మొన్న రష్మిక, ఇప్పుడు కత్రినా కైఫ్.. డీప్ ఫేక్ ఫోటో వైరల్..
రష్మిక మందన్నా డీప్ ఫేక్ సమస్యని ఫేస్ చేసిన విషయం తెలిసిందే. అది ఓ వైపు నడుస్తూనే ఉంది. ఇప్పుడు మరో హీరోయిన్ దీని బారిన పడటం షాకిస్తుంది.
Rashmika Mandanna Deep Fake Video
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) ఫేస్‌తో ఉన్న డీప్ ఫేక్ వీడియో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. దీంతో ఈ వీడియో యావత్ ఇండియాని కుదిపేసింది. ఇది చాలా హాట్ టాపిక్‌గా మారింది. కేంద్ర మంత్రులు సైతం దీనిపై స్పందించారు. దీన్ని తీవ్రంగా ఖండించారు. బిగ్ బీ వంటి సెలబ్రిటీలు కూడా స్పందించారు. అందరూ ముక్తకంఠంతో దీన్ని వ్యతిరేకించారు. కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని వెల్లడించారు.
ఆ వేడి ఇంకా తగ్గలేదు. తాజాగా మరో హీరోయిన్ ఈ సమస్యని ఫేస్ చేస్తుంది. బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్(Katrina Kaif)కి సైతం ఇదే సమస్య వచ్చిపడింది. ఆమె ఫోటోని కూడా డీప్ ఫేక్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. దీంతో ఆ పిక్ సైతం సంచలనంగా మారింది. ఇందులో ఆమె లో దుస్తులు లేని విధంగా చూపించారు. ఇదే ఇప్పుడు మరింత రచ్చ చేస్తుంది.
కత్రినా కైఫ్ ప్రస్తుతం హిందీలో సల్మాన్ ఖాన్‌తో కలిసి `టైగర్ 3` చిత్రంలో నటిస్తుంది. `టైగర్` సిరీస్‌లో వస్తోన్న మూడో చిత్రమిది. దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 13న విడుదల కానుంది. అయితే చిత్ర ప్రమోషన్‌లో భాగంగా టీమ్.. కత్రినా కైఫ్, మరో హాలీవుడ్ స్టంట్ ఉమెన్‌తో కలిసి ఫైట్ చేస్తుంది. జస్ట్ టవల్ కట్టుకుని ఈ ఫైట్ చేయడం హైలైట్‌గా నిలిచింది. కానీ ఇందులో కేవలం టవల్ మాత్రమేకాదు, ఇన్నర్‌గా కత్రినా వైట్ కట్ టవల్‌ని లోపల ధరించింది.
కానీ అవేమీ లేనట్టుగా ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) టెక్నాలజీ ఉపయోగించి డీప్ ఫేక్ (Katrina Deep Fake Photo)ఫోటోని తయారు చేసి సోషల్ మీడియాలో వదిలారు. దీంతో నిజంగానే కత్రినా ఇలా ఉందా అనేంతగా దాన్ని మార్ఫింగ్ చేయడం గమనార్హం. ఈ ఫోటో వైరల్ అవుతూ ఆశ్చర్య పరుస్తుంది. అయితే లేట్‌గా విషయం బయటకొచ్చింది. ఈ ఫోటో కూడా ఏఐ ద్వారా మార్చబడిందని తేలింది. ఇలా కత్రినా కూడా ఈ డీప్ ఫేక్ సమస్యని బలైందని చెప్పొచ్చు.
దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఏఐ టెక్నాలజీ ఎంత దారుణంగా మిస్ యూజ్ అవుతుందో చూడండి అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. మంచి కంటే దీన్ని చెడుకోసం ముఖ్యంగా ఆడవారిని అసభ్యంగా చూపించడం కోసం వాడుతున్నారని, దీనిపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది మరింత హాట్ టాపిక్ అవుతుంది. కత్రినాతోపాటు సచిన్ కూతురు సారా కూడా దీని బారిన పడినట్టు తెలుస్తుంది. ఇంత జరుగుతున్నా, ప్రభుత్వాల నుంచి దీనిపై ఇప్పటికీ యాక్షన్ తీసుకోకపోవడం ఆశ్చర్యపరుస్తుంది. తీవ్ర విమర్శలకు కారణమవుతుంది.