- Home
- Entertainment
- 23 ఏళ్ళ తర్వాత అది బయట పెట్టిన కృష్ణవంశీ..'మురారి' ఫ్లాప్ అన్నవారికి దిమ్మతిరిగే కౌంటర్
23 ఏళ్ళ తర్వాత అది బయట పెట్టిన కృష్ణవంశీ..'మురారి' ఫ్లాప్ అన్నవారికి దిమ్మతిరిగే కౌంటర్
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మురారి చిత్రం ఆగష్టు 9న రీ రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో సోషల్ మీడియాలో మురారి చిత్రం గురించి అభిమానులు జోరుగా చర్చ జరుగుతోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మురారి చిత్రం ఆగష్టు 9న రీ రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో సోషల్ మీడియాలో మురారి చిత్రం గురించి అభిమానులు జోరుగా చర్చ జరుగుతోంది. మరోసారి అంతా మురారి విశేషాలని గుర్తు చేసుకుంటున్నారు.
కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్ బాబు నటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. గోదావరి అందాలు చూపిస్తూ, కుటుంబ బంధాలకు పెద్ద పీట వేస్తూ కృష్ణవంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కుటుంబానికి తగిలిన శాపం.. దాని చుట్టూ అల్లిన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
Murari
మహేష్ బాబు కెరీర్ లో పెర్ఫామెన్స్ పరంగా ఈ చిత్రం ఒక క్లాసిక్ గా నిలిచిపోతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. మణిశర్మ కూడా అద్భుతమైన సంగీతం అందించారు. అయితే ఈ చిత్రం కమర్షియల్ సక్సెస్ పై సినీ జనాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
ఇప్పుడు మురారి రీరిలీజ్ కి రెడీ అవుతుండడంతో ఆ చర్చ కూడా జరుగుతోంది. కృష్ణ వంశి కూడా మురారి చిత్రం గురించి అనేక విషయాలు వివరిస్తున్నారు. ఇందిరాగాంధీ కుటుంబంలో హత్యలకు ఈ చిత్ర కథని ఎలా లింక్ చేసారు అనేది వివరించారు.
అయితే ఓ నెటిజన్ మురారి ఫ్లాప్ మూవీ అంటూ కామెంట్ పెట్టాడు. దీనిపై కృష్ణ వంశీ స్పందించారు. మురారి ఫ్లాప్ అంటూ వాగే వాళ్ళ నోర్లు మూయించారు.' హలో అండీ.. మురారి చిత్ర నిర్మాత దగ్గర నేను స్వయంగా 55 లక్షలతో తూర్పుగోదావరి జిల్లా హక్కులు కొన్నాను. ఫస్ట్ రన్ లోనే మురారి చిత్రం 1.30 కోట్లు వసూళ్లు రాబట్టింది.
ఒక వేళ సినిమాకి వసూళ్లే ప్రామాణికం అయితే దీనిని బట్టి మీరే నిర్ణయించుకోండి.. మురారి ఫ్లాప్ చిత్రమా లేక సూపర్ హిట్టా అని అంటూ కృష్ణ వంశీ కౌంటర్ వేశారు. దాదాపు 23 ఏళ్ళ క్రితం రిలీజ్ అయిన మురారి చిత్ర కలెక్షన్స్ ని కృష్ణ వంశి ఇప్పుడు బయట పెట్టడంతో ఈ విషయం వైరల్ గా మారింది.