Dhanush 50th Film : ధనుష్ స్వీయ దర్శకత్వంలో తన 50వ సినిమా... ఇంట్రెస్టింగ్ టైటిల్, ఫస్ట్ లుక్!
కోలీవుడ్ స్టార్ ధనుష్ (Dhanush) తన కెరీర్ లో 50వ సినిమాను పూర్తి చేశారు. తనే దర్శకుడిగా, రచయితగా వస్తున్న ఈ చిత్రం ఫస్ట్ పోస్టర్, టైటిల్ విడుదలైంది. డిటేయిల్స్ ఆసక్తికరంగా ఉన్నాయి.
తమిళ స్టార్ నటుడు ధనుష్ కు తెలుగు ప్రేక్షకుల్లోను మంచి క్రేజ్ ఉంది. అందరు హీరోలను అభిమానించినట్టే తెలుగు ఆడియెన్స్ ధనుష్ సినిమాలను (Dhanush Movies)ని ఆదరించారు. దీంతో ఆయనకు ఇక్కడా మార్కెట్ ఏర్పడింది.
ధనుష్ కెరీర్ లో ఇప్పటి వరకు 50 సినిమాలను పూర్తి చేశారు. 49 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక హాఫ్ సెంచరీ కొడుతూ తన 50వ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ధనుష్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుండటం విశేషం.
గతేడాది జనవరిలోనే ఈ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఏడాది తర్వాత ఇప్పుడు టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఏకంగా నాలుగు భాషల్లో ధనుష్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. టైటిల్, పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది.
ధనుష్ 50వ సినిమాకు ‘రాయన్’ (Raayan) అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఫస్ట్ లుక్ లో ధనుష్ లుక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆయన లుక్ చాలా కొత్తగా ఉంది. పోస్టర్ ను పరిశీలిస్తే యాక్షన్, క్రైమ్ అంశాలతో చిత్రం రూపుదిద్దుకుంటున్నట్టు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఇలా ఉన్నాయి... ఇది ధనుష్ 50వ సినిమా కావడం విశేషం. పైగా ఆయన రచన, దర్శకత్వంలో రాబోతుండటం మరింతగా అంచనాలను పెంచింది. కళానిధి మారన్ నిర్మాతగా సన్ పిక్చర్స్ లో వంద కోట్లతో నిర్మించడం విశేషం.
ధనుష్ కెరీర్ లోని ఈ స్పెషల్ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (AR Rahman) సంగీతం అందిస్తుండటం విశేషం. తమిళంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం తమిళం, హిందీలో విడుదల కాబోతోంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.