Keerthy Suresh: పట్టు శారీలో కీర్తిసురేష్ రచ్చ.. చూసేందుకు ఎగబడ్డ అభిమానులు..
`మహానటి` హీరోయిన్ కీర్తిసురేష్.. ట్రెడిషనల్‌గానూ కట్టిపడేస్తుంది. ఆమె చీర అందాల్లో కనువిందు చేస్తుంటుంది. లేటెస్ట్ గా ఈ మహేష్ హీరోయిన్‌ని చూసేందుకు అభిమానులు ఎగబడటం విశేషం. దీంతో ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

కీర్తిసురేష్(Keerthy Suresh) ట్రెడిషనల్ లుక్‌లో కనువిందు చేస్తుంటుంది. మోడ్రన్ డ్రెస్‌లోనూ అలరించే ఈ భామ చీరలో కనిపిస్తే కుర్రాళ్లకి వచ్చే కిక్కు మామూలు కాదు. అందుకే బయటకు వచ్చిందంటే ఈ బ్యూటీ చీరలో మెస్మరైజ్ చేస్తుంటుంది. తాజాగా ఈ అందాల భామ ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌లో పాల్గొంది. నెటిజన్లని ఆకట్టుకుంటుంది.
కూకట్‌పల్లిలోని ముగ్దా కంచిపట్టు చీరల షాపింగ్ మాల్‌ని శనివారం ప్రారంభించింది Keerthy Suresh. ఈ సందర్భంగా పట్టుశారీలో మెస్మరైజ్ చేసింది కీర్తిసురేష్. ఈ సందర్భంగా కీర్తిసురేష్‌ని చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. దీంతో ఆ షాపింగ్ పరిసరాలనీ జనంతో నిడిపోయాయి.
అయితే చీరలో కీర్తిసురేష్‌ని చూసేందుకు ఈ రేంజ్‌లో ఎగబడటం ఆమెకున్న క్రేజ్‌ని తెలియజేస్తుంది. ఈ సందర్భంగా ప్రస్తుతం కీర్తి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. వైరల్ అవుతున్నాయి. మొత్తంగా చీరలో అభిమానులను కనువిందు చేస్తుంది కీర్తి.
కీర్తిసురేష్ ఇప్పుడు సినిమాల పరంగానూ బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె తెలుగులో మహేష్‌తో `సర్కారు వారి పాట`లో నటిస్తుంది. కళావతి పాత్రలో ఆమె కనిపించబోతున్నట్టు తెలుస్తుంది.
తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన కళావతి పాట ప్రోమో ట్రెండింగ్‌లో ఉంది. అతి తక్కువ సమయంలో భారీ వ్యూస్, లైక్స్ పొందిన సాంగ్ ప్రోమోగా నిలిచింది.
దీంతోపాటు తెలుగులో చిరంజీవితో `భోళాశంకర్` సినిమా చేస్తుంది కీర్తిసురేష్. ఇందులో ఆమె చిరుకి చెల్లిగా కనిపించబోతుండటం విశేషం. గతేడాది రజనీకాంత్ నటించిన `అన్నాత్తే` చిత్రంలోనూ చెల్లిగా నటించిన విషయం తెలిసిందే.
మరోవైపు తెలుగులో కీర్తి.. నానితో మరోసారి కలిసి నటిస్తుంది. `నేను లోకల్` తర్వాత వీరిద్దరు జోడి కడుతున్నారు. ఇటీవలే ఈ చిత్రాన్ని ప్రకటించారు. అలాగే తమిళంలో రెండు చిత్రాలు, మలయాళంలో మరో సినిమా చేస్తుంది కీర్తి సురేష్.
అయితే `మహానటి`తో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన కీర్తి ఆ తర్వాత ఆ స్థాయి హిట్ పడకపోవడంతో ఆ ఇమేజ్ డ్యామేజ్ అయ్యే పరిస్థితి నెలకొంది.పైగా చెల్లి పాత్రలు పోషించడం ఆమె కెరీర్‌ని గాడి తప్పేలా చేశాయి. కష్టాల్లో పడేశాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మహేష్‌తో నటిస్తున్న `సర్కారు వారి పాట` హిట్ మీదే కీర్తి భవితవ్యం ఆధారపడి ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
కూకట్‌పల్లిలోని ముగ్దా కంచిపట్టు చీరల షాపింగ్ మాల్‌ని శనివారం ప్రారంభించింది. ఈ సందర్భంగా పట్టుశారీలో మెస్మరైజ్ చేసింది కీర్తిసురేష్. ఈ సందర్భంగా కీర్తిసురేష్‌ని చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు.
కూకట్‌పల్లిలోని ముగ్దా కంచిపట్టు చీరల షాపింగ్ మాల్‌ని శనివారం ప్రారంభించింది. ఈ సందర్భంగా పట్టుశారీలో మెస్మరైజ్ చేసింది కీర్తిసురేష్. ఈ సందర్భంగా కీర్తిసురేష్‌ని చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు.