MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అల్లు అర్జున్ మూవీతో ఆల్రెడీ ఫ్లాప్.. 'సరిపోదా శనివారం' రీమేక్ పై మనసుపడ్డ బాలీవుడ్ హీరో ?

అల్లు అర్జున్ మూవీతో ఆల్రెడీ ఫ్లాప్.. 'సరిపోదా శనివారం' రీమేక్ పై మనసుపడ్డ బాలీవుడ్ హీరో ?

ప్రస్తుతం బాలీవుడ్ లో ఒక యంగ్ హీరో తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన చిత్రంపై మనసుపడ్డాడట. ఆ చిత్ర రీమేక్ హక్కులు సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Dec 25 2024, 01:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఓటీటీ వచ్చాక రీమేక్ చిత్రాల ప్రభావం బాగా తగ్గింది. ఇకపై రీమేక్ చిత్రాలు చేయడం అంత సేఫ్ కాదు అని నిర్మాతలు దాదాపుగా నిర్ణయానికి వచ్చేశారు. కొన్ని చిత్రాలని మాత్రం రీమేక్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఉదాహరణకి అర్జున్ రెడ్డి చిత్రం పలు భాషల్లో రీమేక్ అయింది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఒక యంగ్ హీరో తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన చిత్రంపై మనసుపడ్డాడట. ఆ చిత్ర రీమేక్ హక్కులు సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 

 

24
Saripodhaa Sanivaaram

Saripodhaa Sanivaaram

యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ బాలీవుడ్ లో క్రేజీ హీరోగా దూసుకుపోతున్నాడు. చివరగా  కార్తీక్ ఆర్యన్ భూల్ భూలయ్యా 3తో ఘనవిజయం సొంతం చేసుకున్నాడు. నేచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం చిత్రం ఆగష్టు 29న విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. నాని కెరీర్ లో మరో మాస్ హిట్ గా ఈ చిత్రం నిలిచింది. నాని పెర్ఫామెన్స్ తో పాటు విలన్ గా ఎస్ జె సూర్య నటన ఈ చిత్రంలో నెక్స్ట్ లెవల్ అని చెప్పొచ్చు. 

Also Read : చిరంజీవికి కౌంటర్ ఇచ్చి తలపట్టుకున్న యంగ్ ప్రొడ్యూసర్.. రాజుగారి మొదటి పెళ్ళాం బావుంది అంటే అర్థం..

 

34

హీరో శనివారం మాత్రమే కోపాన్ని ప్రదర్శించే కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రాన్ని కార్తీక్ ఆర్యన్ రీసెంట్ గా చూశారట. ఎలాగైనా హిందీలో రీమేక్ చేయాలనే ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి హిందీలో 'సాటర్డే స్టార్' అనే క్రేజీ టైటిల్ అయితే బావుంటుంది అని కూడా అనుకుంటున్నారట. ఆల్రెడీ డివివి దానయ్యతో రీమేక్ హక్కుల కోసం చర్చలు జరుపుతున్నట్లు టాక్. విచిత్రం ఏంటంటే ఈ మూవీ ఓటిటిలో హిందీ వర్షన్ రిలీజ్ అయింది. ఆల్రెడీ హిందీలో ఓటిటిలో వచ్చిన చిత్రాన్ని రీమేక్ చేయడం ఎంత పెద్ద రిస్కో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 


Also Read : వెంకీని తక్కువగా అంచనా వేస్తే అంతే..సంక్రాంతి పోటీలో బాలయ్య రెండుసార్లు దెబ్బైపోయాడు

44

ఆల్రెడీ కార్తీక ఆర్యన్ అల వైకుంఠపురములో చిత్రాన్ని హిందీలో రీమేక్ చేశారు. షెహజాదా పేరుతో రీమేక్ చేయగా డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు మళ్ళీ మరో రీమేక్ కోసం ప్రయత్నిస్తుండడంతో ఈ యంగ్ హీరో స్ట్రాటజీ ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. అయితే సరిపోదా శనివారం నిజంగా హిందీలో రీమేక్ అవుతుందా  లేదా అనేది త్వరలోనే తేలనుంది. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
అల్లు అర్జున్
నాని (నటుడు)

Latest Videos
Recommended Stories
Recommended image1
1000 Crore Heroes: వెయ్యి కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టిన హీరోలు వీరే
Recommended image2
Dhurandhar 2 vs Pushpa 2: `పుష్ప 2` రికార్డులకు బీటలు.. 27 రోజులుగా బాక్సాఫీసుపై `ధురంధర్‌ 2` దండయాత్ర
Recommended image3
Janhvi Kapoor: బ్యాక్‌లెస్ డ్రెస్‌లో జాన్వీ ఆరాచకం.. చెవిపోగుల ధర తెలిస్తే ఫ్యూజులు ఔట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved