- Home
- Entertainment
- Krishna Mukunda Murari: నిజం తెలుసుకుని షాకైన మురారి.. కోపంతో భర్త కాలర్ పట్టుకున్న కృష్ణ!
Krishna Mukunda Murari: నిజం తెలుసుకుని షాకైన మురారి.. కోపంతో భర్త కాలర్ పట్టుకున్న కృష్ణ!
Krishna Mukunda Murari: స్టార్ మా లో ప్రసారమవుతున్న కృష్ణ ముకుందా మురారి సీరియల్ మంచి కథ కథనాలతో టాప్ రేటింగ్ ని సంపాదిస్తుంది. తనకి తెలియకుండానే మాట ఇచ్చి ఇద్దరి మధ్య ఇరుక్కుపోయిన ఒక పోలీస్ ఆఫీసర్ కధ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 12 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో నువ్వు ఆపరేషన్ చేస్తే పేషెంట్ పైకి నువ్వు జైల్లోకి పోతావు అంటుంది ముకుంద. పేషంటు పెద్దవారు బాగోవాలని కోరుకో అంటూ భవానిని చూసి చెప్తుంది కృష్ణ. మరోవైపు ఆలోచనలో ఉన్న మురారి పెద్దమ్మ ముహూర్తం ఎన్ని గంటలకి పెట్టించిందో తెలుసుకోవాలి. ఒకవేళ ఆ ముహూర్తం పొద్దున్న ఉంటే గౌతమ్ ని సాయంత్రం ముహూర్తం పెట్టుకోమని చెప్పాలి. కృష్ణ కి పెద్దమ్మకి ఇద్దరికీ ఇచ్చిన మాట తప్పకూడదు అనుకుంటూ వెనక్కి తిరిగే సరికి అప్పుడే వచ్చిన కృష్ణని గుద్దేస్తాడు మురారి. కింద పడిన కృష్ణ దెయ్యం పట్టినట్లుగా యాక్ట్ చేస్తుంది.
నాకు మండిందంటే తీసుకెళ్లి సెల్ లో వేస్తాను అంటాడు మురారి. నేను ఒప్పుకోను నా లెక్క ప్రకారం మీరు భయపడాలి అంటుంది కృష్ణ. చిన్న పాప నాతో ఆడుతున్నట్లుగా ఉంది అంటాడు మురారి. బైరాగి అంటే ఎందుకు భయపడలేదు అంటుంది కృష్ణ. ఎందుకంటే బైరాగి అనేవాడు లేడు అంటాడు మురారి. నన్ను ఫూల్చే స్తారా అంటూ కోప్పడుతుంది కృష్ణ. ఇద్దరూ నవ్వుకుంటారు. నడుము పట్టేసినట్లుగా ఉంది అని కృష్ణ అనటంతో నేను పట్టుకొని నడిపిస్తాను అంటూ ఆమెని జాగ్రత్తగా పట్టుకొని నడిపిస్తాడు మురారి. నేను ఇంకా నడవలేనా చెంగుమని గెంత లేనా అంటూ భయపడుతుంది కృష్ణ.
అలాంటిదేమీ లేదు నేను కిందికి వెళ్లి అమ్మని పంపిస్తాను తను బామ్ రాస్తుంది అని చెప్పి కృష్ణని మంచం మీద కూర్చోబెట్టి కిందికి వెళ్తాడు మురారి. ఒకసారిగా లేచి తీన్మార్ డాన్స్ చేస్తుంది కృష్ణ. అప్పుడే వచ్చిన మురారి అదంతా చూసి దెయ్యం అంటే భయపడలేదని ఇంత నాటకం ఆడతావా అంటూ ఆమెని పట్టుకోడానికి ప్రయత్నిస్తాడు. కాసేపటి తర్వాత అలిసిపోయి ఇద్దరూ కూర్చుంటారు. సరే కానీ నేను కిందకి వెళ్తాను పెద్దమ్మ అప్పచెప్పిన పని చేయాలి అంటూ కిందికి వెళ్లిపోతాడు మురారి. దీనికి ఏం పని అప్పు చెప్పారు పెద్ద అత్తయ్య అని ఆలోచనలో పడుతుంది కృష్ణ.
మరోవైపు భవాని, మురారి ఏదో ఒక విషయంలో టెన్షన్ పడుతున్నట్లుగా ఉన్నాడు అని ప్రసాద్ కి ఈశ్వర్ కి చెప్తుంది. ఎందుకు తెలియదు కానీ టెన్షన్ మాత్రం పడుతున్నాడు అంటాడు ఈశ్వర్.కృష్ణ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉంది అంటుంది భవాని. అవును ఆపరేషన్ సక్సెస్ చేస్తాను అంటూ నీతోనే ఛాలెంజ్ చేస్తుంది అంటాడు ఈశ్వర్. అదంతా వింటున్న ముకుంద, కృష్ణ ఆపరేషన్ చేస్తానంటే వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు అంటూ అనుమాన పడుతుంది. మరోవైపు తన దగ్గరికి వచ్చి వెళ్ళిపోతున్న మురారిని ఏదో అడగాలని వచ్చావు ఎందుకు అనుమాన పడుతున్నావు అని అడుగుతుంది భవాని.
నందిని పెళ్లి పొద్దున్నా, సాయంత్రమా అని అడుగుతాడు మురారి. రెండు కాదు మధ్యాహ్నం అంటుంది భవాని. ఆరోజు నీకేమైనా పని ఉందా అని భవాని అడిగితే అలాంటిదేమీ లేదు టైం తెలుసుకుందామనే అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు మురారి. మురారి ఎందుకు స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడు అంటుంది భవాని. ఆరోజు వాడికి ఆఫీసులో పని ఏమైనా ఉందేమో అయినా వాడు ఇచ్చిన మాట తప్పుడు అంటాడు ఈశ్వర్. అంతలోనే అక్కడికి ముకుంద వచ్చి ఏం జరిగిందో నాకు అర్థం కావడం లేదు అంటుంది. టైం వస్తే అన్నీ అవే తెలుస్తాయి పెళ్లి పనులు మాత్రమే చెయ్యి చాలు
నందిని పెళ్లి విషయం ఇంట్లో ఎవరికీ ముఖ్యంగా కృష్ణకి తెలియనీయకు అంటుంది భవాని. నందిని పెళ్లంటే ఎక్కువగా సంతోషించేది కృష్ణ అలాంటిది కృష్ణకే తెలియకూడదు అంటారేంటి అనుకుంటుంది ముకుంద. మరోవైపు మూడీ గా ఉన్న భర్తని ఏమైంది అని అడుగుతుంది కృష్ణ. ఒక సమస్య వచ్చి పడింది అంటాడు మురారి. సాగదీయకుండా విషయం చెప్పండి అంటుంది కృష్ణ. నేను మీ గౌతమ్ సర్కిల్ ఒక మాట ఇచ్చాను ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోలేకపోతున్నాను అంటాడు మురారి. ఒకసారి గా షాక్ అయినా కృష్ణ ఏమంటున్నారు అంటుంది.
ఆరోజు నాకు పెద్ద పని ఉంది అంటాడు మురారి. మీరు కూడా అందరిలాంటి వారే మాట నిలబెట్టుకోలేని వారు ఎందుకు మాట ఇవ్వటం. నేనేమైనా ఆస్తులు అంతస్తులు అడిగానా ఒక జంటకి పెళ్లి చేయమన్నాను అంతే కదా కృష్ణ. కోపం వచ్చిందా నిన్ను ఆట పట్టించడానికి అలా చెప్పాను అంటూ అసలు నిజాన్ని బయటపెడతాడు మురారి.
ఇంతకీ గౌతమ్ పెళ్లి ముహూర్తం ఎన్ని గంటలకి అంటే ఆదివారం ఒంటి గంటకి అంటుంది కృష్ణ. ఒక్కసారిగా షాక్ అయిన మురారి కింద కూలబడిపోతాడు. తరువాయి భాగంలో అందంగా ముస్తాబైన ముకుందా ఎలా ఉన్నాను అని మురారిని అడుగుతుంది. అతనితో సెల్ఫీ తీసుకుంటుంది. మరోవైపు మీరు మోసం చేస్తారని తెలుసు అంటూ భర్త కాలర్ పట్టుకుంటుంది కృష్ణ.