- Home
- Entertainment
- Weight Loss: షాకింగ్.. ఏకంగా 40 కిలోల బరువు తగ్గిన హీరోయిన్, ఖుష్బూ ఫాలో అయిన జపనీస్ ట్రిక్ ఇదే
Weight Loss: షాకింగ్.. ఏకంగా 40 కిలోల బరువు తగ్గిన హీరోయిన్, ఖుష్బూ ఫాలో అయిన జపనీస్ ట్రిక్ ఇదే
కొన్నేళ్ల క్రితం 98 కిలోల బరువుతో ఉన్న నటి ఖుష్బూ సుందర్, ఇప్పుడు సన్నగా, ఫిట్‌గా మారి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇంతలా బరువు తగ్గడానికి ఆమె ఒక సింపుల్ జపనీస్ ట్రిక్‌ను ఫాలో అయ్యారట. ఆ ట్రిక్ వల్లే ఆమె ఏకంగా 40 కిలోలు తగ్గారు.
16

Image Credit : Social Media
నటి ఖుష్బూ సుందర్
బరువు పెరగడం కేవలం మన శరీరాకృతిపైనే కాదు, రోజువారీ పనులపైనా ప్రభావం చూపుతుంది. మెట్లు ఎక్కడం, ఎక్కువసేపు నిలబడటం, మామూలుగా నడవడం కూడా కొందరికి కష్టమవుతుంది. నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
26
Image Credit : Asianet News
జపనీస్ ట్రిక్‌తో బరువు తగ్గిన ఖుష్బూ
నటి ఖుష్బూ బరువు పెరగడంతో నడవడానికి కూడా ఇబ్బంది పడ్డారట. కానీ, క్రమంగా తన జీవనశైలిని మార్చుకుని, ఒక ప్రత్యేకమైన జపనీస్ ఫిట్‌నెస్ టెక్నిక్‌తో ఏకంగా 40 కిలోల బరువు తగ్గారు. ఆ జపనీస్ ప్లేట్ ట్రిక్ ఏంటో, ఆమె ఎలా బరువు తగ్గారో చూద్దాం.
36
Image Credit : Social Media
అధిక బరువుతో రోజువారీ పనులే కష్టమయ్యాయి
2019లో రజినీకాంత్ 'అన్నాత్తే' సినిమా షూటింగ్ సమయంలో ఖుష్బూ బరువు 98.6 కిలోలు ఉండేవారట. అధిక బరువు వల్ల నడవడం, మెట్లు ఎక్కడం వంటి పనులు చాలా కష్టంగా ఉండేవని ఆమె చెప్పారు. శరీరం త్వరగా అలసిపోయేదని, కొన్నిసార్లు చిన్న పనులు కూడా భారంగా అనిపించేవని తన అనుభవాన్ని పంచుకున్నారు.
46
Image Credit : instagram
ఏమిటీ జపనీస్ ‘ప్లేట్ ట్రిక్’?
ఖుష్బూ బరువు తగ్గడానికి వాడిన పద్ధతుల్లో ముఖ్యమైంది 'జపనీస్ ప్లేట్ ట్రిక్'. దీని కాన్సెప్ట్ చాలా సింపుల్. పెద్ద ప్లేట్ బదులు చిన్న ప్లేట్ వాడటం. దీనివల్ల తక్కువ ఆహారం తిన్నా ప్లేట్ నిండుగా కనిపిస్తుంది. దాంతో 'చాలా తిన్నాను' అనే ఫీలింగ్ మనసుకు కలుగుతుంది. అదే పెద్ద ప్లేట్‌లో అయితే తక్కువగా కనిపిస్తుంది, ఇంకా తినాలనిపిస్తుంది. ఈ ట్రిక్‌తో ఖుష్బూ పోర్షన్ కంట్రోల్ చేసుకున్నారు.
56
Image Credit : instagram
ఆహారంలోనూ అనేక మార్పులు
బరువు తగ్గే ప్రయాణంలో ఆహారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చానని ఖుష్బూ చెప్పారు. తినే పరిమాణాన్ని తగ్గించడంతో పాటు, పోషకాలున్న ఆహారంపై దృష్టి పెట్టారు. తనకు గ్లూటెన్ పడకపోవడంతో (గ్లూటెన్ ఇంటాలరెన్స్) గోధుమ, మైదా తినడం మానేశానని తెలిపారు. అవి తిన్నప్పుడు కడుపు ఉబ్బరంగా అనిపించేదని ఆమె చెప్పారు.
66
Image Credit : Google
వాకింగ్ మాత్రమే కాదు, జీవనశైలిలోనూ మార్పు
బరువు తగ్గడానికి ఖుష్బూ కేవలం వాకింగ్‌కే పరిమితం కాలేదు. సరైన ఆహార నియమాలు, క్రమం తప్పని వ్యాయామం, క్రమశిక్షణతో కూడిన జీవనశైలిపై కూడా ఆమె దృష్టి పెట్టారు. ఇలా తన లైఫ్‌స్టైల్‌లో మార్పులు చేసుకుని బరువు తగ్గినట్లు ఖుష్బూ తెలిపారు.
Latest Videos

