MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • katrina-vicky: నాలుగు రోజుల పెళ్లి నేటి నుంచే షురూ.. డెస్టినీ వెడ్డింగ్‌ ఒక్కో రోజు ఒక్కో స్పెషల్‌..

katrina-vicky: నాలుగు రోజుల పెళ్లి నేటి నుంచే షురూ.. డెస్టినీ వెడ్డింగ్‌ ఒక్కో రోజు ఒక్కో స్పెషల్‌..

కత్రినాకైఫ్‌, విక్కీ కౌశల్‌ మ్యారేజ్‌ కి సందడి షురూ అయ్యింది. నేటి నుంచే వీరి వెడ్డింగ్‌ సెలబ్రేషన్‌ ప్రారంభం కానుంది. ఆద్యంతం అంగరంగ వైభవంగా విక్కీ, కత్రినాల మ్యారేజ్‌ జరగబోతుండటం విశేషం. దీంతో బాలీవుడ్‌కి పెళ్లి కళ వచ్చిన ఫీలింగ్‌ కలుగుతుంది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Dec 07 2021, 08:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కత్రినా కైఫ్‌-విక్కీ కౌశల్‌ గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సల్మాన్‌ ఖాన్‌, రణ్‌బీర్‌ కపూర్‌లకు బ్రేకప్‌ చెప్పిన కత్రినా.. కొంత గ్యాప్‌ తర్వాత విక్కీ మాయలో పడిపోయింది. `ఉరి` సినిమాతో బంపర్‌ హిట్‌ కొట్టి జాతీయ స్థాయిలో ఒక్కసారిగా పాపులర్‌ అయ్యారు విక్కీ కౌశల్. అదే సమయంలో కత్రినా పరిచయం అయ్యింది. దీంతో ఇద్దరి మనసులు కలిశారు. తనకంటే ఏజ్‌లో చిన్నవాడైనా, ప్రేమకి వయసుతో సంబంధం లేదని నిరూపించుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా పెళ్లికే సిద్ధమయ్యారు. మరో మూడు రోజుల్లో వీరి వెడ్డింగ్‌ పూర్తి కాబోతుండటం విశేషం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ফিল্মি কায়দায় বিয়ে

ফিল্মি কায়দায় বিয়ে

అయితే తమ మ్యారేజ్‌ని చాలా గ్రాండ్‌గా ప్లాన్‌ చేసుకుందీ ప్రేమ జంట. అందుకు చరిత్రాత్మక ప్యాలెస్‌ని వేదికగా చేసుకుంది. తమ వివాహ వేడుకలను వీలైనంత ఘనంగా జరుపుకోవడానికి సన్నాహాలు చేసుకున్నారు. ఈ ప్రేమికుల వివాహం రాజస్థాన్‌లో సిక్స్‌ సెన్సెస్‌ ఫోర్ట్‌ బర్వారాలో జరగనుంది. నేటి నుంచి 10వ తేదీ వరకు రాజస్థాన్‌లో విక్కీ, కత్రినాల వివాహ వేడుకలు జరగనున్నాయని బాలీవుడ్‌ టాక్‌.

36
ক্যাট-ভিকি প্রেম

ক্যাট-ভিকি প্রেম

నాలుగు రోజులు వెడ్డింగ్‌ని ప్లాన్‌ చేశారట. ఒక్కో రోజుకి ఒక్కో స్పెషల్‌ ఉంది. మంగళవారం సంగీత్, ఆ మర్నాడు మెహందీ, ఆ తర్వాత 9న విక్కీ–కత్రినాల వివాహం, 10న రిసెప్షన్‌ జరగనున్నాయట. కోటలో విక్కీకి `రాణా మాన్‌సింగ్‌` పేరున్న సూట్‌ని, కత్రినాకు `రాణి పద్మావతి` పేరున్న సూట్‌ని బుక్‌ చేశారని వినికిడి. ఒక్కో గది అద్దె రోజుకి  దాదాపు 7 లక్షల రూపాయలని సమాచారం. సోమవారం వధూవరుల కుటుంబం ఫోర్ట్‌లో అడుగుపెట్టారు. 11న తిరిగి బయలు దేరనున్నారు. అలాగే అతిథుల కోసం కూడా విలాసవంతమైన గదులను బుక్‌ చేశారట. ఒక్కో గది అద్దె రోజుకి 70 వేల రూపాయలని టాక్‌. దాదాపు 120 మంది అతిథిలు ఈ వేడుకల్లో పాల్గొంటారని బాలీవుడ్‌ అంటోంది. 

46
বিয়েতে কোভিড টেষ্ট

বিয়েতে কোভিড টেষ্ট

పెళ్లికి హాజరయ్యేవారందరూ రెండు డోసుల వ్యాక్సినేషన్‌ను పూర్తి చేసుకుని ఉండాలి లేదా ఆర్‌టీపీసీఆర్‌ నెగటివ్‌ రిపోర్ట్‌ చూపించాలి. అలాగే సెల్‌ఫోన్‌కు అనుమతి లేదని కాబోయే వధూవరులు అతిథులకు విన్నవించుకున్నారట. వేడుకలకు హాజరయ్యేవారందరూ ప్రముఖులు కాబట్టి  రక్షణ విషయంలో ఎలాంటి లోటుపాట్లు జరగకూడదని సుమారు వంద మంది బౌన్సర్లను నియమించారట. 

56

వివాహానికి సంబంధించిన వీడియోలను రికార్డు చేసి, వీలు కుదిరితే విక్ట్రీనాలను ఇంటర్వ్యూ చేసి, అతిథుల అభిప్రాయాలను కూడా సేకరించి ఆ తర్వాత స్ట్రీమింగ్‌ చేసేందుకు ఓ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ భారీ ఆఫర్‌తో విక్కీ, కత్రినాలతో సంప్రదింపులు జరిపిందని ప్రచారం జరుగుతోంది. అందుకే వేడుకలకు సంబంధించి ఒక్క ఫొటో కానీ, చిన్న వీడియో కానీ బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని భోగట్టా.

66

మరోవైపు విక్ట్రినా పెళ్లికి హాజరయ్యే బాలీవుడ్‌ ప్రముఖల జాబితాలో కత్రినా మాజీ ప్రేమికులు సల్మాన్‌ ఖాన్, రణ్‌బీర్‌ కపూర్‌ పేర్లు ఉన్నాయా? లేవా? అసలు వీరికి ఆహ్వానాలు వెళ్లాయా? అనే చర్చ బాలీవుడ్‌లో జరుగుతోంది. కానీ తమకు ఆహ్వానం అందలేదని సల్మాన్‌ సోదరి అర్పితా ఖాన్‌ ఇటీవల ఓ సందర్భంలో పేర్కొన్నారు. అలాగే విక్కీ మాజీ ప్రేయసి హర్లీన్‌ సేథీని కూడా ఆహ్వానించలేదని భోగట్టా. వివాహానికి వెళ్లే అతిథుల్లో ఆలియా భట్, కరణ్‌ జోహార్, కబీర్‌ ఖాన్, రోహిత్‌ శెట్టి, సిద్ధార్థ్‌ మల్హోత్రా, కియారా అద్వానీ, వరుణ్‌ ధావన్‌వంటి ప్రముఖులు హాజరు కానున్నారట.
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Sayaji Shinde: తల్లి చివరి కోరిక తీర్చిన టాలీవుడ్‌ యాక్టర్‌.. గ్రీనరీతో అమ్మకి జీవం
Recommended image2
Neha Dhupia: నీ నవ్వు దారుణంగా ఉంది, నా ముందు నవ్వకు అన్నారు.. కన్నీళ్లు ఆగలేదు అంటూ నటి కామెంట్స్
Recommended image3
Gayatri Gupta: వంద సార్లకుపైగా రేప్‌ అటెంప్ట్, సొంత తండ్రినే దారుణం.. నరకం చూసిన నటి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved