MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చిరంజీవితో సినిమా చేయకూడదని పెద్దలతో మీటింగ్ పెట్టిన నిర్మాత..చివరికి ఆయనే చప్పట్లు కొట్టారు

చిరంజీవితో సినిమా చేయకూడదని పెద్దలతో మీటింగ్ పెట్టిన నిర్మాత..చివరికి ఆయనే చప్పట్లు కొట్టారు

మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యే అవకాశం చాలా తక్కువ మందికి దక్కుతుంది. వారిలో కోడి రామకృష్ణ ఒకరు. టాలీవుడ్ వైవిధ్యమైన గొప్ప దర్శకుడిగా కోడి రామకృష్ణ గుర్తింపు సొంతం చేసుకున్నారు. గ్రాఫిక్స్ మాయాజాలాన్ని టాలీవుడ్ కి పరిచయం చేసింది ఆయనే. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 27 2024, 10:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యే అవకాశం చాలా తక్కువ మందికి దక్కుతుంది. వారిలో కోడి రామకృష్ణ ఒకరు. టాలీవుడ్ వైవిధ్యమైన గొప్ప దర్శకుడిగా కోడి రామకృష్ణ గుర్తింపు సొంతం చేసుకున్నారు. గ్రాఫిక్స్ మాయాజాలాన్ని టాలీవుడ్ కి పరిచయం చేసింది ఆయనే. గ్రాఫిక్స్ తో కూడిన చిత్రాలు చేస్తూనే ఎన్నో కుటుంబ కథా చిత్రాలు కూడా కోడి రామకృష్ణ తెరకెక్కించారు. 

 

26

1982లో చిరంజీవి నటించిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రంతో కోడి రామకృష్ణ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ చిత్రం విషయంలో చాలా ఊహించని మలుపులు జరిగాయట. ఈ చిత్రాన్ని నిర్మాత కోటిపల్లి రాఘవ నిర్మించారు. కోడి రామకృష్ణ ముందుగా కథని రాఘవకి చెప్పారు. హీరోగా ఎవరిని అనుకుంటున్నావు అని అడిగారు. దీనికి కోడి రామకృష్ణ సమాధానం ఇస్తూ చిరంజీవి అని చెప్పారు. చిరంజీవికి అప్పుడప్పుడే మంచి గుర్తింపు వస్తోంది. 

 

36

కానీ రాఘవకి నమ్మకమైన హీరోలు కొందరు ఉన్నారు. వారిలో ఎవరో ఒకరితో ఈ చిత్రం చేయాలని అడిగారట. కోడి రామకృష్ణ అందుకు ఒప్పుకోలేదు. ఈ కథకి చిరంజీవి అయితేనే కరెక్ట్ అని చెప్పారట. అయితే ఈ రోజు సాయంత్రం కొందరు పెద్దలతో మీటింగ్ ఏర్పాటు చేస్తా.. నా హీరోలు కాకుండా ఈ చిత్రానికి చిరంజీవిని ఎందుకు తీసుకోవాలో ఆ మీటింగ్ లో నువ్వు అందరిని కన్విన్స్ చేయాలి. లేకుంటే ఈ సినిమా నేను చేయను అని రాఘవ చెప్పారట. 

 

46

కోడి రామకృష్ణ మీటింగ్ లో.. హీరో పాత్రని హీరోయిన్ అవమానిస్తూ ఉంటుంది, అనుమానిస్తూ ఉంటుంది. ఇబ్బంది పెడుతుంది. అలాంటప్పుడు హీరోపై ఆడియన్స్ లో సింపతీ ఉండాలి. ఆడియన్స్ లో సింపతీ కలిగించేలా నటించగలిగేది చిరంజీవి మాత్రమే అని కోడి రామకృష్ణ చెప్పారు. రాఘవతో పాటు అక్కడ ఉన్నవారంతా క్లాప్స్ కొట్టారట. 

 

56

రాఘవ గారు చిరంజీవిని పిలిపించి కోడి రామకృష్ణని పరిచయం చేశారు. నన్ను చూసి కుర్రాడిని ఎంకరేజ్ చేయాలనిపిస్తోంది అని చిరంజీవి అన్నారు. మాది కూడా మొగల్తూరు సర్ అని చెప్పారట కోడి రామకృష్ణ.. అవునా అని చిరంజీవి అంటే.. పక్కనే పాలకొల్లు సర్ అని రామకృష్ణ అన్నారు. సరే నాకు టైం ఉన్నప్పుడు ఇంటికి పిలుస్తాను.. కథ చెప్పు అని అడిగారు. కానీ కండిషన్.. కథ నచ్చితేనే సినిమా చేస్తా లేకుంటే లేదు అని చిరంజీవి అన్నారు. ఆ తర్వాత కోడి రామకృష్ణ చిరంజీవికి ఇంటికి వెళ్లి కథ చెప్పారు. 3 గంటల పాటు చిరంజీవి కథ విన్నారు. కథ నచ్చిందో లేదు చెప్పలేదు. సస్పెన్స్ లో పెట్టేశారు. హార్లిక్స్ తాగుతావా అని అడిగారు.. వెంటనే సురేఖ గారు హార్లిక్స్ తీసుకువచ్చారు. 

 

66

కథనాకు పూర్తిగా నచ్చలేదు అని చిరంజీవి షాకిచ్చారట. కానీ మిగిలిన పాత్రలు చాలా బావున్నాయి. కాబట్టి ఈ సినిమా నేను చేస్తున్నాను అని చెప్పారు. ఆయా విధంగా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో పూర్ణిమ, మాధవి హీరోయిన్లుగా నటించారు. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Nagarjuna కెరీర్ లో ఇష్టపడి చేయలేకపోయిన పాత్ర ఏదో తెలుసా? కారణం ఏంటి?
Recommended image2
Oscars 2026: ఆస్కార్స్ రెడ్ కార్పెట్‌పై ప్రియాంక చోప్రా.. ఫ్యాషన్‌తో అదరగొట్టిన హాలీవుడ్ తారలు
Recommended image3
Ajith Kumar: 2027 వరకు కార్ రేసింగ్, షూటింగ్ గ్యాప్‌లో ట్రాక్‌పైకి.. స్టార్ హీరో షెడ్యూల్ ఇదే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved