్పు చేసి మరీ ఖర్చు చేయాలి.. సముద్రఖని ‘కార్మేని సెల్వం’ టీజర్
Recommended image3
ఉస్తాద్ భగత్ సింగ్ పై ఏపీ ప్రభుత్వం జీవో, పెరిగిన టికెట్ ధరలు ఇవే.. అక్కడ బెనిఫిట్ షో చూసే అభిమానులకు పండగే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved