కార్తికేయ నుంచి తరుణ్ వరకూ టాలీవుడ్ లో కనిపించకుండాపోయిన యంగ్ హీరోలు ఎవరో తెలుసా?
తెలుగు సినీ పరిశ్రమలో టాలెంట్ తో ఎదిగిన యంగ్ హీరోలు, ఇండస్ట్రీలో వెలుగు వెలిగి ఒక దశలో అనూహ్యంగా తెరపై కనిపించకుండా పోయారు. కెరీర్ ప్రారంభంలోనే హిట్లు అందుకున్నా, తర్వాత ఏదో కారణంతో కనిపించకుండాపోయిన హీరోలు ఎవరో తెలుసా?

కార్తికేయ గుమ్మకొండ
2018లో RX100 చిత్రం ద్వారా యూత్ సెన్సేషన్‌గా మారిన కార్తికేయ, తర్వాత గుణ 369, 90ML వంటి చిత్రాలతో మాస్ హీరోగా ఎదిగాడు. నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్‌గా కూడా ఆకట్టుకున్నాడు. కానీ 2023 తర్వాత ఆయన కొత్త ప్రాజెక్టులపై సమాచారం లేదు. పెళ్లి తర్వాత సినిమాల నుంచి విరామం తీసుకున్నట్టు టాక్ ఉంది. కుటుంబ వ్యాపారాలపైనే ఆయన ప్రస్తుతం దృష్టి పెట్టినట్టు పరిశ్రమ వర్గాల్లో వినిపిస్తోంది.
తరుణ్
చైల్డ్ ఆర్టిస్ట్‌గా అవార్డులు గెలిచిన తరుణ్, 2000లో నువ్వే కావాలితో హీరోగా అడుగుపెట్టాడు. ఆతరువాత ప్రియమైన నీకు, , నువ్వు లేక నేను లేను వంటి సక్సెస్‌ఫుల్ సినిమాలతో లవర్‌బాయ్ ఇమేజ్‌ను సంపాదించాడు. అయితే కెరీర్ మంచి ఫామ్ లో ఉన్నపుడు సరైన కథల ఎంపిక లేకపోవడం వల్ల స్టార్‌డమ్‌ను కోల్పోయాడు. ప్రస్తుతం ఆయన సినీ పరిశ్రమలో యాక్టివ్‌గా లేడు. బిజినెస్ లు చేసుకుంటూ బిజీగా ఉన్నట్టు సమాచారం.
వరుణ్ సందేశ్
హ్యాపీ డేస్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వరుణ్ సందేశ్, తర్వాత కొత్త బంగారులోకం సినిమాతో పాపులర్ అయ్యాడు. వరుసగా కొన్ని సినిమాలు చేసిన ఈ హీరోకి హిట్లు లేకపోవడంతో అవకాశాలు తగ్గాయి. భార్య వితికాతో కలిసి బిగ్‌బాస్‌లో పాల్గొన్నప్పటికీ తిరిగి స్టార్ ఇమేజ్ తెచ్చుకోవడం సాధ్యపడలేదు. ప్రస్తుతం తక్కువ సంఖ్యలోనే సినిమాల్లో కనిపిస్తున్నాడు. సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు ఈ జంట హడావిడి చేస్తుంటారు.
అల్లు శిరీష్
మెగా ఫ్యామిలీ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన శిరీష్, గౌరవం, కొత్త జంట, ఊర్వశివో రాక్షసివో వంటి సినిమాల్లో నటించాడు. కానీ ఇప్పటివరకు మేజర్ హిట్ అందుకోలేకపోయాడు. 2022 తర్వాత అల్లు శిరీష్ ఇంత వరకూ కొత్త ప్రాజెక్ట్ చేయలేదు. ఆయన సినిమాలపై ఎటువంటి సమాచారం లేదు. ప్రస్తుతం ముంబైలో ఉంటున్నట్టు తెలుస్తోంది.
సుమంత్ అశ్విన్
ప్రముఖ నిర్మాత ఎం ఎస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్, తూనీగ తూనీగ, లవర్స్, చక్రవ్యూహం వంటి చిత్రాలతో ప్రయత్నించాడే కాని వరుసగా ప్లాప్‌లు రావడంతో ఇండస్ట్రీ నుంచి దూరమయ్యాడు. రీసెంట్ గా ఓ డాక్టర్ ను పెళ్ళి చేసుకుని పారెన్ లో సుమంత్ సెటిల్ అయినట్టు తెలుస్తోంది. మరి ఇండస్ట్రీలోకి తిరిగి ఎంట్రీ ఇస్తాడా లేదా అనేది క్లారిటీ లేదు.
ఆర్యన్ రాజేశ్
ఇవీవీ సత్యనారాయణ కుమారుడిగా రంగప్రవేశం చేసిన రాజేశ్, సొంతం, హాయ్, లీలామహల్ సెంటర్ వంటి చిత్రాల్లో నటించాడు. కెరీర్‌లో ఫామ్ ను కొనసాగించలేకపోయాడు. ఆతరువాత నిర్మాతగా మారాడు కానీ ఆ రంగంలో కూడా పెద్దగా విజయాలు అందుకోలేకపోయాడు. ప్రస్తుతం బిజినెస్ చేసుకుంటున్నట్టు సమాచారం .
వేణు తొట్టెంపూడి
హనుమాన్ జంక్షన్ వంటి చిత్రాల ద్వారా పేరు తెచ్చుకున్న వేణు, చివరిగా గోపి గోపిక గోదావరి చిత్రంలో నటించాడు. 2009 తర్వాత తెరపై పెద్దగా కనిపించలేదు. దమ్ము సినిమాలో అతిథి పాత్రలో కనిపించిన వేణు, రీసెంట్ గా రవితేజ సినిమాలో మళ్లీ మెరిసాడు. కాని ఆసినిమా కూడా హిట్ అవ్వకపోవడంతో మళ్లీ సినిమాల్లో కనిపించలేదు.
రాజా
ఓ చిన్నదానాతో హీరోగా పరిచయం అయిన రాజా, ఆనంద్, ఆనలుగురు, వంటి చిత్రాల్లో నటించాడు. మంచి ఫాలోయింగ్ ఉన్నప్పటికీ ఇండస్ట్రీని వీడాడు. ప్రస్తుతం ఆయన పాస్టర్‌గా మారి దేవుని సేవలో కాలం గడుపుతున్నాడు.