- Home
- Entertainment
- పాతాళ భైరవి రివ్యూ, 73 ఏళ్ల క్రితమే ఆడియన్స్ కు చెమటలు పట్టించిన హారర్ థ్రిల్లర్ మూవీ
పాతాళ భైరవి రివ్యూ, 73 ఏళ్ల క్రితమే ఆడియన్స్ కు చెమటలు పట్టించిన హారర్ థ్రిల్లర్ మూవీ
భారీ బడ్జెట్ అవసరం లేకుండా, గ్రాఫిక్స్ తో పనిలేకుంటాడా, ఆడియన్స్ ను హాలీవుడ్ రేంజ్ థ్రిల్ ను కలిగించడం సాధ్యమేనా? ఇప్పుడు ఏమో కాని, 70 ఏళ్ల క్రితమే ఆ పనిచేసి చూపించారు దర్శకుడు కెవి రెడ్డి. పాతాళ భైరవి సిసినిమాతో సరికొత్త అనుభూతిని అందించాడు.

టాలీవుడ్ క్లాసిక్ మూవీ.
మనం సరిగ్గా చూడటంలేదేమో కానీ.. తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. ఈతరం ప్రేక్షకులను కూడా అలరించగలిగే సత్తా ఉన్న సినిమాలు చాలా ఉన్నాయి. ఇప్పటి దర్శకులు కూడా చూపించలేని అద్భుతాలను అప్పట్లో కెవి రెడ్డి, విఠలాచార్య, ఎన్టీరామారావు లాంటి ర దర్శకులు తమ సినిమాల్లో చూపించి ఆడియన్స్ కు ప్రత్యకమైన అనుభూతిని అందించారు. అలాంటి సినిమాల్లో పాతాళభైరవి కూడా ఒకటి. 73 ఏళ్ళ క్రితం వచ్చి, అప్పటి ఆడియన్స్ కు హరర్ థ్రిల్లర్ ఫీల్ ను అందించిన ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీ పాతాళ భైరవి రివ్యూ ఇప్పుడు చూద్దాం.
నటీనటులు
నందమూరి తారకరామారావు – తోటరాముడు
ఎస్.వి. రంగారావు – నేపాళ మాంత్రికుడు
కె. మాలతి – ఇందుమతి
గిరిజ – పాతాళ భైరవి
బాలకృష్ణ – అంజిగాడు
రేలంగి – రాజుగారి బావమరది
సావిత్రి – నర్తకి (రానంటే రానే పాటలో)
విజయ వాహినీ రెండో సినిమా
షావుకారు సినిమా తరువాత విజయా వాహినీ సంస్థ నిర్మించిన రెండవ చిత్రం పాతాళ భైరవి. తొలితరం దర్శకుడు కె.వి. రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు పింగళి నాగేంద్రరావు అందించారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నేపథ్యాన్ని తీసుకుని, మధిర సుబ్బన్న దీక్షితులు రచించిన కాశీ మజిలీ కథలతో పాటు అరేబియన్ నైట్స్ లోని అల్లాద్దీన్ కథల నుండి ప్రేరణగా పాతాళభైరవి సినిమాను తెరకెక్కించారు. అద్భుత దృశ్యకావ్యంగా మలిచారు.
పాతాళభైరవి కథ విషయానికి వస్తే
తోటరాముడు అనే యువకుడు (నందమూరి తారక రామారావు) ఉజ్జయినిలోని ఉద్యానవనంలో తోటమాలి. రాకుమార్తె ఇందుమతి (కె. మాలతి)పై ప్రేమ పెంచుకున్న రాముడు, ఆమెను పెళ్లి చేసుకోవాలంటే మహారాజు విధించిన షరతులను నెరవేర్చాల్సి వస్తుంది. సంపదను సంపాదించేందుకు నేపాళ మాంత్రికుడిని (ఎస్.వి. రంగారావు) ఆశ్రయిస్తాడు. అయితే మాంత్రికుడు తోటరాముడిని బలి ఇచ్చి పాతాళ భైరవి దేవత (గిరిజ) అనుగ్రహాన్ని పొందాలని చూస్తాడు. చివరికి తోటరాముడు మాంత్రికుడిని ఓడించి, పాతాళ భైరవి ఆశీర్వాదంతో ధనం, వైభవం పొందతాడు. కానీ మాంత్రికుడి శిష్యుడు మూలికల సహాయంతో మళ్లీ అతనిని బ్రతికించి, మళీ తీసుకు తెస్తాడు. చివరికి తోటరాముడు మాంత్రికుడిని గెలిచాడా లేదా, తన ప్రేమను గెలుచుకుంటాడా లేదా అనేది సినిమా కథ.
పాతాళ భైరవి సినిమా రివ్యూ
పాతాళభైరవి సినిమా ఎలా ఉంది అని చెప్పడానికి ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కెవీ రెడ్డి డైరెక్షన్ అంటే చాలు, ఆసినిమా ఎలా ఉంటుందో అంచనా వేయవచ్చు. తీసుకున్న కాన్సెప్ట్ కు ప్రతీ ఒక్కరు న్యాయం చేయడం వల్ల అంత అద్భుతమైన సినిమా చేయగలిగారు. పాతాళ భైరవి సినిమా ఇప్పటికీ తెలుగు సినిమా చరిత్రలో ఒక అద్భుతమైన మైలు రాయిగా నిలిచింది. సరిగ్గా 73 ఏళ్ల క్రితం 1951 మార్చి 15న విడుదలైన ఈ చిత్రం, అప్పటి ప్రేక్షకులను అసలైన హరర్, థ్రిల్లర్ ఫిలింగ్ ను అందించింది. ఆ కాలంలో యువతను ఊపు ఊపేసింది పాతాళభైరవి. గ్రాఫిక్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ లేని రోజుల్లో కూడా భయంకరమైన డైలాగ్స్, స్పెషల్ సెట్టింగ్స్, మేకప్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఆడియన్స్ ను భయపెట్టిన అరుదైన ఫాంటసీ హరర్ మూవీ ఇది. మరీ ముఖ్యంగా ఆ విజ్యూవల్ ఎఫెక్ట్స్ ను ఏ ట్రిక్ ఉపయోగించి చేశారు అనేది ఇప్పటికీ ఎవరి అర్ధం కాని విషయంగానే మిగిలిపోయింది. మంచాలు పైకి లేవడం, మబ్బుల్లో తేలిపోవడం, చిత్ర విచిత్రమైన వేశాలు వేసుకున్న వ్యక్తులు, మాయమవ్వడం, ప్రత్యక్ష్యం అవ్వడం, ఇలా చెప్పుకుంటూ వెళ్తే అంద్భుతాలెన్నో ఇందులో కనిపించాయి. ఈ జనరేషన్ వారు కరెక్ట్ గా మనసు పెట్టి చూస్తే.. ఇప్పటి హర్రర్ సినిమాలను మించి థ్రిల్ ను పాతాళభైరవి లాంటిసినిమాలు అందిస్తాయి. ఈ రకంగా సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు.
నటీనటుల విషయానికి వస్తే
ఈసినిమా చేసేప్పటికి రామారావుది చాలా చిన్న వయస్సు. ఆయన కుర్ర హీరోగా ఎన్టీఆర్ నటన ముచ్చటగా అనిపిస్తుంది. ఉడుకు రక్తం పవర్ ఏంటో చూపిస్తూ.. చెప్పిన డైలాగ్స్, సినిమాలో చేసిన సాహసయాత్రం అప్పటి ప్రేక్షకులను ఉర్రూతలూగించడంతో పాటు ఎన్టీఆర్ కు అభిమానులు పెరిగేలా చేసింది. ఇక ఈసినిమాకు అసలు హీరో ఎస్వీ రంగారవు అని చెప్పవచ్చు. ఆయన చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులకు అలా గుర్తుండిపోతాయి. సాహసం సాయరా డింభకా, జై పాతాళ భైరవి లాంటి డైలాగ్స్ అద్భుతంగా పనిచేశాయి. ఎస్వీఆర్ నటన రామారావు పెద్దగా స్క్రీన్ మీద కనిపించకుండా చేసింది. ఆయన డైలాగ్స్ కు జనం ఊర్రూతలూగిపోయారు. ఇక రాకుమారి ఇందుమతిగా మాలతి నటన ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరో వైపు రాజుగారి బావుమరిది పాత్రలో రేలంగి నటన కూడా ఆకట్టుకుంటుంది. ఇక ఇతర నటీనటులు తమ పాత్ర పరిధిమేరకు బాగా నటించారు. ఇక ఈసినిమా ఇంత అద్భుతంగా రావడానికి కథాబలం ఒక కారణం అయితే.. కేవి రెడ్డి డైరెక్షన్, ఆయనస్క్రీన్ ప్లే కూడా మరో కారణం. ఇంత రెండు మూడు లైన్స్ ను తీసుకున్నా కాని, దానికి ఇలాంటి కథను రాసుకోవడం,సరిగ్గా వెండితెరపై రక్తి కట్టించగలడం మామూలు విషయం కాదు. ఇక పాతాళభైరవి విజయంలో మ్యూజిక్ భాగం కూడా ఇవ్వక తప్పదు. ఘంటసాల మాస్టారు సంగీతం, ఆయన గాత్రం నుంచి వచ్చిన పాటలు ఈసినిమాకు ప్రత్యేక సొగబులు అద్దాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
పాతాళ భైరవి ఫేమస్ డైలాగ్స్
పాతాళ భైరవి సినిమాలో పలికిన కొన్ని డైలాగులు ఇప్పటికీ ప్రజల మదిలో నిలిచేలా చేశాయి.
"సాహసం సాయరా డింభకా రాకుమారి దక్కునురా"
"మాంత్రికుని ప్రాణం పిట్టలో ఉన్నదిరా ఢింభకా"
"జై పాతాళ భైరవి, సాష్టాంగ నమస్కారం సేయరా డింభకా"
ఈ డైలాగులు అప్పట్లో యువతలో ట్రెండ్‌గా మారాయి.
పాతాళ భైరవి సినిమా ప్రత్యేకతలు
పాతాళ భైరవి 1952లో జరిగిన భారతదేశపు మొట్టమొదటి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో దక్షిణ భారతదేశం నుండి ప్రాతినిధ్యం పొందిన ఏకైక చిత్రం.
ఇది తెలుగు, తమిళ భాషల్లో ఒకే హీరోతో ఏకకాలంలో నిర్మించబడిన తొలి ద్విభాషా చిత్రం.
తమిళ వెర్షన్ 1951 మే 17న విడుదలై అక్కడ కూడా భారీ విజయాన్ని సాధించింది.
28 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకున్న అరుదైన చిత్రం.
1980లలో పద్మాలయా సంస్థ హిందీలో ఈ చిత్రాన్ని జితేంద్ర హీరోగా కలర్ లో మళ్లీ రూపొందించింది.
73 ఏళ్ల తర్వాత కూడా పాతాళ భైరవి తన వైవిధ్యం, సాంకేతిక నైపుణ్యం, కథా నిర్మాణం ద్వారా ఒక శాశ్వత చిత్రం అని నిరూపించుకుంది. తెలుగుసినిమాలో హరర్-ఫాంటసీకి నాంది పలికిన చిత్రంగా ఇది చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది.