MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Khushbu: నటుడు ప్రభుతో పెళ్లి, విడాకులపై ఖుష్బూ రియాక్షన్‌ ఇదే.. సింపుల్‌గా తేల్చేసిన హీరోయిన్‌

Khushbu: నటుడు ప్రభుతో పెళ్లి, విడాకులపై ఖుష్బూ రియాక్షన్‌ ఇదే.. సింపుల్‌గా తేల్చేసిన హీరోయిన్‌

సీనియర్‌ హీరోయిన్‌, ఇప్పుడు జబర్దస్త్ షో ద్వారా తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైన నటి ఖుష్బూ.. నటుడు ప్రభుతో పెళ్లి, విడాకులపై స్పందించింది. ఆమె క్రేజీగా రియాక్ట్ అయ్యింది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : May 26 2026, 05:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జబర్దస్త్ షోతో ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గరైన ఖుష్బూ
Image Credit : instagram

జబర్దస్త్ షోతో ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గరైన ఖుష్బూ

ఖుష్బూ సుందర్.. ఓ వైపు సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తూనే, మరోవైపు తెలుగులో జబర్దస్త్ కామెడీ షోకి జడ్జ్ గానూ చేస్తుంది. హీరోయిన్‌గా కంటే ఇప్పుడు టీవీ షో ద్వారా తెలుగు ఆడియెన్స్ కి బాగా దగ్గరవుతుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గరైన ఈ సీనియర్‌ నటి తన జీవితంలోని ఒక ఆసక్తికర విషయంపై స్పందించింది. తనపై వచ్చిన రూమర్లకి క్లారిటీ ఇచ్చింది. సింపుల్‌గా అసలు విషయాన్ని తేల్చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
దర్శకుడు సుందర్‌ సి ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఖుష్బూ
Image Credit : our own

దర్శకుడు సుందర్‌ సి ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఖుష్బూ

ఖుష్బూ.. నటుడు, దర్శకుడు సుందర్‌ సిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరు `మురై మామన్‌` అనే సినిమా షూటింగ్‌ టైమ్‌లో ప్రేమలో పడ్డారు. నిజానికి ఈ మూవీలో మొదట హీరోయిన్‌గా సౌందర్యని అనుకున్నాడు సుందర్‌ సి. ఆయనకిది దర్శకుడిగా ఫస్ట్ మూవీ. సౌందర్య అయితే బాగుంటుందనుకున్నారు. ఆ తర్వాత మీనా వద్దకు వెళ్లారు. ఆమె బిజీగా ఉండటం వల్ల ఖుష్బూని తీసుకోవాల్సి వచ్చింది. ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే ఇద్దరి మనసులు కలిశాయి. ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు.

Related Articles

Related image1
Bandla Ganesh: పెద్దమనిషి చేతిలో చెప్పుదెబ్బలు, భార్య ముందు కన్నీళ్లు.. బండ్ల గణేష్‌ జీవితాన్నే మార్చేసిన సంఘటన
Related image2
Namitha: శ్రీకాంత్‌తో డాన్స్ చేయనని తెగేసి చెప్పిన హీరోయిన్‌, రంగంలోకి బాయ్‌ ఫ్రెండ్‌.. నిజాలు బయటపెట్టిన దర్శకుడు
35
ప్రభుతో ఖుష్బూ మ్యారేజ్‌ వార్తలు
Image Credit : instagram/@khushsundar

ప్రభుతో ఖుష్బూ మ్యారేజ్‌ వార్తలు

కానీ అప్పట్లో ప్రభుతో ఖుష్బూ విషయంలో రూమర్స్ వచ్చాయి. అప్పట్లో నటుడు ప్రభు కూడా హీరోగా రాణించారు. మంచి సినిమాలు చేశారు. ప్రభుతో కలిసి చాలా సినిమాలు చేసింది ఖుష్బూ. వీరు హిట్‌ పెయిర్‌గా నిలిచారు. దీంతో ఇద్దరి మధ్య చాలా రూమర్స్ వచ్చాయి. ఇద్దరు కలిసి ప్రేమలో పడ్డారని పెళ్లి కూడా చేసుకున్నారనే వార్తలు మీడియాలో వచ్చాయి. ఆ తర్వాత విడాకులు తీసుకున్నారని కూడా రాశారు. ఈ నేపథ్యంలో దీనిపై తాజాగా ఖుష్బూ స్పందించింది. సుమన్‌ టీవీ నుంచి రోషన్‌ ఈ ప్రశ్నని ఖుష్బూని అడిగాడు, ఆ మధ్య ఆయన చేసిన ఇంటర్వ్యూలో ఈ ప్రశ్న రాగా ఖుష్బూ క్రేజీగా స్పందించింది.

45
ప్రభుతో పెళ్లి, విడాకులపై ఖుష్బూ రియాక్షన్‌ ఇదే
Image Credit : instagram/@khushsundar

ప్రభుతో పెళ్లి, విడాకులపై ఖుష్బూ రియాక్షన్‌ ఇదే

ప్రభుతో చాలా సినిమాలు చేశానని, మంచి విజయాలు అందుకున్నామని, తమది నైస్‌ పెయిర్‌ అని తెలిపింది ఖుష్బూ. సత్యరాజ్‌తో ఎక్కువ సినిమాలు చేశానని, కార్తీక్‌, తాను, అలాగే ప్రభు తాను కలిసి చాలా సినిమాలు చేశామని, నైస్‌ పెయిర్‌ అని చెప్పింది. కానీ చాలా మంది ఆడియెన్స్, తమ పేరెంట్స్ సైతం కమల్‌ సర్‌తో చేయడాన్ని బాగా ఇష్టపడతారని తెలిపింది. ఈ క్రమంలోనే రూమర్ల ప్రశ్న రావడంతో.. `ఇది చాలా పాత స్టోరీ, ఇప్పుడు దాని గురించి మాట్లాడుకోవాలనుకోవడం లేదు. ఆయన లైఫ్‌లో మంచిగా సెటిల్‌ అయ్యారు, మేం లైఫ్‌లో సెటిల్‌ అయ్యాం. మళ్లీ ఆ విషయాల ప్రస్తావన వద్దు` అని చెప్పేసింది ఖుష్బూ. ప్రభు తన భర్తతో కూడా కలిసి పనిచేశారని, వారంతా 80 గ్రూప్‌లో భాగమే అని తెలిపింది ఖుష్బూ. ఈ వీడియో క్లిప్‌ వైరల్‌ అవుతుంది.

55
ఖుష్బూ తెలుగులో చేసిన పాపులర్‌ మూవీస్‌
Image Credit : instagram/@khushsundar

ఖుష్బూ తెలుగులో చేసిన పాపులర్‌ మూవీస్‌

`కళియుగ పాండవులు` చిత్రంతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఖుష్బూ. ఆ తర్వాత `కెప్టెన్‌ నాగార్జున`, `త్రిమూర్తులు`, `భరతంలో అర్జునుడు`, `కిరాయి దాదా`, `జీవన జ్యోతి`, `గురు శిష్యులు`, `పేకాట పాపారావు`, `స్టాలిన్‌`, `యమదొంగ`, `అజ్ఞాతవాసి`, `ఆడవాళ్లు మీకు జోహార్లు`, `రామబాణం` వంటి చిత్రాల్లో నటించింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Related Stories
Recommended image1
Bandla Ganesh: పెద్దమనిషి చేతిలో చెప్పుదెబ్బలు, భార్య ముందు కన్నీళ్లు.. బండ్ల గణేష్‌ జీవితాన్నే మార్చేసిన సంఘటన
Recommended image2
Namitha: శ్రీకాంత్‌తో డాన్స్ చేయనని తెగేసి చెప్పిన హీరోయిన్‌, రంగంలోకి బాయ్‌ ఫ్రెండ్‌.. నిజాలు బయటపెట్టిన దర్శకుడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved