MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Keerthy Suresh : ‘చెల్లెలి పాత్రలో నటించా.. నన్నూ అందంగానే చూపించారు’.. కీర్తి సురేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Keerthy Suresh : ‘చెల్లెలి పాత్రలో నటించా.. నన్నూ అందంగానే చూపించారు’.. కీర్తి సురేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫిల్మ్ ‘భోళా శంకర్’. హైదరాబాద్ లోని శిల్ప కళావేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగుతోంది. వేదికపై కీర్తి సురేష్ మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 06 2023, 09:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)  - మిల్క్ బ్యూటీ  తమన్నా భాటియా జంటగా నటించిన చిత్రం ‘భోళా శంకర్’.  మెహర్ రమేశ్ దర్శకత్వం వహించారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh)  చెల్లెలి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

స్వాతంత్య్ర  దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం ఆగస్టు 11న గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని శిల్పా కళా వేదికలో ఈరోజు భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వేదికపై కీర్తి సురేష్ మాట్లాడుతూ తన పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 
 

36

కీర్తి సురేష్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో నటించడం చాలా సంతోషంగా ఉంది. మెగాస్టార్ తో కలిసి వర్క్ చేశాకా ఆయన మెగా హ్యూమన్ అని అర్థమైంది. సినిమాలో బ్రదర్ - సిస్టర్ సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. అలాగే సెట్ లో అన్న మెహర్ రమేశ్ తోనూ అన్నాచెళ్లెళ్ల బంధం మరింతగా బలపడింది. 
 

46

అలాగే.. చెల్లెలి పాత్రలో నటించినా.. తనను చిరు పక్కనగా అందంగానే చూపించారని చెప్పడం ఆసక్తికరంగా మారింది. చిరుతో డాన్స్ లు కానీ, స్క్రీన్ ప్రజెన్స్ లోనూ బ్యూటీఫుల్ గా చూపించారని చెప్పడం విశేషం.  ఇక మెగాస్టార్ తో కలిసి నటించడం సంతోషంగా ఉందన్నారు. మొత్తానికి కీర్తి కామెంట్స్  ఇంట్రెస్టింగ్ గా మారాయి. 
 

56

కీర్తి సురేష్ తొలిసారిగా తన కెరీర్ లో బడా హీరో సినిమాలో చెల్లెలి పాత్రలో నటించడం ఆసక్తికరంగా మారింది. ఈ మూవీ రిలీజ్ తర్వాత కీర్తికి ఏమేరకు మైలేజ్ వస్తుందో చూడాలి. ఏదేమైనా మెగాస్టార్ సినిమాలో నటించే ఛాన్స్ రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది.

66

ఇక తమన్నా గురించి మాట్లాడుతూ.. సినిమా ప్రారంభంలో తను రాలేదని.. ఇప్పుడు తమన్నా రాలేదన్నారు. సోషల్ మీడియాలో మిల్క్ బ్యూటీ పేరు మారుమోగుతుండటం సంతోషంగా ఉందన్నారు. తనకు సినిమాలో అవకాశం ఇచ్చిన మెహర్ రమేశ్, నిర్మాతలకు, తనను బ్యూటీఫుల్ గా చూపించిన టెక్నీషియన్లకు ధన్యవాదాలు చెప్పింది. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ పై రూపుదిద్దుకుంది. మహాతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. 
 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Ntr Injury: అభిమానులకు షాక్‌, ఎన్టీఆర్‌ కి గాయాలు.. 8 వారాలు బెడ్‌ రెస్ట్.. ఏం జరిగిందంటే?
Recommended image2
Ram Charan Health Update: ప్రపంచంలోనే బెస్ట్ డాక్టర్స్ తో‌ రామ్‌ చరణ్‌కి ఆపరేషన్, హెల్త్ ఎలా ఉందంటే?
Recommended image3
Pooja Hegde: సీఎం విజయ్ కూడా డిజప్పాయింట్‌ చేశాడు‌.. పూజా హెగ్డేకి దెబ్బ మీద దెబ్బ.. వరుసగా ఏడు సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved