MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • కృష్ణంరాజు ఫ్యామిలీకి సంబంధించిన ఎవరికీ తెలియని విషయాలు.. `ప` సెంటిమెంట్‌.. ఓ పాన్‌ ఇండియా సూపర్‌ స్టార్‌

కృష్ణంరాజు ఫ్యామిలీకి సంబంధించిన ఎవరికీ తెలియని విషయాలు.. `ప` సెంటిమెంట్‌.. ఓ పాన్‌ ఇండియా సూపర్‌ స్టార్‌

రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు ఆదివారం తెల్లవారు జామున కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఫ్యామిలీకి సంబంధించి ఎవరికీ తెలియని విషయాలు చూద్దాం. 

3 Min read
Author : Aithagoni Raju
| Updated : Sep 11 2022, 09:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

టాలీవుడ్‌లో రెబల్‌ స్టార్‌గా పాపులర్‌ అయిన కృష్ణంరాజు(Krishnam raju) అకాల మరణం యావత్ తెలుగు రాష్ట్రాల అభిమాలను దుఖసాగరంలో ముంచేత్తింది. టాలీవుడ్‌ తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతుంది. తెలుగు చిత్ర పరిశ్రమ మరోసారి మూగబోయింది. తొలితరం నటుల్లో ఒకరైన కృష్ణం రాజు ఆకస్మిక మరణం టాలీవుడ్‌ని విషాదంలోకి తీసుకెళ్లింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారు జామున కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఫ్యామిలీకి(Krishnam raju Family Details) సంబంధించి ఎవరికీ తెలియని విషయాలు చూద్దాం. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

కృష్ణంరాజు 1940 జనవరి 20న వెస్ట్ గోదావరిలోని మోగల్తూరులో జన్మించారు. ఆయన అసలు పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. ఆనాటి రాజుల కుటుంబం కావడం విశేషం. సినిమాల్లోకి వచ్చాక సింపుల్‌గా కృష్ణంరాజుగా పిలిపించుకున్నారు. అదే సినిమాల్లో వేసుకున్నారు. కృష్ణంరాజుగా తెలుగు సినిమాని ఓ ఊపు ఊపేశారు. 
 

39
Rip Krishnam Raju

Rip Krishnam Raju

సినిమాల్లోకి రాకముందు కృష్ణంరాజు ఫోటో జర్నలిస్ట్ గా పనిచేశారు. ఆయన ఆంధ్రరత్న పత్రికలో ఫోటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఆయన తీసిన ఫోటోలకుగానూ రాష్ట స్థాయిలో సెకండ్‌ బెస్ట్ ఫోటోగ్రాఫర్‌గా అవార్డు కూడా రావడం విశేషం. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదట విలన్‌గా కొన్ని సినిమాలు చేశారు. 1966లో `చిలకా గోరింక` అనే చిత్రంతో హీరోగా మారారు. వరుసగా అనేక సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించారు. మొత్తంగా దాదాపు 200 సినిమాల్లో నటించినట్టు సమాచారం. రాజకీయంగానూ రాణించారు. కేంద్ర మంత్రిగానూ పనిచేశారు.
 

49

ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన ఫ్యామిలీ విషయాలు చూస్తే, అనేక ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. కృష్ణంరాజు రెండు పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే. మొదట ఆయనకు సీతాదేవితో వివాహం జరిగింది. పెద్దలు కుదిర్చిన పెళ్లి. వీరికి పిల్లలు లేరు. ఓ కూతురుని దత్తత తీసుకున్నారు. అయితే 1995లో సీతాదేవి కారు ప్రమాదంలో కన్నుమూసింది. ఒంటరివాడైన కృష్ణంరాజుకి ఏడాది తర్వాత 1996 సెప్టెంబర్‌ 20న శ్యామలాదేవితో రెండో వివాహం జరిపించారు. వీరికి ముగ్గురు కుమార్తెలున్నారు. 

59

ఇలా మొత్తం కృష్ణం రాజుకి ఐదుగురు కుమార్తెలు అని చెప్పొచ్చు. తన కుటుంబంలో అంతా అమ్మాయిలే ఉంటే, అబ్బాయిని దత్తత తీసుకుంటారు. కానీ కృష్ణంరాజు మళ్లీ అమ్మాయినే దత్తత తీసుకోవడం ఆయనకు అమ్మాయిల పట్ల ఉన్న గౌరవానికి, బాధ్యతకి నిదర్శనంగా నిలుస్తుంది. పెద్ద కూతురు సాయి ప్రసీద, సాయి ప్రకీర్తి, సాయి ప్రదీప్తి, దత్తత తీసుకున్న మరో కూతురు ప్రశాంతి ఉన్నారు. అందరి పేర్లు `ప` అక్షరం మీదనేఉండటం విశేషం. ప్రభాస్‌,ప్రమోద్‌ కూడా `ప` అక్షరంతోనే ఉండటం విశేషం. 
 

69

కృష్ణంరాజు పెద్ద కుమార్తె(శ్యామలాదేవి మొదటి కూతురు) ప్రస్తుతం నిర్మాతగా రాణిస్తుంది. కృష్ణం రాజు గోపీకృష్ణ మూవీస్‌ అనే నిర్మాణ సంస్థని స్థాపించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రొడక్షన్‌ బాధ్యతలను ప్రసీదకి అప్పగించారు. ఇటీవల ప్రభాస్‌ నటించిన `రాధేశ్యామ్‌` చిత్రానికి ప్రసీద ఓ నిర్మాతగా వ్యవహరించారు. దీన్ని యూవీ క్రియేషన్స్‌ తో కలిసి నిర్మించారు. 
 

79

కృష్ణంరాజు సోదరుడు ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు ఉన్నారు. ఆయన కుమారుడే ప్రభాస్‌(prabhas) అనే విషయం తెలిసిందే. సూర్యనారాయణరాజు అన్న స్థాపించిన `గోపీకృష్ణ మూవీస్‌` బ్యానర్‌పైనే అనేక సినిమాలు నిర్మించారు. `కృష్ణవేణి`, `భక్తకన్నప్ప`, `అమదీపం`, `మన వూరి పాండవులు`, `మధుర స్వప్నం`, `త్రిశూలం`, `బొబ్బిలి బ్రహ్మన్న`, `ధర్మ్ అధికారి`, `తాండ్ర పాపారాయుడు`, `బిల్లా` చిత్రాలను నిర్మించారు. 
 

89

సూర్యనారాయణ రాజుకి ఇద్దరు సంతానం. వీరిలో ప్రభాస్‌ పెద్ద కాగా, మరో హీరో సిద్ధార్థ్‌ రాజ్ కుమార్‌ చిన్నవాడు. ఆయన `కెరటం` చిత్రంలో హీరోగా నటించిన విషయం తెలిసిందే. నిర్మాత ప్రమోద్‌ వారి బంధువుల అబ్బాయి. ప్రమోద్‌ `యూవీ క్రియేషన్స్‌ స్థాపించి నిర్మాతగా రాణిస్తున్నారు. భారీ చిత్రాలను నిర్మిస్తున్నారు. దీని వెనకాల ప్రభాస్‌ ఉన్నారనే విషయం తెలిసిందే. ఇక ప్రభాస్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇండియన్‌ బిగ్గెస్ట్ సూపర్‌ స్టార్‌గా, పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన విషయం తెలిసిందే. 
 

99

ప్రభాస్ తమ్ముడు సిద్ధార్థ్‌ రాజ్‌ కుమార్‌. 2011లో `కెరటం` చిత్రం ద్వారా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో రకుల్ ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. కానీ ఆయన హీరోగా రాణించలేకపోయాడు. దీంతో సినిమాలకు దూరమయ్యారు. ప్రస్తుతం ప్రభాస్‌, కృష్ణంరాజు ఫ్యామిలీనే సినిమాలో యాక్టివ్‌గా ఉంది. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
కృష్ణంరాజు
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Pakash Raj: నాలుగు రాష్ట్రాల్లో నాలుగు ఓటర్ ఐడీలు, ప్రకాష్ రాజ్ అరెస్ట్ .. నాన్ బెయిలబుల్ వారెంట్
Recommended image2
Vijay London Trip: బ్రిటన్‌లో ఫ్యామిలీ రీయూనియన్? భార్య సంగీతను కలవనున్న సీఎం విజయ్?
Recommended image3
Duniya Vijay Divorce: భార్యకి విడాకులు ఇచ్చిన బాలయ్య విలన్‌, భరణం కింద 2 కోట్లు.. మరో కండీషన్‌ కూడా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved