- Home
- Entertainment
- తళుకుబెళుకుల చీరలో కళావతి.. అణువణువూ అందమే, హై ఓల్టేజ్ ఫోజులతో కవ్విస్తున్న కీర్తి సురేష్
తళుకుబెళుకుల చీరలో కళావతి.. అణువణువూ అందమే, హై ఓల్టేజ్ ఫోజులతో కవ్విస్తున్న కీర్తి సురేష్
కీర్తి సురేష్ కి సౌత్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. చూడచక్కని రూపంతో పాటు నటన పరంగా కూడా కీర్తి సురేష్ తనకు తిరుగులేదని నిరూపించుకుంది.

కీర్తి సురేష్ కి సౌత్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. చూడచక్కని రూపంతో పాటు నటన పరంగా కూడా కీర్తి సురేష్ తనకు తిరుగులేదని నిరూపించుకుంది. మహానటి ఒక్క చిత్రం చాలు కీర్తి సురేష్ నటన గురించి చెప్పడానికి. ఆ చిత్రంతో కీర్తి సురేష్ జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది.
నేను శైలజ చిత్రంతో Keerthy Suresh టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో అందరి దృష్టి కీర్తి సురేష్ పై పడింది. కీర్తి సురేష్ సినిమాల్లో గ్లామర్ రోల్స్ చేస్తుంది. కానీ ఎప్పుడూ హద్దులు దాటేలా అందాలు ఆరబోయలేదు. నటనతోనే పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. సౌత్ టాప్ హీరోయిన్ల సరసన చేరింది.
కీర్తి సురేష్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోస్ మెస్మరైజ్ చేస్తున్నాయి. చీరకట్టుకు మోడ్రన్ ట్రెండ్ జోడించిన కీర్తి సురేష్.. మెరుపుల శారీలో వెలిగిపోతోంది. ఇక కలర్ ఫుల్ గా ఉన్న బ్లౌజ్ కుర్రాళ్లకు హాట్ ట్రీట్ ఇస్తోంది. కీర్తి సురేష్ వయ్యారంగా ఇస్తున్న ఫోజులు యువతని కవ్వించే విధంగా ఉన్నాయి. రీసెంట్ గా కీర్తి సురేష్ గ్లామర్ డోస్ పెంచేసిందనే చెప్పాలి.
కీర్తి సురేష్ ఇటీవల మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రంలో నటించింది. పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మంచి విజయం దక్కించుకుంది.
సర్కారు వారి పాటలో కీర్తి సురేష్ ని పరశురామ్ అందంగా ప్రజెంట్ చేశారు. మ.. మ.. మహేషా సాంగ్ లో కీర్తి సురేష్ మాస్ స్టెప్పులతో రెచ్చిపోయింది. మహేష్ తో కలసి కామెడీ టైమింగ్ ని కూడా కీర్తి సురేష్ అద్భుతంగా పండించింది.
మహానటి చిత్రంలో కీర్తి సురేష్ నట విశ్వరూపమే ప్రదర్శించింది. సావిత్రి పాత్రలో ఆమె ఒదిగిపోయి నటించింది. ఈ చిత్రంలో ఆమె నటనకు సర్వత్రా ప్రశంసలు దక్కాయి. దీనితో దర్శకులు కూడా కీర్తి సురేష్ ని గ్లామర్ రోల్స్ తో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలకు ఎంపిక చేసుకుంటున్నారు.
అలాగే కీర్తి సురేష్ మెగాస్టార్ చిరంజీవి బోళా శంకర్ చిత్రంలో కీలక పాత్రకు ఎంపికైంది. ఈ చిత్రాల్లో ఆమె చిరంజీవి సోదరిగా నటించబోతోంది. కీర్తి సురేష్ కి భోళా శంకర్ చిత్రం ఒక కొత్త అనుభూతి.