Brahmamudi: అయోమయంలో ఉక్కిరి బిక్కిరవుతున్న రాజ్.. జైలు పాలైన అప్పు?
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి రేటింగ్ ని సంపాదించుకుంటూ టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తుంది. అత్తగారి ఇంట్లో తన చెల్లెలికి ఇస్తున్న గౌరవాన్ని చూసి అసూయతో రగిలిపోతున్న ఒక అక్క కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూలై 1 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో పాలు తాగి మత్తులో ఉన్న రాజ్ వెళ్తాడు. అతని ప్రవర్తనకి ఆశ్చర్య పోతుంది కావ్య. మళ్ళీ తాగొచ్చారా అని అడుగుతుంది. నేను ఏమీ తాగలేదు కానీ మత్తుగా ఉంది ఏదో కావాలనిపిస్తుంది అంటూ ఆమెని మరింత దగ్గరికి తీసుకుంటాడు. నువ్వు ఏం చెప్తే అది వింటాను అంటూ రెచ్చిపోతాడు.
నా మాట వినాలి అనుకున్నాను కానీ మరీ ఇంతలా వినాలి అనుకోలేదు అంటూ ఇబ్బంది పడుతుంది కావ్య. ఆ మత్తులోనే ఏదేదో మాట్లాడుతూ కావ్య ఒడిలో నిద్రపోతాడు రాజ్. అప్పుడు రిలాక్స్ అవుతుంది కావ్య రాజ్ తలని తీసి పక్కన పెట్టాలి అనుకుంటుంది కానీ పెట్టలేక పోతుంది. భర్త ఒడిలో చిన్న పిల్లాడి లాగా పడుకుంటే ఆ భార్య పడే ఆనందం ఇప్పుడు అర్థమవుతుంది.
నన్ను చూస్తేనే మండిపడే వ్యక్తి నాకు దగ్గర అవటానికి ప్రయత్నిస్తున్నారు ఇదే బ్రహ్మముడి మహత్యం ఏమో అంటూ ఆనందంతో కన్నీరు పెట్టుకుంటుంది కావ్య. మరోవైపు భర్త కాళ్లు పట్టుకొని క్షమాపణ అడుగుతుంది కనకం. నిన్ను క్షమించడానికి నువ్వు తప్పు చేయలేదు మోసం చేశావు అంటాడు కృష్ణమూర్తి. కూతుర్ని గొప్ప ఇంట్లో చూడాలని ఆ పెద్ద దాని కోసం అలా చేశాను.
కానీ అది నన్ను మోసం చేసిన దాకా నేను చేసింది తప్పని తెలియలేదు ఇప్పుడు నేను మారిపోయాను అంటుంది కనకం. ఏదైతేనేమి జరగరాని నష్టం జరిగిపోయింది. కావ్య ఎప్పుడైతే బలవంతపు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందో అప్పుడే ఈ ఇంట్లో నుంచి ధనలక్ష్మి కూడా వెళ్ళిపోయింది. అప్పు కి నేను చిన్నప్పటి నుంచి ఏమీ ఇవ్వలేదు. కొన్ని తను సంపాదించుకుంది చదువు కావ్య కష్టంతో చదువుకుంది.
పెద్దవాళ్ల ఇద్దరి పెళ్లిళ్లు నా ప్రమేయం లేకుండానే అయిపోయింది. కనీసం అప్పు పెళ్లి నా చేతుల మీదుగా జరగాలని అందుకోసం ఈ ఇంటిని అమ్ముదాం అనుకున్నాను కానీ నువ్వు నాకు ఆ అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు నేను పది లక్షలు అప్పు ఎలా తీర్చాలి? నన్ను అప్పు దృష్టిలో ఒక చేతకాని తండ్రిని చేసేసావు అంటూ బాధపడతాడు కృష్ణమూర్తి. ఈ మాటలన్నీ అనుకోకుండా వింటుంది అప్పు.
ఎలాగైనా తండ్రికి సాయం చేయాలి అనుకుంటుంది. సీన్ కట్ చేస్తే సీతారామయ్య ఇంట్లో అందరూ శ్రీశైలం వెళ్లడానికి బయలుదేరుతారు. స్వప్న కాస్ట్లీ గా రెడీ అవుతుంది. నేను ఎలా ఉన్నాను నన్ను చూసి అందరూ కార్యకర్త నాకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అని భర్తతో చెప్తుంది. అలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు ఈ ఇంట్లో కావ్య ఇంపార్టెన్స్ అంటాడు రాహుల్.
మరోవైపు రెడీ వచ్చిన ఆడవాళ్లు ఇంకా మగవాళ్ళు రాలేదు అంటూ ఆట పట్టిస్తారు. కొడుకుల్ని వెనకేసుకొస్తుంది చిట్టి. రాజ్ కి విషయం తెలియదు కదా అందుకే ఇంకా పడుకొని ఉంటాడు అందుకే ఇంకా కిందికి రాలేదు అనుకుంటారు అందరూ. రాజ్ ని లేపమని ధాన్యలక్ష్మి పంపిస్తుంది అపర్ణ. మరోవైపు అబ్బో కళ్యాణ్ కి ఫోన్ చేసి ఎందుకు గ్రౌండ్ కు రాలేదు అని అడుగుతుంది. అనుకోకుండా క్యాంప్ కి వెళ్తున్నాము అంటాడు కళ్యాణ్.
ఆ మాటలు అప్పు నమ్మదు. కారు హారన్ కొట్టి అప్పు నమ్మేలాగా చేస్తాడు కళ్యాణ్. రేపు పొద్దున్నే గ్రౌండ్ కు వస్తాను అని చెప్పడంతో సరే అని ఫోన్ పెట్టేస్తుంది అప్పు. మరోవైపు మెలకువ వచ్చేసరికి కావ్య ఒడిలో ఉండటం చూసి కంగారు పడతాడు రాజ్. ఆ హడావుడికి కావ్య కూడా నిద్ర లేస్తుంది. ఏం జరిగింది అంటూ అయోమయంగా అడుగుతాడు రాజ్. మీకు ఏమి గుర్తు లేదా అయినా మీకు ఇదే అలవాటు.
తాగేసి ఆ రోజు స్టోర్ రూమ్ లో దూరిపోయారు ఈరోజు ఇలా చేశారు అంటుంది కావ్య. ఏం చేశాను అంటూ అయోమయంగా అడుగుతాడు రాజ్. నువ్వే ఏదో మంత్రం వేసి ఉంటావు అంటాడు. నాకు అలాంటి బుద్ధులు లేవు అంటుంది కావ్య. తరువాయి భాగంలో కావ్య, స్వప్న ల గురించి తప్పుగా మాట్లాడుతాడు గ్రౌండ్లో ఒక వ్యక్తి. కోపంతో అతని తల పగలగొడుతుంది అప్పు. పోలీసులు ఆమెను ఇంటికి వచ్చి అరెస్టు చేస్తారు.