- Home
- Entertainment
- కీర్తిసురేష్ చబ్బీ లుక్.. భూమిపైకి వచ్చిన సాగరకన్యలా హోయలు పోతూ కేకపెట్టిస్తున్న మహానటి..
కీర్తిసురేష్ చబ్బీ లుక్.. భూమిపైకి వచ్చిన సాగరకన్యలా హోయలు పోతూ కేకపెట్టిస్తున్న మహానటి..
కీర్తిసురేష్ అడపాదడా గ్లామర్ ఫోటోలను పంచుకుంటూ అలరిస్తుంది. సినిమాలో జోరు తగ్గడంతో అందాల ఆరబోతకు పెద్ద పీట వేస్తుంది. తాజాగా ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న కీర్తి రచ్చ చేస్తుంది.

మహానటిగా ఇండియా వైడ్‌గా పాపులర్ అయిన కీర్తిసురేష్ ఇప్పుడు నయా లుక్‌లో మెస్మరైజ్ చేస్తుంది. సాగరకన్య భూమిపైకి వచ్చిందా అనేట్టుగా మెరుస్తుంది. నయా ట్రెండీ వేర్‌లో ఆమె హోయలు పోయింది. చబ్బీ లుక్‌లో మెస్మరైజ్ చేస్తుంది. స్లీవ్ లెస్ డ్రెస్‌లో పిచ్చెక్కిస్తుంది కీర్తి. ఆమె పోజులు, అందాలు కుర్రాళ్లకి మైండ్ బ్లాక్ చేస్తుండటం విశేషం.
కీర్తిసురేష్ తాజాగా నెట్‌ఫ్లిక్స్ కి సంబంధించిన ఓ ఈవెంట్‌లో పాల్గొంది. ఇందులో ఆమె ఈ లేటెస్ట్ లుక్‌లో మెరిసింది. కాస్త బొద్దుగా మారి కనువిందు చేస్తుంది. హాట్‌నెస్ అద్దుకుని కుర్రాళ్లని టెంప్ట్ చేస్తుంది. చిలిపి నవ్వులతో ఆకర్షిస్తుంది ఇప్పుడు ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంది.
కీర్తిసురేష్ ఈ నయా ఫోటోలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. కీర్తి చబ్బీ అవతార్ అంటూ హాట్ కామెంట్లతో రచ్చ చేస్తున్నారు నెటిజన్లు. ఓ వైపు కీర్తి అందాలు, మరోవైపు నెటిజన్ల కామెంట్లతో ఆమె ఫోటోలు హల్‌చల్ చేస్తున్నాయి. అందరి అటెన్షన్ తనవైపుతిప్పుకుంటున్నాయి.
కీర్తిసురేష్ కి `మహానటి` తర్వాత ఇప్పటి వరకు ఒక్క సక్సెస్ కూడా పడలేదు. గతేడాది చేసిన `సర్కారు వారి పాట` చిత్రం కూడా యావరేజ్‌గానే నిలిచింది. దీంతో ఈ బ్యూటీ జోరు కూడా తగ్గింది. ప్రస్తుతం చిరంజీవికి చెల్లిగా `భోళా శంకర్`లో నటిస్తుంది.
మరోవైపు నాని హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ `దసరా`లో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇందులో వెన్నెల పాత్రలో డీ గ్లామర్ లుక్‌లో అలరించబోతుందీ ఈ క్యూట్ బ్యూటీ. ఈ సినిమా మార్చి 30న ఆడియెన్స్ ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.
వీటితోపాటు తమిళంలో `మామన్నన్`, `సైరెన్`, `రఘు తాత`, `రీవాల్వర్ రీటా` చిత్రాలు చేస్తుంది. ఇటీవల `రివాల్వర్ రీటా` చిత్ర ఫస్ట్ లుక్ విడుదల కాగా, సెటైరికల్ కామెడీ గా ఉన్న పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచుతుంది.
కీర్తిసురేష్.. `నేను శైలజ` చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకుని అందరి అటెన్షన్ తనవైపు తిప్పుకుంది. ఆ తర్వాత `మహానటి`తో జాతీయ అవార్డు అందుకుంది. ఇందులో సావిత్రి పాత్రలో జీవించి విశేష మన్ననలు పొందింది కీర్తి.
దీంతో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తూ వచ్చింది. కానీ ఆ తర్వాత ఆమె చేసిన లేడీ ఓరియెంటెడ్ చిత్రాలన్నీ పరాజయం చెందాయి. కమర్షియల్ మూవీస్ చేసినా లాభం లేదు. దీంతో ఒక్కసారిగా డౌన్ అయ్యింది.
ఇప్పుడు మళ్లీ సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తూ కెరీర్ మరింత బలంగా బిల్డ్ చేసుకుంటుందీ ఈ అందాల భామ. బలమైన పాత్రలు, బలమైన కథలకు ప్రయారిటీ ఇస్తుంది. మరోవైపు మేకర్స్ ని ఆకర్షించేందుకు అందాల ఆరబోతలోనూ గేట్లు ఎత్తేస్తుంది.
కీర్తిసురేష్ అడపాదడా గ్లామర్ ఫోటోలను పంచుకుంటూ అలరిస్తుంది. సినిమాలో జోరు తగ్గడంతో అందాల ఆరబోతకు పెద్ద పీట వేస్తుంది. తాజాగా ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న కీర్తి రచ్చ చేస్తుంది.