- Home
- Entertainment
- గ్లామర్ డోసే కాదు, దూకుడూ పెంచిన కళావతి.. స్టయిలీష్ లుక్‌లో టెంప్టింగ్ పోజులు.. వైరల్
గ్లామర్ డోసే కాదు, దూకుడూ పెంచిన కళావతి.. స్టయిలీష్ లుక్‌లో టెంప్టింగ్ పోజులు.. వైరల్
కీర్తిసురేష్ జోరు పెంచింది. గ్లామర్‌పరంగా డోస్ పెంచింది. `మహానటి` నుంచి `కళావతి`గా మారిన ఈ అందాల భామ ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ ఫోటో షూట్లతో ఫ్యాన్స్ కి ఊపిరాడనివ్వడం లేదు. తన అందాలతో ముంచెత్తుతుంది.

Keerthy Suresh
కీర్తిసురేష్(Keerthy Suresh)ని మొన్నటి వరకు `మహానటి`గా పిలుచుకునే వాళ్లు. అభిమానులే కాదు, సాధారణ ఆడియెన్స్ కూడా కీర్తిసురేష్ అంటే మహానటిగానే గుర్తు పడతారు. అంతగా ఆ సినిమాతో ఆడియెన్స్ లో చెరగని ముద్ర వేసుకుంది. కానీ ఇప్పుడు కొత్త పేరు వచ్చి చేరింది. మహేష్ సినిమా కారణంగా `మహానటి` ట్యాగ్‌కి చెక్ పడింది. `కళావతి`గా ఇప్పుడు సందడి చేస్తుంది. పేరు మారడమే కాదు, లుక్‌ని కూడా మార్చేసింది కీర్తి.
Keerthy Suresh
`మహానటి` అంటే గొప్ప నటనకు మారుపేరు. టాలెంట్‌కి కేరాఫ్. హుందాతనానికి ప్రతిబింబం. సాంప్రదాయానికి పెద్ద పీఠ. కీర్తిసురేష్ మొన్నటి వరకు ఇలానే ఉంది. `మహానటి` అనే పదానికి న్యాయం చేసేలా మెలిగింది. అందరిలోనూ అలాంటి ముద్రనే వేసుకుంది. కానీ ఇటీవల ఆమె `సర్కారు వారి పాట` చిత్రంలో కళావతిగా మెప్పించి ఆడియెన్స్ లో ఇప్పుడు `కళావతి`గా ముద్ర వేసుకుంది. ఇప్పుడామెని `మహానటి` గా కాకుండా `కళావతి`గా పిలుచుకోవడం విశేషం. పేరు మార్పే కాదు, తన స్టయిల్ కూడా మార్చేసింది కీర్తిసురేష్. తనలోని కొత్త యాంగిల్స్ ని ఆడియెన్స్ కి పరిచయం చేస్తుంది.
Keerthy Suresh
పేరుతోపాటే ట్రెడిషనల్ లుక్ లోనుంచి ట్రెండీ లుక్‌లోకి మారిపోయింది. గ్లామర్ పరంగానూ ట్రెండ్‌ని ఫాలో అవుతుంది. ఇన్నాళ్లు సాంప్రదాయానికి పెద్దపీఠ వేసిన ఈ అమ్మడు ఇప్పుడు గ్లామర్‌కి గేట్లు ఎత్తేసినట్టుంది. `సర్కారు వారి పాట` చిత్రంలో ఆమె కమర్షియల్ రోల్ చేయడంతో, ఆ సినిమా ప్రమోషన్ నుంచి కీర్తి అత్యంత ట్రెండీగా కనిపిస్తుండటం విశేషం. పొట్టి దుస్తుల్లో క్లీవేజ్ షో చేస్తూ గ్లామర్ డోస్ పెంచుతూ కనిపించింది. వెస్ట్రన్ దుస్తుల్లో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది.
Keerthy Suresh
హోమ్లీ బ్యూటీ నుంచి కమర్షియల్ హీరోయిన్‌గా టర్న్ గా తీసుకుంది కీర్తిసురేష్. మొన్నటి వరకు తాను పెట్టుకున్న హద్దులు చెరిపేసింది. చిన్నప్పటి నుంచి ఉన్న కట్టుబాట్లకి బ్రేక్ చెప్పేసింది. అందాల ఆరబోతకి సిద్ధమే అనే సిగ్నల్స్ ఇవ్వడమే కాదు, ఏకంగా చేసి చూపిస్తుంది. వరుసగా ఆమె గ్లామర్ ఫోటో షూట్లతో రెచ్చిపోతుంది. ఆయా ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకుంటూ ఫ్యాన్స్ ని కనువిందు చేస్తుంది.
Keerthy Suresh
అనూహ్యంగా కీర్తిసురేష్‌లో వచ్చిన ఈ మార్పుకి నెటిజన్లతోపాటు ఆమె అభిమానులు కూడా షాక్ అవుతుండటం విశేషం. ఆమె గ్లామర్ విందుకు ఫిదా అవుతున్నారు. బ్యాక్ టూ బ్యాక్ అందాల ఫోటోలతో కీర్తి దాడి చేస్తున్న నేపథ్యంలో ఊపిరాడక కొట్టుకుంటున్నారు కుర్రాళ్లు. ఇంతటి అందాన్ని చూస్తుంటే తమ ఊపిరాగిపోతుందంటూ కామెంట్లు చేస్తున్నారు.
Keerthy Suresh
లేటెస్ట్ గా కీర్తిసురేష్ స్టయిలీష్ లుక్‌లో కనువిందు చేస్తుంది. బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్‌లో ట్రెండీ వేర్ ధరించి హోయలు పోయింది. గుర్తుపట్టలేనంత స్టయిలీష్‌గా ముస్తాబై కనువిందు చేస్తుంది. ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తుంది. తాజాగా ఆమె పంచుకున్న ఫోటోలు సామాజిక మాధ్యమాలను ఉలిక్కిపాటుకి గురి చేస్తున్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
Keerthy Suresh
కీర్తిసురేష్.. మహేష్‌తో కలిసి నటించిన `సర్కారు వారి పాట`తో ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చినా, కలెక్షన్లు ఫర్వాలేదు. ఈ సినిమాతో `కళావతి`గా తెలుగు ఆడియెన్స్ కి గుర్తిండిపోతుంది కీర్తి. మరోవైపు నానితో `దసరా` చిత్రంలో హీరోయిన్‌గా చేస్తుంది. `భోళాశంకర్` లో చిరంజీవికి చెల్లిగా నటిస్తుంది. అలాగే తమిళంలో ఓ సినిమా, మలయాళంలో మరో సినిమా చేస్తూ బిజీగా ఉంది.