లెజండరీ డైరెక్టర్ కు నో చెప్పిన కీర్తి సురేష్..? ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
కీర్తి సురేష్ గోల్డెన్ ఛాన్స్ మిస్ అయ్యిందా..? ఓ పెద్ద డైరెక్టర్ పిలిచి ఛాన్స్ ఇస్తే కాదన్నదా..? కీర్తి మిస్ చేసుకున్న సినిమా ఏంటీ..? కీర్తి సురేష్ నో చెప్పిన స్టార్ డైరెక్టర్ ఎవరు..?

హీరోయిన్ అంటే ఎప్పుడు ఏ ఛాన్స్ వస్తుంది..? పెద్ద డైరెక్టర్లు కరుణించకపోతారా.. అని ఎదురు చూస్తుంటారు. స్టార్ డైరెక్టర్ల సినిమాలో ఛాన్స్ వస్తే.. ఎగిరి గంతేసి కథ కూడా వినకుండా ఓకే చేస్తుంటారు. అటుంవంటిది.. హీరోయిన్ కీర్తి సురేష్ మాత్రం ఓ లక్కీ ఛాన్స్ ను పోగొట్టుకుందట.
సీనియర్ డైరెక్టర్ మణిరత్నంకు ఎంతటి క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే.. మణిరత్నం మూవీలో నటించే చాన్స్ కోసం స్టార్ హీరోహీరోయిన్లు సైతం పోటీపడుతుంటారు.. ఐశ్వర్యరాయ్ లాంటి వారు కూడా ఆయన సినిమా అంటే చాలు కళ్ళు మూసుకుని సైన్ చేస్తుంటారు.అలాంటి స్టార్ డైరెక్టర్ చాన్స్ ఇస్తే కీర్తి సురేష్ వదులుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
Keerthy Suresh
ఆయన సినిమాల్లో చిన్న రోల్ చేసిన చాలు అని ఎంతోమంది నటీనటులు ఆరాటపడుతుంటారు. అటువంటిది మహానటి కీర్తి సురేశ్ మాత్రం మణిరత్నం తాజా చిత్రం పొన్నియన్ సెల్వన్ మూవీ బృందం నుంచి కీర్తికి పిలుపు అందగా.. డేట్స్ లేవని ఆ లక్కీ చాన్స్ వదుకుందట.
అయతే ఈ విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. ఈ విషయం గురించి రకరకాల స్పందనలు వస్తున్నాయి. రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. కీర్తి సురేష్ ఫ్యాన్స్ అయ్యే అంటుండగా.. మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. మణిరత్నం వంటి స్డార్ డైరెక్టర్ తో మూవీని వదులుకుందా?, చాలా తెలివి తక్కువ పని చేసిందంటూ.. అంటూ నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు.
Keerthy Suresh
మహానటి సినిమాకుగాను కీర్తి సురేష్ జాతీయ అవార్డు అందుకుంది. మహానటి తరువాత ఆమెకు పెద్దగా హిట్ సినిమాలు పడలేదు. ఎంత ప్రయత్నం చేసినా.. మంచి హిట్ అందుకోలేకపోయింది. అప్పుుడే ఆమెకు పొన్ని యన్ సెల్వన్‌లో నటించే అవకాశం వచ్చింది. కాని సరిగ్గా అదే టైమ్ లో ఫుల్ బిజీగా ఉంది కీర్తి సురేష్.
మణిరత్నం మూవీ అకాశం వచ్చిన టైమ్ లో రజనీకాంత్‌కు చెల్లెలిగా అన్నాత్తే సినిమాలో నటిస్తుండటంతో పాటు మరోవైపు సర్కారు వారి పాట మూవీ షూటింగ్ రన్నింగ్ లో ఉంది. ఇక రజనీకాంత్‌తో నటిస్తే మంచి క్రేజ్ వస్తుందని భావించిన కీర్తి తనకు డేట్స్ సర్దుబాటు కావడం లేదని చెప్పి మణిరత్నం మూవీకి నో చెప్పిందని ఫిల్మ్ సర్కిల్ నుంచి సమాచారం.