- Home
- Entertainment
- శోభన్ బాబుని ఏరా అని పిలిచే ఏకైక స్టార్ హీరో, మరణానికి 4 రోజుల ముందు జరిగింది ఇదే.. కన్నీళ్లు ఆపుకోలేరు
శోభన్ బాబుని ఏరా అని పిలిచే ఏకైక స్టార్ హీరో, మరణానికి 4 రోజుల ముందు జరిగింది ఇదే.. కన్నీళ్లు ఆపుకోలేరు
Sobhan Babu and Krishnam Raju: శోభన్ బాబు ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టారు అని అంటుంటారు. కానీ అది వాస్తవం కాదు. అనవసరంగా ఖర్చు చేయరు. అవసరం అయితే ఎంతైనా ఖర్చుపెడతారు. మేమిద్దరం కలుసుకుంటే తానే ఖర్చు మొత్తం భరించేవాడు.

Sobhan Babu, Krishnam Raju
టాలీవుడ్ సోగ్గాడు శోభన్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే. మహిళల్లో, ఫ్యామిలీ ఆడియన్స్ లో శోభన్ బాబు విపరీతంగా అభిమానులని సొంతం చేసుకున్నారు. క్రమశిక్షణ, డబ్బు సేవ్ చేసుకోవడంలో శోభన్ బాబు తర్వాతే ఎవరైనా అని టాలీవుడ్ లో చాలా మంది చెబుతుంటారు. శోభన్ బాబుకి టాలీవుడ్ ప్రాణ స్నేహితులు చాలా మంది ఉన్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ లని ఆయన బాగా అభిమానిస్తారు.
Sobhan Babu
సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజుతో మంచి స్నేహం ఉంది. శోభన్ బాబుని కృష్ణం రాజు ఒక ఈవెంట్ లో గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. శోభన్ బాబు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే నాకు స్నేహితుడు అయ్యాడు. శోభన్ బాబు 10 చిత్రాల్లో నటించిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళాను అని కృష్ణం రాజు తెలిపారు. ఇంట్లో గోడపై పెద్ద ఫోటో ఒకటి ఉంది. అది ఎన్టీఆర్ గారి ఫోటో. ఎన్టీఆర్ ని శోభన్ బాబు అంతలా ఆరాధిస్తారు అని కృష్ణంరాజు తెలిపారు.
Krishnam Raju
శోభన్ బాబు ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టారు అని అంటుంటారు. కానీ అది వాస్తవం కాదు. అనవసరంగా ఖర్చు చేయరు. అవసరం అయితే ఎంతైనా ఖర్చుపెడతారు. మేమిద్దరం కలుసుకుంటే తానే ఖర్చు మొత్తం భరించేవాడు. స్నేహితులంటే ప్రాణం ఇస్తాడు. డబ్బు దాచుకోడమే కాదు అప్పుడప్పుడూ పొలం కానీ, ల్యాండ్ కానీ కొనాలని చెప్పేవాడు.
శోభన్ బాబు పుట్టినరోజును నేను మరచిపోను. జనవరి 14 ఉదయం 6 గంటలకే శోభన్ బాబుకి ఫోన్ చేస్తాను. జన్మదిన శుభాకాంక్షలు రా అని చెబుతాను. వాడు తిరిగి నీకు ఎలా జ్ఞాపకం ఉంటుంది రా అని అడుగుతాడు. నీ పుట్టినరోజుని నేను మరచిపోనురా ఎందుకంటే అది మా నాన్న పుట్టినరోజు కూడా అని చెప్పినట్లు కృష్ణంరాజు అన్నారు. మేం మాట్లాడుకుంటే ఏరా పోరా అనే మాట్లాడుకుంటాం అని కృష్ణంరాజు తెలిపారు.
Krishnam Raju
శోభన్ బాబు మరణించడానికి నాలుగు రోజుల ముందు నాకు ఫోన్ చేశాడు. మనం కలసి చాలా రోజులైంది. ఒకసారి ఫ్యామిలీతో కలసి ఇంటికి రారా అని పిలిచాడు. సరే వీలు చూసుకుని వస్తాను లేరా అని చెప్పాను. నాలుగు రోజుల తర్వాత నేను ఢిల్లీ నుంచి ఎయిర్పోర్ట్ లో దిగతుంటే ఫోన్ వచ్చింది. ఇలాగ బాబు.. అని అంటున్నారు. ఏంటయ్యా బాబు ఏంటి అని భయంతో అడిగాను. వాళ్ళు కూడా చెప్పడానికి భయపడ్డారు. కానీ ఆయా వార్త విని భరించేలేకపోయాను. చివరగా కలవకుండా తప్పుచేశాను అంటూ కృష్ణం రాజు కన్నీళ్లు పెట్టుకున్నారు.