- Home
- Entertainment
- `కేజీఎఫ్ 2` హీరోయిన్ బోల్డ్ స్టేట్‌మెంట్.. ఇమేజ్, క్రేజ్ కంటే అదే ముఖ్యమని తేల్చిచెప్పిన హాట్ బ్యూటీ..
`కేజీఎఫ్ 2` హీరోయిన్ బోల్డ్ స్టేట్‌మెంట్.. ఇమేజ్, క్రేజ్ కంటే అదే ముఖ్యమని తేల్చిచెప్పిన హాట్ బ్యూటీ..
`కేజీఎఫ్` చిత్రాలతో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్న శ్రీనిధి శెట్టి కెరీర్ పరంగా బోల్డ్ అటెంప్ట్ తో ముందుకు సాగుతుంది. ఆమె లేటెస్ట్ గా ఆమె ఇచ్చిన ఓ స్టేట్‌మెంట్ సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ అవుతుంది.

శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) తొలి చిత్రంతోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. రెండో సినిమాతోనే ఆమె పాన్ ఇండియా స్టార్ అయిపోయింది. బాహుశా ఇండియన్ సినిమా చరిత్రలో ఇలాంటి అరుదైన ఘనత సాధించిన హీరోయిన్ మరెవ్వరూ ఉండరు. ఆ అరుదైన ఘనత శ్రీనిధి శెట్టికే దక్కింది. `కేజీఎఫ్`(KGF) చిత్రాలతో ఆమె జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా హీరోయిన్‌గా పిలిపించుకుంటోంది.
`కేజీఎఫ్2`(KGF2) ఇటీవల విడుదలై సంచలనాలు సృష్టించింది. ఈ సినిమా ఏకంగా 12వందల కోట్లకిపైగా కలెక్షన్లని సాధించింది. `బాహుబలి` తర్వాత అత్యధిక కలెక్షన్లని సాధించిన సినిమాగా నిలిచింది. ఇందులో రీనాగా శ్రీనిధి శెట్టి నటించి ఆకట్టుకుంది. మొదట రాఖీ(యష్)ని ద్వేషించే అమ్మాయిగా, ఆ తర్వాత ఆయన చేసే పనులు చూసి ముగ్దురాలైన అమ్మాయిగా కనిపించి ఆకట్టుకుంది. స్టయిల్‌గా, గ్లామరస్‌గా కనిపిస్తూనే, పొగరు, కోపం, అసహనం, లోలోపల ప్రేమ దాచుకున్న అమ్మాయిగా శ్రీనిధి శెట్టి అబ్బురపరిచింది.
`కేజీఎఫ్2` తర్వాత జాతీయ స్థాయిలో గుర్తింపు, క్రేజ్ వచ్చింది. అయితే ఇవేవీ తనకు ముఖ్యం కాదని అంటోంది శ్రీనిధి శెట్టి. `టీవీ9` కథనం ప్రకారం.. శ్రీనిధి శెట్టి ఈ విషయాన్ని పంచుకుంటున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆమె మంచి పేరు, గుర్తింపు, క్రేజ్ వచ్చిన నేపథ్యంలో తనకు ఇవేవి ముఖ్యం కాదని చెప్పినట్టు సమాచారం. అయితే తను మాత్రం డబ్బుకే ప్రయారిటీ ఇస్తానని తెలిపింది.
`కేజీఎఫ్2` తర్వాత ఇంకా మరే సినిమాని ప్రకటించలేదు శ్రీనిధి శెట్టి. ఆమె కోసం ఆఫర్లు క్యూ కడుతున్నట్టు తెలుస్తుంది. అయితే నెక్ట్స్ సినిమాల విషయంలో చాలా ఆచితూచి వ్యవహరిస్తుందట. ఏది పడితే అది కాకుండా బలమైన కథలు కలిగిన సినిమాలు, బలమైన పాత్ర కలిగిన చిత్రాలకే ప్రయారిటీ ఇవ్వాలనుకుంటుందట. అందుకే తన కొత్త సినిమా అనౌన్స్ మెంట్ విషయంలో ఆలస్యమవుతుందని శాండల్ వుడ్ వర్గాలు అంటున్నాయి. బలమైన పాత్రలే కాదు, మంచి పారితోషికం కూడా ముఖ్యమే అని చెబుతుందట శ్రీనిధి. దీంతో ఇప్పుడీ భామ హాట్ టాపిక్ అవుతుంది.
ఇదిలా ఉంటే శ్రీనిధి శెట్టికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఆమె అభిమానులు కోరుకుంటున్న ఓ విషయంలో ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. ఎన్టీఆర్ హీరోగా నటించే ప్రశాంత్ నీల్ సినిమాలో హీరోయిన్‌గా నటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ 31వ సినిమాని తారక్ `కేజీఎఫ్` ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో చేస్తున్నారు. ఇటీవల తన పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఇందులో ఎన్టీఆర్‌కి శ్రీనిధిశెట్టి బాగా సూట్ అవుతుందని అంటున్నారు అభిమానులు.
మరి అభిమానులు, నెటిజన్ల అభిప్రాయాన్ని ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కన్సిడర్ చేస్తారా? మరో స్టార్ హీరోయిన్‌ని ఎంపిక చేస్తారా? అనేది చూడాలి. కానీ ఇప్పుడు శ్రీనిధి శెట్టి మాత్రం సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ అవుతుంది. మరోవైపు తాజాగా ఆమె లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ఆ పిక్స్ ట్రెండింగ్ అవుతున్నాయి.