చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయో తెలుసా.. కొణిదెల సురేఖ కామెంట్స్
చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య మరో పోలిక కూడా ఉందని చిరు సతీమణి కొణిదెల సురేఖ అంటున్నారు. చిరంజీవి, కళ్యాణ్ బాబు ఆహారపు అలవాట్లు ఒక్కటే అని సురేఖ అన్నారు.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్ర షూటింగ్ తో బిజీగా ఉన్నారు. 200 కోట్లపైగా బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇక చిరు సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా పాలిటిక్స్ తో బిజీ బిజీగా ఉన్నారు.
పవన్ కళ్యాణ్, చిరంజీవి ఇద్దరూ కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం లో ముందుటారు. ఇద్దరిదీ సహాయం చేసే గుణం అని చాలా మంది సన్నిహితులు చెబుతుంటారు. ఆ మేరకు చిరంజీవి, పవన్ కళ్యాణ్ సామజిక సేవ కార్యక్రమాలు చేయడం చూస్తూనే ఉన్నాం. అయితే చిరంజీవి కాస్త సౌమ్యుడు అనే అభిప్రాయం ఉంది.
కానీ పవన్ కళ్యాణ్ ముక్కుసూటి వ్యక్తి అని అంటుంటారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వైవిధ్యం కనిపిస్తుంది. అయితే చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య మరో పోలిక కూడా ఉందని చిరు సతీమణి కొణిదెల సురేఖ అంటున్నారు. చిరంజీవి, కళ్యాణ్ బాబు ఆహారపు అలవాట్లు ఒక్కటే అని సురేఖ అన్నారు.
ఇద్దరికీ భోజనం విషయంలో పెద్దగా డిమాండ్లు ఉండవు. పచ్చడి మెతుకులు పెట్టినా తృప్తిగా తినేస్తారు. పలానా వంటకాలు కావాలని కోరుకోరు. ఏది ఉంటే అది తినేస్తారు అని సురేఖ అన్నారు. నాగబాబు కాస్త భిన్నం.. నాగబాబుకు భోజనంలో అన్ని రుచులు ఉండాలి.
భోజనం విషయంలో మా మామ గారి గురించి తప్పకుండా చెప్పాలి. ఆయన ఎంతో పద్దతిగా చక్కగా తింటారు. ఆయన తినడం చూస్తే పక్కన వాళ్ళకి కూడా తినాలనిపిస్తుంది. నేను వంటలు పెళ్లయ్యాకే నేర్చుకున్నట్లు సురేఖ అన్నారు.
పెళ్లయ్యాక ఒకసారి ఉప్మా చేశా. ఉండలు ఉండలు గా వచ్చింది. మా మావయ్య వంటలు బాగా చేస్తారు. మావయ్య, అత్తగారి నుంచే వంటలు నేర్చుకున్నట్లు సురేఖ వివరించారు.