కృష్ణం రాజు ఆస్తుల వివరాలు.. మొగల్తూరులోనే అంత ఉందా, దిమ్మతిరిగిపోద్ది..
రెబల్ స్టార్ గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన కృష్ణం రాజు మృతితో టాలీవుడ్ మొత్తం విషాదంలో మునిగిపోయింది. దాదాపు 60 ఏళ్ళకి పైగా కృష్ణం రాజు సినీ కెరీర్ కొనసాగింది.
రెబల్ స్టార్ గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన కృష్ణం రాజు మృతితో టాలీవుడ్ మొత్తం విషాదంలో మునిగిపోయింది. దాదాపు 60 ఏళ్ళకి పైగా కృష్ణం రాజు సినీ కెరీర్ కొనసాగింది. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వందలాది చిత్రాల్లో నటించారు. రౌద్ర రసం, కరుణ రసం పండించడంలో ఆయనకి ఆయనే సాటి.
కృష్ణం రాజు మృతితో అభిమానులు ఆయన జీవితాన్ని నెమరు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో కృష్ణం రాజు ఆస్తుల గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. కృష్ణం రాజు 1940 జనవరి 20న మొగల్తూరులో ఉప్పలపాటి వీర వెంకట సత్యనారాయణ రాజు, లక్ష్మి దేవి దంపతులకు జన్మించారు. వీరిది ధనిక కుటుంబమే.
కృష్ణం రాజుకి వారసత్వంగా మొగల్తూరులో వందల ఎకరాల భూమి ఉన్నట్లు తెలుస్తోంది. ఆ భూమి నిర్వహణ మొత్తం మొగల్తూరులో ఉన్న కృష్ణం రాజు బంధువులే చూసుకుంటారట. అలాగే మొగల్తూరులో ఒక భవనం కూడా ఉందట. ఇక చెన్నై, హైదరాబాద్ నగరాల్లో మొత్తం కృష్ణం రాజుకి నాలుగు ఖరీదైన ఇల్లు ఉన్నాయి.
ప్రస్తుతం ఆయన జూబ్లీహిల్స్ లో నివాసం ఉంటున్న ఇంటి ఖరీదు 18 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అలాగే హైదరాబాద్ లో కృష్ణం రాజుకి ఒక ఫామ్ హౌస్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గోపికృష్ణ అనే నిర్మాణ సంస్థని కూడా కృష్ణం రాజు స్థాపించారు.
ఇక కృష్ణం రాజు 90 లక్షల విలువైన ముర్సిడీజ్ బెంజ్ కారు, 40 లక్షలు విలువైన టొయోట ఫార్చునర్ కారు, 90 లక్షల విలువైన వోల్వో ఎక్స్ సి లాంటి కార్లు ఉపయోగిస్తారు. ఇక కృష్ణం రాజుగారిది రాజుల కుటుంబం కాబట్టి వారి ఇంట్లో ఎప్పుడూ విందులు, పార్టీలు గ్రాండ్ గా జరుగుతూ ఉంటాయి.
ఇంటికి అతిథులు ఎవరు వచ్చినా సరే నోరూరించే వంటకాలతో విందు భోజనం రెడీ అయిపోతుంది. ఈ అలవాటు కృష్ణం రాజుకి వారసత్వంగా తన తండ్రి నుంచి వచ్చిందట. ఇప్పడు ప్రభాస్ కి కూడా ఆ అలవాటు వచ్చింది. మొత్తంగా ప్రభాస్ ఆస్తి విలువ 600 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు. ఇప్పుడు ప్రభాస్ పెదనాన్ననే మించిపోయేలా సంపాదిస్తున్నాడు. కృష్ణం రాజుకి మొత్తం ముగ్గురు కుమార్తెలు సంతానం. సాయి ప్రసీద, సాయి ప్రదీప్తి, సాయి ప్రకీర్తి కృష్ణం రాజు సంతానం.