MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Kota Srinivasa Rao: చిరంజీవి, పవన్ కళ్యాణ్ లేకపోతే అసలు అతడెవరు ? దుమ్ము దులిపేసిన కోట శ్రీనివాసరావు

Kota Srinivasa Rao: చిరంజీవి, పవన్ కళ్యాణ్ లేకపోతే అసలు అతడెవరు ? దుమ్ము దులిపేసిన కోట శ్రీనివాసరావు

కోట శ్రీనివాసరావు చేసిన తన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. కోట కొన్నిసార్లు తన వ్యాఖ్యలతో వివాదాల్లో సైతం నిలిచారు. ఇండస్ట్రీలో కోటకి ప్రకాష్ రాజ్, నాగబాబు లాంటి వారితో విభేదాలు ఉన్నాయి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 04 2026, 04:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Kota Srinivasa Rao
Image Credit : Asianet News

Kota Srinivasa Rao

దివంగత నటుడు కోట శ్రీవాసరావు నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన విలక్షణ నటనతో దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకులని కోట అలరించారు. కోట శ్రీనివాసరావు నటనతో మాత్రమే కాదు తన కామెంట్స్ తో సైతం వార్తల్లో నిలిచేవారు. ముక్కుసూటిగా మాట్లాడడం ఆయన నైజం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ప్రకాష్ రాజ్ తో విభేదాలు
Image Credit : Youtube/suman tv

ప్రకాష్ రాజ్ తో విభేదాలు

తెలుగు సినిమాల్లో తెలుగు వారికే ఎక్కువ అవకాశాలు ఉండాలి అని అని బలంగా గళం వినిపించిన వారిలో కోట శ్రీనివాసరావు ఒకరు. కోట శ్రీనివాసరావు షాయాజీ షిండే లాంటి పరభాషా నటుల్ని బహిరంగంగా వ్యతిరేకించారు. ప్రకాష్ రాజ్ తో కూడా కోట శ్రీనివాసరావుకి విభేదాలు ఉన్నాయి. ప్రకాష్ రాజ్ మా అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కోట శ్రీనివాసరావు విమర్శలు చేశారు.

35
ప్రకాష్ రాజ్ కోసం మేము ఎదురు చూడాలా ?
Image Credit : facebook/kota srinivasa rao

ప్రకాష్ రాజ్ కోసం మేము ఎదురు చూడాలా ?

ప్రకాష్ రాజ్ ఏనాడూ షూటింగ్స్ కి సరైన టైం కి రాలేదని కోట అన్నారు. అతడి కోసం మేమంతా ఎదురుచూస్తూ సెట్ లో ఉండాలి. ఎప్పుడో 11గంటలకు వస్తాడు. ఎక్కడ వెళ్ళిపోతాడో అని డైరెక్టర్ మొదట అతడి సన్నివేశాలు పూర్తి చేస్తాడు. అప్పటి వరకు మేమంతా ఎదురుచూడాలి. నిర్మాత దగ్గర డబ్బులు తీసుకుని నటిస్తున్నందుకు బాధ్యత ఉండాలి కదా అని కోట ప్రశ్నించారు.

45
నాగబాబు వివాదాస్పద కామెంట్స్
Image Credit : youtube/tfpc

నాగబాబు వివాదాస్పద కామెంట్స్

ప్రకాష్ రాజ్ ని విమర్శించినందుకు నాగబాబు కోటపై మండిపడ్డారు. కోట లాంటి నటులు ప్రకాష్ కాలి గోటికి కూడా సరిపోరు అని నాగబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోట తరచుగా చేస్తున్న వ్యాఖ్యలతో తాను విసిగిపోయాను అని అందుకే ఇలా మాట్లాడుతున్నాను అని నాగబాబు అన్నారు.

55
చిరంజీవి, పవన్ లేకపోతే నాగబాబు ఎవరు ?
Image Credit : Asianet News

చిరంజీవి, పవన్ లేకపోతే నాగబాబు ఎవరు ?

నాగబాబు వ్యాఖ్యలపై కోట కూడా ధీటుగానే కౌంటర్ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో కోట మాట్లాడుతూ.. అసలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు లేకపోతే నాగబాబు అనేవాడు ఎవడు ? అసలు నాగబాబుకు ఏం అర్హత ఉంది ? మంచి నటుడు కాదు.. గొప్ప రాజకీయ నాయకుడు కాదు. అలాంటప్పుడు నాగబాబు ఎందుకు అలా మాట్లాడాలి. అసలు నాగబాబుకు ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తిని వెనుకేసుకురావాల్సిన అవసరం ఏముంది అని కోట అన్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: రోహిత్ ను మరోసారి టార్గెట్ చేసిన టీమ్, ఇచ్చిపడేసిన నాగార్జున, అసలేం జరుగుతోంది
Recommended image2
Charan Eliminate: బిగ్ బాస్‌ తెలుగు 10 ఐదో వారం డబుల్‌ ఎలిమినేషన్‌.. చరణ్‌ ఎలిమినేట్‌
Recommended image3
Vijay Deverakonda: పాన్‌ ఇండియా స్టార్స్ కి విజయ్‌ దేవరకొండ బిగ్‌ షాక్‌.. సంచలన స్టేట్‌మెంట్‌
Related Stories
Recommended image1
Savitri: ఒంటి మీద బట్టలు తప్ప మిగిలినవన్నీ ఇచ్చేసిన సావిత్రి, క్షణం కూడా ఆలోచించలేదు.. మహానటికి సెల్యూట్
Recommended image2
Dasara Movies: చిరు Vs రజినీ మాత్రమే కాదు..దసరా బరిలో బాలయ్య, వెంకీ, నాగ్.. బాక్సాఫీస్ అల్లకల్లోలమే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved