- Home
- Entertainment
- తెగించిన కీర్తి సురేష్.. జాకెట్ విప్పి మరీ పరువాల విందు.. మత్తెక్కించే పోజులతో షాక్.. కారణమేంటంటే?
తెగించిన కీర్తి సురేష్.. జాకెట్ విప్పి మరీ పరువాల విందు.. మత్తెక్కించే పోజులతో షాక్.. కారణమేంటంటే?
మహానటి కీర్తిసురేష్ మొన్న `దసరా` సినిమాలో డీ గ్లామర్ లుక్‌లో మెరిసింది. తనదైన నటనతో వాహ్ అనిపించింది. ఇప్పుడు దానికి పూర్తి భిన్నంగా కనిపించి మైండ్ బ్లాక్ చేసింది.

కీర్తిసురేష్ గ్లామర్ హీరోయిన్‌గా సెట్ కాదనే టాక్ ఉంది. `మహానటి`లో ఆమెని చూశాక, గ్లామరస్‌గా కీర్తిని ఊహించుకోలేకపోయారు ఆడియెన్స్. ట్రెడిషన్ లుక్కే ఆమెకి సెట్ అవుతుందనుకున్నారు. కానీ తనలోని గ్లామర్ యాంగిల్‌ని పరిచయం చేసింది `సర్కారు వారిపాట` చిత్రంతో. ఇందులో గ్లామరస్‌గా కనిపించడమే కాదు, `మహేషా.. `సాంగ్‌లో ఏకంగా ఐటెమ్ బ్యూటీలా కనిపించింది. అందరిచేత వాహ్ అనిపించింది.
దీనికితోడు ఆ తర్వాత తన ఫోటో షూట్లలోనూ తెగింపు పోజులిచ్చింది. హట్ షో చేస్తూ ఫోటో షూట్లు చేసింది. తన బిగువైన అందాలను, చుట్టుకొలతలను చూపించింది. ట్రెండీ వేర్‌లో యమ సెక్సీగా కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా మరో ట్రీట్ ఇచ్చింది కీర్తి సురేష్.
మహేష్‌బాబుతో కలిసి నటించిన `సర్కారు వారి పాట` విడుదలై ఏడాది పూర్తయిన(మే 12-2022) సందర్బంగా కీర్తిసురేష్ మరోసారి మతిపోయేలా పోజులిచ్చింది. జాకెట్ విప్పేసి మరీ పరువాల ట్రీట్ ఇచ్చింది. అంతేకాదు మత్తెక్కించే పోజులతో హీటు పెంచుతుంది. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తున్నాయి.
కీర్తిసురేష్‌లోని ఇంతటి హాట్, ఇంతటి ఘాటు చూసి షాక్ అవుతున్నారు. వామ్మో మహానటిలోని మరో యాంగిల్ అంటూ కామెంట్ చేస్తున్నారు. మహేష్ ఫ్యాన్స్ ఓ ఏసుకుంటున్నారు. లైకులు, షేర్‌లతో వైరల్ చేస్తున్నారు. అంతేకాదు కీర్తిసురేష్ ఫైరింగ్ అంటూ ఎమోజీలు షేర్ చేస్తున్నారు. మొత్తంగా కీర్తిసురేష్ ఇప్పుడు సోషల్ మీడియాని ఊపేసే కార్యక్రమం చేపట్టిందని చెప్పొచ్చు.
కీర్తిసురేష్‌కి `మహానటి` తర్వాత ఒక్క హిట్ కూడా లేదు. మహేష్‌తో నటించిన `సర్కారు వారి పాట` ఫర్వాలేదనిపించింది. కానీ హిట్ సినిమా కాదు. ఆ తర్వాత మళ్లీ పరాజయాలు వెంటాడాయి. ఈ క్రమంలో ఇటీవల నానితో చేసిన `దసరా` చిత్రం పెద్ద హిట్ అయ్యింది. ఇందులో వెన్నెలగా కీర్తిసురేష్ పాత్రలో జీవించింది. అదరగొట్టింది. ఇందులో ఆమె డీ గ్లామర్ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమా తర్వాత తెలుగులో కీర్తి సురేష్ మళ్లీ బిజీ అవుతుందని భావించారు. కానీ పెద్దగా ఆఫర్లు వచ్చినట్టుగా అనిపించడం లేదు. ఇప్పటి వరకు ఆమె కొత్తగా మరే సినిమాని ప్రకటించలేదు. అయితే గత ఫెయిల్యూర్స్ ని దృష్టిలో పెట్టుకుని కొత్త ప్రాజెక్ట్ లను ఓకే చేసే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుందని సమాచారం. ప్రస్తుతం తెలుగులో `భోళాశంకర్`లో చిరుకి చెల్లిగా చేస్తుంది కీర్తి.
ఇక తమిళంలో మాత్రం దూసుకుపోతుంది. అక్కడ `మామన్నన్`, `సిరెన్`, `రఘు తాత`, `రివాల్వర్ రీటా` చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. తెలుగులో కంటెంట్ ఉన్న సినిమాలకే ప్రయారిటీ ఇస్తున్నట్టు సమాచారం.