- Home
- Entertainment
- ఓనం శారీలో కీర్తిసురేష్ అందం ఓవర్‌లోడ్.. స్లీవ్ లెస్ బ్లౌజ్‌లో బ్యాక్ చూపిస్తూ రచ్చ.. ఇంత బ్యూటీఫుల్‌గానా!
ఓనం శారీలో కీర్తిసురేష్ అందం ఓవర్‌లోడ్.. స్లీవ్ లెస్ బ్లౌజ్‌లో బ్యాక్ చూపిస్తూ రచ్చ.. ఇంత బ్యూటీఫుల్‌గానా!
మహానటి కీర్తిసురేష్.. చీరలో చాలా అందంగా ఉంటుంది. ట్రెండీ వేర్‌లో కంటే ట్రెడిషనల్ లుక్‌లో ఆకట్టుకుంటుంది. చీరలో ఆమె అందం మరింత పెరిగిపోతుంది.

కీర్తిసురేష్ తాజాగా ఓనం లుక్‌లో కనిపించింది. కేరళా ప్రజలు నేడు ఓనం పండుగని జరుపుకుంటున్నారు. దీంతో అక్కడి ఆడపడుచులంతా వైట్, గోల్డ్ కలర్ శారీలో మెరుస్తుంటారు. తాజాగా కీర్తిసురేష్ ఓనం ప్రత్యేకమైన శారీలో మెరిసింది. వైట్ శారీలో హోయలు పోయింది. ట్రాన్పఫరెంట్‌గా ఉన్న ఈ చీరలో ఎంతో అందంగా ఉంది కీర్తి.
అయితే స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి మరింత రచ్చ చేస్తుంది. ఫ్రంటూ, సైడ్‌తోపాటు బ్యాక్ అందాలను చూపిస్తుంది. కుర్రాళ్లని రెచ్చగొడుతుంది. దీనికితోడు స్టయిలీష్ గ్లాసెస్ ధరించి మరింత కట్టిపడేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఓనం శారీ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కీర్తిసురేష్ ఇటీవల `భోళాశంకర్` చిత్రంతో మెరిసింది. ఇందులో చిరంజీవికి చెల్లిగా నటించింది కీర్తి. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఘోర పరాజయం చెందింది.
ఇదే కాదు కీర్తిసురేష్.. రజనీకాంత్‌కి కూడా చెల్లిగా నటించింది. `అన్నాత్తే` చిత్రంలో సూపర్ స్టార్‌కి చెల్లిగా చేసింది. ఆ సినిమా కూడా పరాజయం చెందింది. ఇలా కీర్తి చెల్లిగా చేసిన రెండు సినిమాలు పరాజయం చెందడం గమనార్హం.
ఇక కీర్తిసురేష్‌కి ఇటీవల విజయాలు దక్కడం లేదు. నానితో కలిసి నటించిన `దసరా` చిత్రం మెప్పించింది. ఉన్నంతలో అదే హిట్ గా నిలిచింది. దీంతోపాటు తమిళంలో `మామన్నన్` చిత్రంతో బంపర్ హిట్‌ని సొంతం చేసుకుంది. వరుస పరాజయాల అనంతరం మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కింది.
అంతలోనే `భోళాశంకర్` పెద్ద డిజప్పాయింట్ చేసింది. సక్సెస్ ట్రాక్‌లో పడుతుందనుకునే టైమ్‌లో `భోళా` పెద్ద షాకిచ్చింది. దీంతో మళ్లీ మొదటికొచ్చినట్టయ్యింది. ప్రస్తుతం కీర్తిసురేష్ తమిళంలో వరుసగా సినిమాలు చేస్తుంది. అక్కడ `సిరెన్`, `రఘు తాత`, `రివాల్వర్ రీటా`, `కన్నివేది` చిత్రాలతో బిజీగా ఉంది.
తెలుగులో ఈ బ్యూటీకి ఆఫర్లు లేవు. వరుసగా సినిమాలు పరాజయం చెందడమే అందుకు కారణం కావచ్చు. పైగా గ్లామర్ పాత్రలకు కీర్తి సెట్ కాదనే వాదన కూడా ఉంది. నటనకు స్కోప్ ఉన్న సినిమాల్లో ఆమె మెప్పిస్తుంది, కానీ గ్లామర్‌గా మాత్రం మెప్పించడం కష్టమంటున్నారు. అందుకే ఈ బ్యూటీకి ఛాన్స్ లు రావడం లేదా, లేక కొత్త ప్రాజెక్ట్ ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుందా? అనేది తెలియాల్సి ఉంది.