- Home
- Entertainment
- కృష్ణంరాజు పరిచయం చేయాలనుకున్నా హీరో ఎవరు? ప్రభాస్ కాదు, ఇప్పుడు స్టార్ హీరో, నెక్ట్స్ ఇంటర్నేషనల్ స్టార్
కృష్ణంరాజు పరిచయం చేయాలనుకున్నా హీరో ఎవరు? ప్రభాస్ కాదు, ఇప్పుడు స్టార్ హీరో, నెక్ట్స్ ఇంటర్నేషనల్ స్టార్
రెబల్ స్టార్ కృష్ణంరాజు.. తన వారసుడు ప్రభాస్‌ని కాకుండా మరో హీరోని హీరోగా పరిచయం చేయాలనుకున్నారట. ఇప్పుడు ఆయన ఇంటర్నేషనల్ స్టార్‌గా మారే దశలో ఉండటం విశేషం.

కృష్ణంరాజు టాలీవుడ్ రెబల్ స్టార్‌గా రాణించారు. ఏఎన్టీఆర్, ఏఎన్నార్‌ల తర్వాత ఆ స్థాయి ఇమేజ్‌తో స్టార్ హీరోగా మెప్పించిన హీరో. కృష్ణ, శోభన్‌బాబులకు సమకాలీకుడిగా రాణించారు. ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి ఆకట్టుకున్నాడు. పౌరాణికాలు, సాంఘీకాలు, జనపదాలు ఇలా అన్ని రకాల సినిమాలు చేశారు. అయితే ఆ తర్వాత అగ్రెసివ్‌గా ఉండే పాత్రలు చేసి రెబల్ స్టార్‌గా పేరుతెచ్చుకున్నారు. ఆయన గతేడాది అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే.
కృష్ణంరాజు వారసత్వాన్ని ప్రభాస్ కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఆయన గ్లోబల్ స్టార్ గా రాణిస్తున్నాడు. `కల్కి 2898 ఏడీ` చిత్రంతో తానేంటో ఇండియన్ బాక్సాఫీసుకి పరిచయం చేశారు. ఈ సినిమా వెయ్యి కోట్ల కలెక్షన్లు దాటింది. ఇంకా విజయవంతంగా రన్ అవుతుంది. రెబల్ స్టార్ నుంచి గ్లోబల్‌స్టార్‌గా ఎదుగుతున్నాడు ప్రభాస్.
ఇదిలా ఉంటే కృష్ణంరాజు.. ప్రభాస్‌ని కాకుండా మరో హీరోని తన బ్యానర్‌లో పరిచయం చేయాలనుకున్నారట. అందుకు ఓ సినిమాని కూడా అనుకున్నారు. ఆ హీరో తండ్రితోనూ చర్చలు జరిగాయి. ఎందుకో ఏమో ఆ ప్రాజెక్ట్ వర్కౌట్ కాలేదు. దీంతో ఓ స్టార్ డైరెక్టర్‌తో ఆ హీరో పరిచయం జరిగింది. ఇప్పుడు ఆయన సూపర్ స్టార్‌గా రాణిస్తున్నారు.
ఇంతకి ఆ హీరో ఎవరు అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు. కృష్ణ, కృష్ణంరాజుల మధ్య అప్పట్లో మంచి అనుబంధం ఉంది. అది ఎంత అంటే కృష్ణ చిన్న కూతురిని కృష్ణంరాజు దత్తత తీసుకుంటాను అనేంతగా. కృష్ణ చిన్న కూతురుని పెంచుకుంటానని కృష్ణంరాజు అడిగారట. ఏం జరిగిందో ఏమో అది కుదరలేదు.
అంతేకాదు మహేష్ బాబు హీరోగా తానే పరిచయం చేస్తానని చెప్పాడట కృష్ణంరాజు. `బాబీ` అనే సినిమాతో తన గీతా కృష్ణ బ్యానర్‌లో మహేష్‌ని హీరోగా పరిచయం చేయాలనుకున్నారట. ప్రాథమిక చర్చలు కూడా జరిగాయి. కానీ సబ్జెక్ట్, డైరెక్టర్‌ని చూసుకుని మంచి లాంచింగ్ ఉండాలని చెప్పి, కృష్ణంరాజు ప్రపోజల్‌ని తిరస్కరించారట కృష్ణ. అలా మహేష్ పరిచయాన్ని కృష్ణంరాజు మిస్ చేసుకున్నాడు. ఆ మధ్య జరిగిన `శ్రీ శ్రీ` ఆడియో ఫంక్షన్‌లో కృష్ణంరాజు ఈ విషయాన్ని వెల్లడించడం విశేషం.
`రాజకుమారుడు` చిత్రంతో మహేష్ బాబు హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు ఈ మూవీకి దర్శకత్వం వహించారు. అశ్వనీదత్ నిర్మించారు. ఈ సినిమా బాగానే ఆడింది. కానీ పెద్ద హిట్ కాలేదు. ఆ తర్వాత మూడేళ్లకి `బాబీ` సినిమా చేశారు. శోభన్ దర్శకత్వం వహించగా, కె కృష్ణమోహన్ రావు నిర్మించారు. ఇక `మురారి` చిత్రంతో హిట్ అందుకున్న మహేష్ బాబు `ఒక్కడు`తో బ్రేక్ అందుకున్నాడు. `పోకిరి`తో సూపర్ స్టార్ అయ్యాడు.
Mahesh Babu
ఇప్పుడు రాజమౌళితో సినిమా చేస్తున్నాడు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఈ మూవీని రూపొందించబోతున్నారు. గ్లోబల్ మార్కెట్ టార్గెట్‌గా రాజమౌళి ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం మహేష్ కొత్త మేకోవర్‌లోకి మారిపోతున్నాడు. జుట్టు పెంచి `జాన్ విక్` తరహా లుక్‌లోకి మారిపోతున్నాడు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఓ సాహసికుడి యాత్ర ప్రధానంగా యాక్షన్ థ్రిల్లర్‌గాఈ మూవీని తెరకెక్కించబోతున్నారు. వెయ్యి కోట్లతో నిర్మించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కాబోతుంది.