- Home
- Entertainment
- Nagarjuna: 'థాంక్యూ' డిజాస్టర్ రిజల్ట్ నాగార్జునకి ముందే తెలుసా.. దిల్ రాజు దెబ్బతో డబుల్ షాక్
Nagarjuna: 'థాంక్యూ' డిజాస్టర్ రిజల్ట్ నాగార్జునకి ముందే తెలుసా.. దిల్ రాజు దెబ్బతో డబుల్ షాక్
అక్కినేని నాగ చైతన్య నటించిన థాంక్యూ మూవీ జూలై 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి అంచనాలతో థియేటర్స్ లోకి వచ్చింది.

అక్కినేని నాగ చైతన్య నటించిన థాంక్యూ మూవీ జూలై 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి అంచనాలతో థియేటర్స్ లోకి వచ్చింది. పైగా ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత కావడంతో అక్కినేని ఫ్యాన్స్ నమ్మకం పెట్టుకున్నారు.
కానీ ఈ చిత్రం రిలీజ్ అయ్యాక అక్కినేని ఫ్యాన్స్ కి ఊహించని షాక్. నాగ చైతన్య కెరీర్ లోనే బిగ్ డిజాస్టర్ దిశగా పయనిస్తోంది. గతంలో నాగ చైతన్య ప్లాప్ సినిమాలకు వచ్చిన వసూళ్ళలో 50 శాతం వసూళ్లు కూడా ఈ చిత్రానికి రావడం లేదు. విక్రమ్ కుమార్ లాంటి దర్శకుడు ఇలా చేశాడు ఏంటి అంటూ అంతా ఆశ్చర్యపోతున్నారు.
ఇదిలా ఉండగా థాంక్యూ మూవీ విషయంలో నాగార్జున సైలెంట్ గా ఉండడం గురించి ఆసక్తికర కారణాలు వినిపిస్తున్నాయి. థాంక్యూ చిత్రానికి సపోర్ట్ గా నాగార్జున చిన్న ట్వీట్ కూడా చేయలేదు. ఇది నాగ చైతన్య మూవీ.. పైగా అక్కినేని ఫ్యామిలీకి 'మనం' లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ మూవీ. అయినప్పటికీ నాగార్జున థాంక్యూ మూవీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
నాగార్జునకి థాంక్యూ మూవీ రిజల్ట్ ముందే తెలుసు అని.. అందుకే ఆయన సైలెంట్ గా ఉన్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. నాగ చైతన్యకి దిల్ రాజు నుంచి ఇది రెండవ షాక్. గతంలో నాగార్జున స్వయంగా నాగ చైతన్య భవిష్యత్తుని దిల్ రాజు చేతుల్లో పెట్టారు.
నాగ చైతన్యని జోష్ చిత్రంతో ఇండస్ట్రీకి లాంచ్ చేసింది దిల్ రాజే. జోష్ మూవీ ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్న థాంక్యూ కూడా బిగ్ డిజాస్టర్ గా మారిపోతోంది.
రెండు రోజుల్లో థాంక్యూ చిత్రం వరల్డ్ వైడ్ గా రాబట్టిన షేర్ కేవలం మూడు కోట్లు మాత్రమే. ఇటీవల నాగచైతన్య ఫ్లాప్ చిత్రాలు కూడా తొలిరోజే 3 కోట్లకు పైగా షేర్ రాబట్టాయి. థాంక్యూ మూవీ శనివారం తెలుగు రాష్ట్రాల్లో కేవలాం 70 లక్షల షేర్ మాత్రమే రాబట్టింది.