MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎన్బీకే 107 సినిమాలో కీలకమార్పులు, బాలయ్య సెంటిమెంటే కారణమా...? డైరెక్టర్ కు పెద్ద పనే పెట్టాడుగా..?

ఎన్బీకే 107 సినిమాలో కీలకమార్పులు, బాలయ్య సెంటిమెంటే కారణమా...? డైరెక్టర్ కు పెద్ద పనే పెట్టాడుగా..?

అఖండాతో అఖండ విజయం సాధించిన బాలయ్య.. అదే సెంటిమెంట్ ను NBK107కు కూడా అప్లై చేస్తున్నాడా..? అందుకే సినిమా షూటింగ్ చాలా వరకూ పూర్తి అయిన తరువాత కూడా భారీ మార్పులు చేయిస్తున్నాడా..? ఇంతకీ ఏంటా సెంటిమెంట్...? ఏంటా మార్పులు..?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 20 2022, 09:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

వరుస ఫెయిల్యూర్స్ చూసిన బాలయ్య.. అఖండ సినిమాతో అఖండ విజయం సాధించాడు. ఇక సినిమాలు స్పీడ్ పెంచిన నటసింహం.. గోపీచంద్ మలినేనితో యాక్షన్ మూవీ చేస్తున్నాడు. ఈసినిమాలో శృతిహాసన్ హీరోయన్ గా నటిస్తుండగా.. కన్నడ స్టార్ దునియా విజయ్ పవర్ ఫుల్ విలన్ రోల్ లో కనిపించబోతున్నాడు. 

28

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సడెన్ గా ఈసినిమాలో భారీగా మార్పులు చేయడానకి శ్రీకారం చుట్టారట మలినేని టీమ్.  మాస్ మసాలా ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న బాలయ్య సినిమాల కీలక మారపులు చేస్తున్నారట. 
 

38

కొత్తగా రెండు సీన్లు స్క్రిప్ట్ లో యాడ్ చేస్తున్నారట టీమ్. దీనికి కారణ బాలకృష్ణ సెంటిమెంటే అంటున్నారు. అఖండాలో కూడా అదే సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయ్యిందని. అది కంటీన్యూ చేస్తూ.. ఈసినిమాలో కూడా అది ఉండేలా చూడమన్నాడట నటసింహం.

48

వాస్తవానికి బాలయ్య తన ప్రతి సినిమాలోనూ డివోషనల్ టచ్ ఉండేలా చూసుకుంటారు. అది ఆయన సెంటిమెంట్. హిందూ ధర్మాన్ని ఎలివేట్ చేసే విధంగా సన్నివేశాలు ఈసినిమాలో కూడా ఉండాలన్నారట బాలయ్య. అందుకే  యాడ్ చేసే ఆ రెండు సీన్లు డెవోషనల్ టచ్ తో  ఉంటాయని తెలుస్తోంది. 

58

నిజానికి మలినేని గోపీచంద్ చేస్తున్న సినిమా కంప్లీట్ డిఫరెంట్.. పక్కా మాస్,కమర్షియల్ యాక్షన్ మూవీ. రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో బాలయ్య అభిమానులకు భారీ ట్రీట్ ప్లాన్ చేశాడు డైరెక్టర్.  అయితే ఇందులో సడెన్ గా డెవోషనల్ ను మిక్స్ చేయడం అంటే.. అది పెద్ద పనే. అయితే ఒరిజినల్ స్టోరీ సోల్ దెబ్బ తినకుండా.. ఈ సీన్లు యాడ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాడ మలినేని. 
 

68

అఖండలో డివోషనల్ టచ్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే ఇప్పుడు ఎన్బీకే 107 లోనూ డివోషనల్ టచ్ తో ఒకట్రెండు సన్నివేశాలు చేర్చడానికి ప్రయత్నించమని గోపీచంద్ మలినేనిని బాలయ్య కోరారట. అందుకే ఆయన కొత్తగా రెండు సీన్లను చేర్చారని  ప్రచారం జరుగుతోంది. 

78

రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈసినిమాకు  మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీత అందిస్తున్నాడు. అఖండ సినిమాకు తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ రచ్చ రచ్చ చేసింది. ముఖ్యంగా బాలయ్య ఎలివేషన్ సీన్స్ ఫ్యాన్స్ కు పూనకం తెప్పించాయి. దాంతో ఈ మాస్ సినిమాకు కూడా తమనే మ్యూజియ్ చేస్తున్నారు. 

88

ఇక ఈసినిమాకు వేటపాలెం లాంటి కొన్ని టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. ఇందులో బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు అని తెలుస్తోంది. అలాగే శ్రుతీహాసన్ తో పాటు  సెకెండ్ హీరోయిన్ గా మలయాళీ ముద్దుగుమ్మ హనీ రోజ్ ని ఫైనల్ చేశారని టాక్.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
4 వ తరగతి చదివిన ఏఎన్నార్.. ఇంగ్లీష్ అంత అద్భుతంగా ఎలా మాట్లాడేవారో తెలుసా? అక్కినేని చెప్పిన సీక్రెట్..
Recommended image2
రామ్ చరణ్ తో ధనుష్‌ బాక్సాఫీస్ వార్, పెద్ది వర్సెస్ కార, రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Recommended image3
రామ్ చరణ్ కి స్పెషల్ గిఫ్ట్ పంపించిన బాలకృష్ణ, కవల పిల్లలు పుట్టినందుకు ఏం ఇచ్చాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved