ఇది భారత సినీ పరిశ్రమలో అత్యున్నత గౌరవం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు మోహన్‌లాల్‌ను ఎంపిక చేశారు. 1969లో మొదలైన ఈ అవార్డులను ఇప్పటి వరకూ ఎవరెవరు అందుకున్నారంటే?
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు: మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌కు 2023 సంవత్సరానికి గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఇవ్వనున్నారు. ఈ గౌరవాన్ని ఆయనకు సెప్టెంబర్ 23, 2025న 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో ప్రదానం చేస్తారు. ఇది భారతదేశంలో సినీ పరిశ్రమలోని వారికి ఇచ్చే అత్యున్నత గౌరవం. ఇండియన్ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే జ్ఞాపకార్థం దీన్ని స్థాపించారు. 1969లో తొలిసారిగా నటి దేవికా రాణి ఈ అవార్డును అందుకున్నారు. దేవికా రాణి విశాఖపట్టణంలో జన్మించి, బాలీవుడ్ లో స్టార్ గా వెలుగు వెలిగారు.

ఇప్పటివరకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న ఇండియా ఫిల్మ్ స్టార్స్
| సంవత్సరం | పేరు | ఫిల్మ్ ఇండస్ట్రీ |
| 1969 | దేవికా రాణి | హిందీ |
| 1970 | బీరేంద్రనాథ్ సర్కార్ | బెంగాలీ |
| 1971 | పృథ్వీరాజ్ కపూర్ | హిందీ |
| 1972 | పంకజ్ మల్లిక్ | బెంగాలీ, హిందీ |
| 1973 | రూబీ మైయర్స్ (సులోచన) | హిందీ |
| 1974 | బి.ఎన్. రెడ్డి | తెలుగు |
| 1975 | ధీరేంద్ర నాథ్ గంగూలీ | బెంగాలీ |
| 1976 | కానన్ దేవి | బెంగాలీ |
| 1977 | నితిన్ బోస్ | బెంగాలీ, హిందీ |
| 1978 | రాయ్‌చంద్ బోరాల్ | బెంగాలీ, హిందీ |
| 1979 | సోహ్రాబ్ మోడీ | హిందీ |
| 1980 | పైడి జైరాజ్ | హిందీ |
| 1981 | నౌషాద్ | హిందీ |
| 1982 | ఎల్. వి. ప్రసాద్ | తెలుగు, తమిళం, హిందీ |
| 1983 | దుర్గా ఖోటే | హిందీ, మరాఠీ |
| 1984 | సత్యజిత్ రే | హిందీ |
| 1985 | వి. శాంతారాం | హిందీ, మరాఠీ |
| 1986 | బి. నాగిరెడ్డి | తెలుగు |
| 1987 | రాజ్ కపూర్ | హిందీ |
| 1988 | అశోక్ కుమార్ | హిందీ |
| 1989 | లతా మంగేష్కర్ | హిందీ, మరాఠీ |
| 1990 | అక్కినేని నాగేశ్వరరావు | తెలుగు |
| 1991 | భాల్జీ పెంధార్కర్ | మరాఠీ |
| 1992 | భూపేన్ హజారికా | అస్సామీ |
| 1993 | మజ్రూహ్ సుల్తాన్‌పురి | హిందీ |
| 1994 | దిలీప్ కుమార్ | హిందీ |
| 1995 | రాజ్‌కుమార్ | కన్నడ |
| 1996 | శివాజీ గణేశన్ | తమిళం |
| 1997 | కవి ప్రదీప్ | హిందీ |
| 1998 | బి. ఆర్. చోప్రా | హిందీ |
| 1999 | హృషికేశ్ ముఖర్జీ | హిందీ |
| 2000 | ఆశా భోంస్లే | హిందీ, మరాఠీ |
| 2001 | యశ్ చోప్రా | హిందీ |
| 2002 | దేవ్ ఆనంద్ | హిందీ |
| 2003 | మృణాల్ సేన్ | బెంగాలీ, హిందీ |
| 2004 | అడూర్ గోపాలకృష్ణన్ | మలయాళం |
| 2005 | శ్యామ్ బెనెగల్ | హిందీ |
| 2006 | తపన్ సిన్హా | బెంగాలీ, హిందీ |
| 2007 | మన్నా డే | బెంగాలీ, హిందీ |
| 2008 | వి. కె. మూర్తి | హిందీ |
| 2009 | డి. రామానాయుడు | తెలుగు |
| 2010 | కె. బాలచందర్ | తమిళం |
| 2011 | సౌమిత్ర ఛటర్జీ | బెంగాలీ |
| 2012 | ప్రాణ్ | హిందీ |
| 2013 | గుల్జార్ | హిందీ |
| 2014 | శశి కపూర్ | హిందీ |
| 2015 | మనోజ్ కుమార్ | హిందీ |
| 2016 | కె. విశ్వనాథ్ | తెలుగు |
| 2017 | వినోద్ ఖన్నా | హిందీ |
| 2018 | అమితాబ్ బచ్చన్ | హిందీ |
| 2019 | రజనీకాంత్ | తమిళం |
| 2020 | ఆశా పరేఖ్ | హిందీ |
| 2021 | వహీదా రెహమాన్ | హిందీ |
| 2022 | మిథున్ చక్రవర్తి | బెంగాలీ, హిందీ |
టాలీవుడ్ నుంచి ఈ అవార్డును ఇప్పటి వరకూ ఐదుగురు స్టార్స్ అందుకున్నారు. 1974 మొదటి సారిగా దర్శకుడు బి.ఎన్. రెడ్డి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. ఆతరువాత 1982 లో తెలుగు, తమిళ, హిందీ నుంచి ఎల్. వి. ప్రసాద్ రెండో సారి ఈ అవార్డ్ సాధించారు. ఇక 1986 లో ప్రముఖ నిర్మాత నాగిరెడ్డి ని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. ఆతరువాత 1990 లో అక్కినేని నాగేశ్వరావు ఈ అవార్డు కు ఎంపిక అవ్వగా, 2009 లో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ డి . రామానాయుడు , 2016 లో ప్రముఖ దర్శకుడు కే విశ్వనాథ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ను అందుకున్నారు.
