బిగ్ బాస్ హౌస్ లో వారం ఉన్నందుకు కిరణ్ రాథోడ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది. ఈ సీజన్ లో ఫస్ట్ ఎలిమినేషన్ కిరణ్ రాథోడ్. మరి ఈ వారంరోజులకు గాను మాజీ హీరోయిన్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంది...?
kiran rathod
బిగ్ బాస్ సీజన్ 6 ప్లాప్ అవ్వడంతో.. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 ని కొత్త గా ప్లాన్ చేశారు టీమ్. అనుకున్నట్టుగనే హౌస్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే హౌస్ లో సీరియెస్ నెస్ వచ్చేసింది. ఇక ఈ సీజన్ లో అప్పుడే వారం రోజులు అయిపోయింది. ఇక అప్పుడు ఫస్ట్ ఎలిమినేషన్ కూడా అయిపోయింది. బిగ్ బాస్ ఇంట్లోకి సెలబ్రెటీగా వచ్చిన కిరణ్ రాథోడ్ ఈ వారం ఎలిమినేట్ అయ్యింది.
ఇక హౌస్ లోకి 12వ కంటెస్టెంట్ గా వచ్చింద కిరణ్. ఈమె చాలా మందికి సుపరిచితమే. తమిళంలో జెమిని సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ఈమెకి మంచి ఆఫర్లు వచ్చినా... సినిమాల సెలక్షన్ లో ఆమె చేసిన పొరపాట్ల వల్ల.. హీరోయిన్ గా స్టార్ డమ్ సాధించలేకపోయింది. ఆతరువాత యంగ్ క్యారెక్టర్ రోల్స్ చేసుకుంటూ ఉండిపోయింది.
నువ్వులేక నేను లేను సినిమాలో.. తరుణ్ మరదలిగా కిరణ్ కనిపించింది. తన పొరపాట్ల వల్ల టాప్ హీరోయిన్ గా ఎదిగే అవకాశాలు పోగొట్టుకుంది. తర్వాత వ్యాంప్ పాత్రలు, గ్లామర్ రోల్స్ వంటివి చేస్తూ కాలం గడిపింది. రాను రాను ఆ పాత్రలు కూడా కరువయ్యాయి. దాంతో సినిమాలకు దూరం అయ్యింది బ్యూటీ. ఇక ఇప్పటికీ స్ట్రాంగ్ రీ ఎంట్రీ కోసం ఎదరు చూస్తూనే ఉంది. ఈక్రమంలోనే బిగ్ బాస్ ఆఫర్ ఆమెను వరించింది.
Kiran Rathod in Big Boss
బిగ్ బాస్ సీజన్ 7 లో ఛాన్స్ వచ్చింది కాని.. ఫస్ట్ వీక్ సడెన్ గా బయటకు వచ్చేసింది బ్యూటీ.. మొదటి వారమే ఈమె ఎలిమినేట్ అవ్వడం అందరికీ షాకిచ్చింది. ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయినట్టు చూపించారు. నామినేషన్స్, ఓటింగ్ ప్రక్రియ ప్రకారమే కిరణ్ రాధోడ్ ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది.
Kiran rathod
తక్కువ ఓట్లు రావడం అలాగే కిరణ్ రాథోడ్ ఎటువంటి డిజిటల్ టీంని కూడా పెట్టుకోకపోవడం వల్ల.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో ఆమె జర్నీ ముగించుకున్నట్టు అర్ధం అవుతోంది. ఇక బిగ్ బాబాస్ హౌస్ లో వారం రోజలు ఉన్నారు కిరణ్ రాథోడ్. ఈ వారం రోజులు ఆమె ఎంత తీసుకుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అయితే బిగ్ బాస్ హౌస్ లో ఆమె ఉన్న వారం రోజులకు గాను కిరణ్ రాథోడ్ కి బిగ్ బాస్ యాజమాన్యం ఒక్కో రోజుకి 45 వేల చొప్పున పారితోషికం చెల్లించినట్టు తెలుస్తుంది. మొత్తంగా దాని లెక్క 3 లక్షల పైనే ఉంటుందని స్పష్టమవుతుంది. ఇందులో జీఎస్టీ అదనంగా అంటే ప్రత్యేకంగా చెల్లించినట్టు సమాచారం.