- Home
- Entertainment
- తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్.. త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనున్న సెలబ్రిటీ కపుల్..
తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్.. త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనున్న సెలబ్రిటీ కపుల్..
Katrina Kaif: బాలీవుడ్ అందాల తార కత్రినా కైఫ్ త్వరలోనే తల్లికాబోతున్నారన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. పెళ్లి తరువాత సినిమాలకు కొంత దూరంగా ఉంటూ, కెరీర్ కంటే వ్యక్తిగత జీవితానికే ప్రాధాన్యం ఇస్తున్నది.

తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్.
ఇటీవలే మెగా ఇంట్లోకి వారసుడు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. స్టార్ కపుల్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పేరెంట్స్ గా ప్రమోషన్ పొందారు. లావణ్య త్రిపాఠి పండంటి మగబిడ్డ జన్మించారు. దీంతో మెగా ఫ్యాన్స్ పండుగ వచ్చేసింది. ఇక ఇప్పుడు మరో స్టార్ కపుల్ పేరెంట్స్ కాబోతున్నారనీ, ఓ స్టార్ హీరోయిన్ త్వరలోనే తల్లిగా ప్రమోషన్ పొందనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఆ వార్తలో నిజమెంత?
విక్కీ కౌశల్ - కత్రినా కైఫ్
విక్కీ కౌశల్ - కత్రినా కైఫ్ ల వివాహం కూడా హాట్ టాపికే.. ఎందుకంటే.. వయసులో చిన్నవాడైన హీరో విక్కీ కౌశల్‌ను వివాహం చేసుకుంది కత్రినా. 2021 డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వాడాలో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్‌తో ఒక్కటైంది ఈ జంట. పెళ్లి తర్వాత సినిమాలకు కొంత దూరమయ్యారు. కెరీర్ కంటే వ్యక్తిగత జీవితానికే ప్రాధాన్యం ఇస్తున్నది. అప్పటి నుండి తరచూ "కత్రినా ప్రెగ్నెంట్" అనే రూమర్స్ వినిపించినప్పటికీ, వాటిని ఈ జంట ఖండిస్తూ వచ్చారు. ముఖ్యంగా ఒకసారి ఈ వార్తలపై విక్కీ కౌశల్ స్వయంగా స్పందిస్తూ – “అలాంటిదేమీ లేదు. ఏదైనా ఉంటే మేమే చెబుతాం” అని క్లారిటీ ఇచ్చారు. అయినా, ఆ రూమర్స్ మాత్రం తరచూ మళ్లీ మళ్లీ వెలువడుతూనే ఉన్నాయి.
స్టార్ కపుల్ ఎవరు?
ఆ హీరోయిన్ ఎవరో కాదు.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్. ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం, అభినయం, స్టార్‌డమ్ అన్నీ కలగలిపి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. అటు కెరీర్ పరంగానే కాకుండా వ్యక్తిగత విషయాలతో కూడా తరుచూ వార్తల్లో నిలుస్తోంది. పెళ్లి తరువాత సినిమాలకు కొంత దూరంగా ఉంటూ, కెరీర్ కంటే వ్యక్తిగత జీవితానికే ప్రాధాన్యం ఇస్తున్నది. ప్రస్తుతం ప్రెగ్నెంట్ అన్న టాక్ ఫిల్మ్ నగర్‌లో గట్టిగా వినిపిస్తోంది.
రూమర్స్ రావడానికి కారణమేంటీ?
తాజాగా మరోసారి ఇదే వార్త గాలిలో వినిపిస్తోంది. అక్టోబర్ లేదా నవంబర్‌లో కత్రినా – విక్కీ కపుల్ తమ మొదటి బిడ్డకు స్వాగతం పలకబోతున్నారంటూ ఆంగ్ల మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి. దీని ప్రధాన కారణం కత్రినా కైఫ్ గత కొంతకాలంగా సినిమాల్లో కనిపించకపోవడం, సోషల్ మీడియాలోనూ అంత యాక్టివ్‌గా లేకపోవడం, ఆమె లుక్‌లో మార్పులు కనిపించడం, ఇవన్నీ ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. ఇలా వార్తలు రావడం చర్చనీయాంశమైంది. అయితే ఇప్పటివరకు ఈ జంట నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాబట్టి ఈ వార్తలు నిజమా? కాదా? అనేది వీరిద్దరూ స్వయంగా స్పందిస్తేనే స్పష్టత రానుంది.
కెరీర్ జర్నీ
సినిమాల విషయానికి వస్తే – కత్రినా చివరిసారిగా విజయ్ సేతుపతితో కలిసి నటించిన ‘మేరీ క్రిస్మస్’ సినిమాలో కనిపించారు. ఇక విక్కీ కౌశల్ మాత్రం కెరీర్‌లో దూసుకుపోతున్నారు. ఆయన నటించిన ‘ఛావా’ మూవీ భారీ విజయం సాధించి, బాక్సాఫీస్ వద్ద రూ.800 కోట్లకు పైగా వసూళ్లు అందుకుంది. ప్రస్తుతం విక్కీ, రణబీర్ కపూర్ – ఆలియా భట్‌లతో కలిసి ‘లవ్ అండ్ వార్’ సినిమాలో నటిస్తున్నారు. మొత్తానికి, కత్రినా కైఫ్ తల్లికాబోతున్నారన్న వార్త అభిమానుల్లో ఆనందం నింపుతున్నా, అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇవన్నీ ఊహాగానాలే.

