- Home
- Entertainment
- కశ్మీర్ పండిట్స్ హత్యలు , గో హత్యలకు ఎలాంటి తేడా లేదు.. సాయి పల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు.. సీన్ మొత్తం రివర్స్
కశ్మీర్ పండిట్స్ హత్యలు , గో హత్యలకు ఎలాంటి తేడా లేదు.. సాయి పల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు.. సీన్ మొత్తం రివర్స్
లేడీ పవర్ స్టార్ అంటూ సాయి పల్లవిని పొగిడిన నెటిజన్సే ప్రస్తుతం ట్రోల్ చేస్తున్నారు. తను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నెట్టింట #Bycottsaipallavi అంటూ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ పరిస్థితి అటు ‘విరాట పర్వం’ చిత్రంపైనా ప్రభావం చూపిస్తోంది.

దర్శకుడు వేణు ఊడుగుల డైరెక్షన్ లో రానా దగ్గుబాటి, లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటించిన చిత్ర 'విరాటపర్వం' (Virata Parvam). ఈ చిత్రం ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇటీవలె చిత్ర ట్రైలర్ ను వరంగల్ లో నిర్వహించిన ‘విరాట పర్వం ఆత్మీయ వేడుక’లో రిలీజ్ చేశారు.
నక్సలిజం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రానా రవన్న పాత్రను పోషించాడని తెలుస్తోంది. అలాగే భరతక్క పాత్రలో ప్రియమణి నటించిందని సమాచారం. కాగా సాయి పల్లవి మాత్రం ఈ చిత్రంలో ‘వెన్నెల’ పాత్రలో కనిపించనుంది. 1990లలో తెలంగాణ ప్రాంతంలో జరిగిన నక్సలైట్ ఉద్యమం చుట్టూ కథాంశం తిరగనున్నది తెలుస్తోంది.
అయితే, Virata Parvam విడుదలకు మరో రెండు రోజులే గడువు ఉంది. దీంతో ఇప్పటికే చిత్ర ప్రమోషన్స్ ను ప్రారంభించిన యూనిట్ మరింత జోరు పెంచింది. ఈ క్రమంలో సాయి పల్లవికి ఎక్కువగా క్రేజ్ ఉండటంతో పలు టీవీ ఛానెళ్లు, య్యూటూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ.. ‘విరాటపర్వం’ చిత్రాన్ని ప్రమోట్ చేస్తోంది.
ఈ సందర్భంగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తన పర్సనల్ విషయాలతో పాటు, సినిమా విషయాలను షేర్ చేసుకుంది. నక్సల్ గురించి చెప్పే క్రమంలో విషయం ‘కశ్మీర్ ఫైల్స్’ Kashmir Files వైపు మళ్లింది. దీంతో అనుకోని వివాదంలో చిక్కుకుంది.
మనుషుల ఆలోచనలు మారాలనే ఉద్దేశంతో సాయి పల్లవి మాట్లాడుతూ.. ‘వాళ్లది ఒక ఐడియాలజీ.. మనకు శాంతి అనేది ఓ ఐడియాలజి. నాకు ఘర్షణలు నచ్చవు. న్యూట్రల్ గా ఆలోచించడం నేర్చుకోవాలి. ఏ విషయంలోనూ ఏవరిదీ పూర్తిగా తప్పు అని చెప్పలేం. పాకిస్థాన్ లో ఉన్న వాళ్లకి మన జవాన్లు టెర్రరిస్ట్ లా కనిపిస్తున్నారు. మనకు వాళ్లు కూడా అలానే కనిపిస్తారు. ఏదీ తప్పు ఏది ఒప్పు అని చెప్పడం కష్టం.
మా కుటుంబం లెఫ్ట్, రైట్ అని ఉండదు. నేను వీటి గురించి తెలుసుకున్నాను. కానీ నేను ఏ భావజాలాన్ని కలిగి లేను. కొన్ని రోజుల కింద వచ్చి కాశ్మీర్ ఫైల్స్ లో పండిట్స్ ను ఎలా చంపారో చూశాం. అలాగే ఆ మధ్యలో బండిలో ఓ ముస్లిం డ్రైవర్ ఆవును తరలిస్తుండగా.. కొంత మంది కొట్టేసి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన్నారు. అప్పుడు కాశ్మీర్ పండిట్స్ హత్యలకు, గో హత్యలకు ఎలాంటి తేడా లేదు. అందరూ న్యూట్రల్ గా ఆలోచించడం నేర్చుకోవాలంటూ.. చెప్పుకొచ్చింది.
దీంతో ఇప్పటి వరకు లేడీ పవర్ స్టార్ అంటూ తనను కొనియాడిన కొందరు నెటిజన్స్ ఆమె ముస్లింలకు సపోర్ట్ గా మాట్లాడిందనే ఉద్దేశంతో విమర్శలు గుప్పిస్తున్నారు. మరికొందరు ‘విరాట పర్వం’ సినిమాను చూడబోమంటూ నెట్టింట బహిరంగంగా ప్రకటన చేస్తున్నారు. #BycottSaipallavi, #BycottVirataparvam అనే హ్యాష్ ట్యాగ్స్ తో ట్విటర్ లో వార్ చేస్తున్నారు. ఇది పరిస్థితి ఎంతవరకు వెళ్తుందో చూడాలి.
జూన్ 17న మూవీని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. రేపు ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని హైటెక్ సిటీ శిల్పారామంలో నిర్వహించనున్నారు. అతిథులుగా రామ్ చరణ్, వెంకటేశ్, సుకుమార్ హాజరవుతున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి వేంకటేశ్వర సినిమాస్, సురేశ్ ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర, ఈశ్వరీ రాము, నివేదా పేతురాజ్ పలు కీలక పాత్రల్లో నటించారు.