సైలెంట్ గా రెండో పెళ్లి చేసుకున్న కాజల్.? తలలు బాదుకుంటున్న ఫ్యాన్స్.. ఎందుకంటే?
దాదాపు 20 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో యాక్టివ్ ఉంటున్న నటి కాజల్ తాజాగా షాకింగ్ పోస్ట్ పెట్టింది. తన పెళ్లికి సంబంధించిన ఫొటోను అభిమానులతో పంచుకుంది. సైలెంట్ గా మరో పెళ్లి చేసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
నటి కాజల్ పసుపతి (Kaajal Pasupathi) కోలీవుడ్ లో చాలా కాలంగా సినిమాలు చేస్తోంది. దాదాపు 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో యాక్టివ్ గా కనిపిస్తోంది. కీలక పాత్రలు పోషిస్తూ ఆడియెన్స్ ను అలరిస్తోంది. స్టార్ హీరోల సినిమాల్లో మెరుస్తూ తమిళ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ దక్కించుకుంది.
ఇక తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. కానీ తమిళ స్టార్ సూర్య నటించిన ‘సింగం’ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రతో ఆకట్టుకుంది. ఓ ముఠాను పట్టుకునే సీన్ తో బాగానే పాపులర్ అయ్యింది. ఇప్పటికీ ఆ సీన్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతూనే ఉంటుంది.
ఇక కాజల్ పసుపతి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. రీల్స్ చేస్తూ తన అభిమానులను, నెటిజన్లను బాగానే ఆకట్టుకుంటుంటారు. అయితే కాజల్ తాజాగా పెట్టిన పోస్ట్ ఒకటి వైరల్ గా మారింది. ఆమె పెళ్లిపీటలపై కూర్చున్న ఫొటోను పంచుకోవడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.
ఆమె 2008లో తమిళ చిత్రాల కొరియోగ్రఫర్ శాండీ మాస్టర్ ను పెళ్లి చేసుకుంది. మనస్పార్థాలతో నాలుగేళ్ల తర్వాత 2012లో విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి బ్యాచిలర్ గానే ఉంటోంది. ఈ క్రమంలో తాజాగా తను రెండో పెళ్లి చేసుకున్నట్టు తెలిపే ఈ ఫొటోను షేర్ చేసింది. కానీ తన హస్బెండ్ ను మాత్రం పరిచయం చేయలేదు.
పెళ్లి ఫొటో పంచుకుంది కానీ.. వరుడు ఎవరనే విషయాన్ని రివీల్ చేయలేదు. ఇలా ఆమె ఇచ్చిన ట్విస్ట్ లకు అభిమానులు తలలు పట్టుకున్నారు. మీ హస్బెండ్ ఎవరో చెప్పండి అంటూ నెట్టింట ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో మరో సందేహం కూడా కలుగుతోంది.
ప్రస్తుతం ఆమె చేతిలో ఎలాంటి ప్రాజెక్ట్స్ కూడా లేవు. కానీ తన రాబోయే చిత్రాల ప్రమోషన్స్ కోసం ఏమైనా ఇలాంటి పోస్ట్ పెట్టిందా? అని సందేహిస్తున్నారు. దీనిపై కాజల్ స్పష్టత ఇస్తేగానీ అసలు విషయం తెలిసేలా లేదు. ప్రస్తుతం ఆ వెడ్డింగ్ పిక్ మాత్రం వైరల్ గా మారింది.