- Home
- Entertainment
- వరుసగా నంది అవార్డులు ఆ నటుడికే, టాలీవుడ్ ని అవమానించేలా డైరెక్టర్ కామెంట్స్.. కోపంతో కోట చేశారో తెలుసా
వరుసగా నంది అవార్డులు ఆ నటుడికే, టాలీవుడ్ ని అవమానించేలా డైరెక్టర్ కామెంట్స్.. కోపంతో కోట చేశారో తెలుసా
టాలీవుడ్ లో ఎక్కువగా తెలుగు నటులకే అవకాశాలు ఇవ్వాలని చాలా కాలం పాటు కోటా శ్రీనివాసరావు బలంగా తన గళం వినిపించారు. ఈ క్రమంలో కోటా శ్రీనివాసరావు కొన్ని వివాదాల్లో చిక్కుకున్నారు.

తన నటనతో నాలుగు దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఆదివారం రోజు తుది శ్వాస విడిచారు. కోట మరణంతో టాలీవుడ్ లో విషాదం నెలకొంది. సినీ, రాజకీయ ప్రముఖులు కోట పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు. కోట శ్రీనివాసరావు ప్రాణం ఖరీదు చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. బ్యాంకు ఉద్యోగిగా ఉన్న ఆయన నటనపై ఆసక్తితో సినిమా రంగంలోకి వచ్చారు.
నటుడిగా గుర్తింపు వచ్చాక బ్యాంకు ఉద్యోగాన్ని వదిలేశారు. 1985లో విడుదలైన ప్రతిఘటన చిత్రంతో కోట శ్రీనివాసరావు కెరీర్ మారిపోయింది. ఒక్కసారిగా ఆయన స్టార్ నటుడిగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత అహ నా పెళ్ళంట చిత్రం ఆయనలోని కామెడీ యాంగిల్ ని బయటపెట్టింది. అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావుకి వ్యతిరేకంగా తెరకెక్కించిన మండలాదీశుడు చిత్రంలో కోటా శ్రీనివాసరావు నటించిన సంచలనం సృష్టించారు.
కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా కోటా శ్రీనివాసరావు పాపులర్ అయ్యారు. టాలీవుడ్ లో ఎక్కువగా తెలుగు నటులకే అవకాశాలు ఇవ్వాలని చాలా కాలం పాటు కోటా శ్రీనివాసరావు బలంగా తన గళం వినిపించారు. ఈ క్రమంలో కోటా శ్రీనివాసరావు కొన్ని వివాదాల్లో చిక్కుకున్నారు.
ఒక సందర్భంలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కి వరుసగా మూడు నంది అవార్డులు వచ్చాయి. 2002 లో ఖడ్గం చిత్రానికి ప్రకాష్ రాజ్ ఉత్తమ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు అందుకున్నారు. ఆ మరుసటి ఏడాది గంగోత్రి చిత్రానికి ఉత్తమ విలన్ గా, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి చిత్రానికి ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రకాష్ రాజ్ నంది అవార్డులు అందుకున్నారు.
దీంతో ప్రకాష్ రాజ్ ని అభినందించే క్రమంలో డైరెక్టర్ కృష్ణ వంశీ తెలుగు నటులను అవమానించేలా కామెంట్ చేశారు. ప్రకాష్ రాజ్ కి వరుసగా నంది అవార్డులు వస్తున్నాయి అంటే దాని అర్థం.. అలాంటి గొప్ప నటులు తెలుగులో లేరు అని అంటూ కృష్ణవంశీ కామెంట్ చేశారు. కృష్ణవంశీ వ్యాఖ్యలతో కోటా శ్రీనివాసరావు బాగా హర్ట్ అయ్యారు. కృష్ణవంశీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోట కౌంటర్ ఇచ్చారు.
దీంతో వారిద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత కృష్ణవంశీ కోటా శ్రీనివాసరావు గురించి కొన్ని నెగిటివ్ కామెంట్స్ చేయడం మరింత వివాదానికి దారి తీసింది. కోట మద్యం సేవించి షూటింగ్ కి వస్తారని, ఇబ్బంది పెడతారని కృష్ణవంశీ ఓ సందర్భంలో అన్నారు. ఆ విధంగా వీరిద్దరి మధ్య వివాదం చెలరేగింది.

