Keerthy Suresh : చిన్నకొంగు చీరలో కీర్తి సురేష్ పోజులు... మహానటి రేంజ్ చూశారా!
మహానటి కీర్తి సురేష్ త్వరలో తన కోలీవుడ్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. నయా లుక్స్ లో మెరుస్తూ ఆకట్టుకుంటోంది. లేటెస్ట్ లుక్ స్టన్నింగ్ గా మారింది.
సౌత్ హీరోయిన్ గా కీర్తి సురేష్ (Keerthy Suresh) మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమిళం, తెలుగు, మలయాళంలో వరుస పెట్టి సినిమాలు చేస్తూ వస్తోంది. విభిన్న పాత్రలు పోషిస్తూ అలరిస్తోంది.
దక్షిణాదిలో తనకటూ మంచి క్రేజ్ దక్కించుకున్న కీర్తి సురేష్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఆకట్టుకుంటోంది. తెలుగులో చివరిగా ‘సర్కారు వారి పాట’, ‘భోళా శంకర్’ సినిమాలతో అలరించింది.
మరోవైపు బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇస్తూ.. తన తొలిచిత్రాన్ని పూర్తి చేస్తోంది. స్టార్ నటుడు వరుణ్ ధావన్ సరసన కీర్తి సురేష్ నటిస్తున్న విషయం తెలిసిందే. బేబీ జాన్ (Baby John)గా టైటిల్ ను రీసెంట్ గానే రిలీజ్ చేశారు.
తాజాగా కోలీవుడ్ చిత్రం ‘సైరెన్’ Sirenతో అలరించబోతోంది. ఈ చిత్రం ఆడియో లాంచ్ రీసెంట్ గా జరిగింది. జయం రవి (Jayam Ravi), కీర్తి జంటగా నటించిన ఈ చిత్రం ఇవాళ్టి నుంచి థియేటర్లలో సందడి చేస్తోంది. ఇప్పటికే సినిమా ప్రమోషనల్ మెటీరియల్ అంచనాలను పెంచాయి.
సినిమా రిలీజ్ అయిన సందర్భంగా సోషల్ మీడియాలో ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే కీర్తి తన బ్యూటీఫుల్ లుక్ లో మెరిసింది. అందమైన ఫొటోలను పంచుకొని కట్టిపడేసింది. ఆడియో లాంఛ్ కు హాజరైన కీర్తి సురేష్ చీరకట్టు అందరినీ ఆకట్టుకుంటోంది.
కొంగు చిన్నగా ఉన్న చీరకట్టి ఫొటోలకు కిర్రాక్ గా ఫోజులిచ్చింది. మరోవైపు స్లిమ్ ఫిట్ అందాలను ప్రదర్శిస్తూ ఫ్యాన్స్ ను చూపుతిప్పుకోకుండా చేసింది. జబ్బల జాకెట్ లో స్టార్ హీరోయిన్ మెరుపులు మెరిపించింది. తన అందంతో ఆకర్షించింది.