- Home
- Entertainment
- Katrina-Vicky Wedding: గ్రాండ్‌గా కత్రినా-విక్కీ కౌశల్ వెడ్డింగ్.. ఫోటోలు లీక్.. వైరల్
Katrina-Vicky Wedding: గ్రాండ్‌గా కత్రినా-విక్కీ కౌశల్ వెడ్డింగ్.. ఫోటోలు లీక్.. వైరల్
బాలీవుడ్ హాట్ లవ్ బర్డ్స్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ఎట్టకేలకు ఓ ఇంటి వారయ్యారు. వీరిద్దరు గురువారం గ్రాండ్‌గా వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి ఫోటోలు, వీడియోలు కొన్ని లీక్ అయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ వివాహ గురువారం రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారా రాయల్ ప్యాలెస్ అత్యంత వైభవంగా జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ ప్రేమ జంట నేడు గురువారం (డిసెంబర్ 9న) మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహానికి రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారా రాయల్ ప్యాలెస్ వేదికైంది. అత్యంత గ్రాండ్‌గా విక్కీ-కత్రినా వివాహం జరిగింది. కోట బయటకొచ్చి వీరిద్దరు దండెలు మార్చుకోవడం, అతిథులకు అభివాదం తెలియజేయడం విశేషం. ఈ సందర్భంగా తీసిన పలు ఫోటోలు, వీడియోలు ఇప్పుడు లీక్ అయ్యాయి. నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
ఇందులో కత్రినా రెడ్ లెహంగాలో కనిపిస్తుంది. కనువిందు చేస్తుంది. మరోవైపు విక్కీ వైట్ షెర్వానీ ధరించారు. పెళ్లి దుస్తుల్లో వీరిద్దరు చూడముచ్చటగా, కనువిందుగా ఉండటం విశేషం. పర్‌ఫెక్ట్ కపుల్ అనిపించుకుంటుందీ జోడి.
అయితే వీరి మ్యారేజ్‌కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు అంతా సీక్రెట్‌గానే ఉంచనున్నారు. ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ ఏకంగా వంద కోట్లకు ఈ హక్కుల దక్కించుకుందని తెలుస్తుంది. దీంతో ఇప్పటి వరకు ఒక్క ఫోటోని కూడా బయటకు విడుదల చేయలేదు.
దీంతో పెళ్లి అనంతరం వీక్కీ, కత్రినాలా వెడ్డింగ్‌కు సంబంధించిన తొలి ఫోటో సోషల్ తాజాగా మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిని ఓ ఫ్యాన్ పేజ్ ఈ ఫోటోను పోస్టు చేసింది. ఇందులో కోటపై భార్యభర్తలుగా నిల్చున్న వీరిద్దరూ చాలా అందంగా కనిపిస్తున్నారు. ఇక బుధవారం సాయంత్రం హల్దీ వేడుక, ఆ తరువాత సంగీత్ నిర్వహించారు. వెడ్డింగ్ ప్లానర్‌లు ముఖ్య అతిథుల కోసం 8 నుంచి 10 గదులను బుక్ చేశారట. వీటికి రాత్రికి రూ.70 వేలు ఖర్చవుతుందట.
బాలీవుడ్‌లో స్టార్స్ గా రాణిస్తున్నారు కత్రినా కైఫ్, విక్కీ కౌశల్. గత మూడేళ్లుగా వీరిద్దరు ప్రేమలో మునిగితేలుతున్నారు. చాలా రోజుల వరకు చాలా సీక్రెట్‌గా మెయింటేన్ చేసిన ఈ జంట ఎట్టకేలకు మీడియాకి దొరికిపోయారు. పలు ఈవెంట్లలో కలిసి సందడి చేయడం, చనువుగా ఉండటంతో ఈ ఇద్దరి మధ్య ఏదోజరుగుతుందనే రూమర్స్ ఊపందుకున్నాయి. అయితే వీటిని కత్రినా-విక్కీ పెద్దగా స్పందించకపోవడంతో మరింతగా రూమర్స్ ఊపందుకున్నాయి.
ఆ మధ్య ఏకంగా రోకా ఫంక్షన్ జరిగిందంటూ వార్త బాలీవుడ్‌లో చక్కర్లు కొట్టింది. దీన్ని ఖండిస్తూ, ఆచితూచి వ్యవహరిస్తూ వచ్చిన ఈ జంట ఎట్టకేలకు మ్యారేజ్‌కి సిద్ధమయ్యారని, ఇరు కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, మ్యారేజ్ కూడా ఫిక్స్ అయ్యిందని వార్తలు ఇటీవల చక్కర్లు కొడుతున్నాయి. ఎట్టకేలకు ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నారు. రేపటి వరకు పెళ్లి వేడుక జరుగనుందని, ఈ నెల 11 న తిరిగి ముంబయి చేరుకుంటారని సమాచారం. ఆ తర్వాత ముంబయిలో ఓ గ్రాండ్ రిసెప్షన్‌ని కూడా ప్లాన్ చేశారట విక్కీ-కత్రినా జంట. సినిమా సెలబ్రిటీలు, బంధువులను ఆహ్వానించి విందుని ఇవ్వనున్నారట. మొత్తానికి ఇద్దరి ప్రేమికుల తర్వాత కత్రినా.. విక్కీని మ్యారేజ్ చేసుకోవడం విశేషం.