MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పల్లవి ప్రశాంత్ కి బ్యాగ్రౌండ్ లేదు, ఏమీ పీకలేడు.. అందుకే టార్గెట్ చేశారు, కౌశల్ మందా తీవ్ర వ్యాఖ్యలు

పల్లవి ప్రశాంత్ కి బ్యాగ్రౌండ్ లేదు, ఏమీ పీకలేడు.. అందుకే టార్గెట్ చేశారు, కౌశల్ మందా తీవ్ర వ్యాఖ్యలు

నేను బిగ్ బాస్ టైటిల్ గెలిచినప్పుడు పాజిటివ్ గా ఎంతమంది సపోర్ట్ చేసారో నెగిటివ్ గా టార్గెట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. బిగ్ బాస్ సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ కి రైతు బిడ్డ అనే సానుభూతి ఉంది. కానీ బ్యాగ్రౌండ్ లేదు. కాబట్టి ఏం చేసినా ఏమీ పీకలేడు అని కొందరు టార్గెట్ చేసి ఉండొచ్చు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Dec 27 2023, 04:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Pallavi Prashanth

Pallavi Prashanth

బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా పల్లవి ప్రశాంత్ గెలిచినప్పటికీ ఆ సంతోషం ఎక్కువ సేపు కొనసాగలేదు. బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ చేసిన అల్లర్లలో పలు కార్లు, ఆర్టీసీ బస్సులు ధ్వంసం అయ్యాయి. దీనితో పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా అల్లర్లు ఆగలేదు. ఈ అల్లర్లని ఆపడంతో పోలీసులకు ప్రశాంత్ సహకరించలేదనే ఆరోపణతో పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

కొన్ని రోజులు రిమాండ్ లో ఉన్న తర్వాత పల్లవి ప్రశాంత్ బెయిల్ పై విడుదల అయ్యాడు. ఏది ఏమైనా బిగ్ బోస్ సీజన్ 7 తో అనేక వివాదాలు పుట్టుకువచ్చాయి. పల్లవి ప్రశాంత్ అరెస్ట్, వివాదంపై సెలెబ్రిటీలు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు అభిప్రాయాలు చెబుతున్నారు. తాజాగా బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ మందా పల్లవి ప్రశాంత్ అరెస్ట్ వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 

37
Pallavi Prashanth

Pallavi Prashanth

బిగ్ బాస్ లో ఇలాంటి వివాదాలు సీజన్ 2లో తన నుంచే మొదలయ్యాయి అని కౌశల్ మందా తెలిపారు. సోషల్ మీడియాలో ఆర్మీలు ఏర్పడి తమ అభిమాన కంటెస్టెంట్ కి సపోర్ట్ చేయడం తన నుంచి మొదలైంది అని కౌషల్ అన్నారు. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేసినట్లే సీజన్ 2లో నన్ను కూడా టార్గెట్ చేశారు. సీజన్ 2 ట్రైలర్ లాంటిది అయితే సీజన్ 7 ఏకంగా సినిమానే అని కౌశల్ అభిప్రాయ పడ్డారు. 

47

అల్లర్లు జరగడం, పల్లవి ప్రశాంత్ ఆ విధంగా ఇబ్బందులు పడడం చూస్తే మొదటి తప్పు బిగ్ బాస్ నిర్వాహకులదే అని కౌశల్ తాజాగా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. బిగ్ బాస్ లాంటి షోలు సిటీ బయట జరగాలి. అప్పుడు ఏ గొడవా ఉండదు. లీక్ లు కూడా లేకుండా షో వల్ల మజా బావుంటుంది. కంటెస్టెంట్స్ కి ప్రైవసీ కూడా ఉంటుంది. 

57

సిటీ బయట నిర్వహిస్తే జనాల హడావిడి ఉండదు. కంటెస్టెంట్స్ అంతా ఎయిర్ పోర్ట్ కి వెళ్లి ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ అన్నపూర్ణ స్టూడియోస్ లో సిటీకి మధ్యలో షో నిర్వహించడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. హిందీ వాళ్ళు కూడా బిగ్ బాస్ షోని పూణే అవుట్ స్కర్ట్స్ లో నిర్వహిస్తారు. బిగ్ బాస్ విన్నర్ నుంచి పబ్లిసిటీ పొందాలని చాలా మంది ప్రయత్నిస్తారు. 

67
Pallavi Prashanth

Pallavi Prashanth

నేను బిగ్ బాస్ టైటిల్ గెలిచినప్పుడు పాజిటివ్ గా ఎంతమంది సపోర్ట్ చేసారో నెగిటివ్ గా టార్గెట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. బిగ్ బాస్ సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ కి రైతు బిడ్డ అనే సానుభూతి ఉంది. కానీ బ్యాగ్రౌండ్ లేదు. కాబట్టి ఏం చేసినా ఏమీ పీకలేడు అని కొందరు టార్గెట్ చేసి ఉండొచ్చు. పోలీసులకు, ప్రశాంత్ కి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ టార్గెట్ చేసిన కోణం కూడా ఉండి ఉండొచ్చు. 

77

షో ముగియగానే పల్లవి ప్రశాంత్ దొంగదారిలో వెళ్ళిపోయి ఉండాల్సింది. కానీ తనని ఓట్లువేసి గెలిపించిన వారిని కలుసుకోవడం కోసం వచ్చాడు. అక్కడే తప్పు జరిగింది. నేను గెలిచినప్పుడు కూడా ఇంటికి వెళ్లిపోదామనుకున్నా. కానీ మనకోసం ఓట్లు వేసిన అభిమానులని కలుసుకోవాలని మనసు లాగేస్తూ ఉంటుంది అని కౌశల్ మందా తెలిపారు. ఏది ఏమైనా పల్లవి ప్రశాంత్ జైలుకి వెళ్లి రావడం అతడికి పెద్దగా నష్టం చేకూరే అంశం కాదు అని కౌశల్ మందా అన్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Ilaiyaraaja Karuppu Controversy: ఇళయరాజా దెబ్బకి క్షమాపణ చెప్పిన 'కరుప్పు' టీమ్.. ఆ సీన్‌కు కత్తెర
Recommended image2
Manchu Manoj: ఫ్యామిలీ వివాదంపై మంచు మనోజ్‌ సెటైర్లు.. తనకు అలా న్యాయం జరిగిందంటూ కామెంట్‌
Recommended image3
CM Vijay Number Plate: సీఎం విజయ్‌కు డైరెక్టర్ సర్‌ప్రైజ్ గిఫ్ట్.. ముఖ్యమంత్రి అవుతాడని ముందే ఊహించారా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved