'భజే వాయు వేగం' ట్విట్టర్ రివ్యూ.. ఈసారైనా కార్తికేయ హిట్టు కొట్టాడా ?
ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ, ఐశ్వర్య మీనన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం భజే వాయు వేగం'. ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి తెరకెక్కించారు.

ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ, ఐశ్వర్య మీనన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం భజే వాయు వేగం'. ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి తెరకెక్కించారు. ఈ చిత్రానికి సంబందించిన ట్రైలర్స్ టీజర్స్ అన్నీ ఆకట్టుకున్నాయి. దీనితో పాజిటివ్ బజ్ తోనే భజే వాయువేగం చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తండ్రి సెంటిమెంట్, క్రైమ్ అంశాలని మిక్స్ చేసి డైరెక్టర్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆల్రెడీ ఈ చిత్రానికి సంబంధించిన ప్రీమియర్ షోలు, తొలి షోల నుంచి రెస్పాన్స్ వస్తోంది. ట్విటర్ లో ఆడియన్స్ ఈ చిత్రానికి రెస్పాన్స్ ఇస్తున్నారు. ఈ చాలా కాలంగా కార్తికేయకి సరైన హిట్ లేదు. ఈ మూవీతో అయినా కార్తికేయ సక్సెస్ సాధించాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.
ఇక ట్విట్టర్ లో వస్తున్న రెస్పాన్స్ చూస్తే.. క్రికెటర్ గా ఉన్న కార్తికేయ ఎంట్రీతో ఈ చిత్రం మొదలవుతుంది. పోలీస్ స్టేషన్ లో ఈ కథ మొదలవుతుంది. విలన్ గ్యాంగ్స్ కి చెందిన ఒక బ్యాగ్ మిస్ అవుతుంది. అది హీరోకి చేరుతుంది. హీరో తండ్రి ఆసుపత్రిలో ఉంటాడు. వీటన్నింటికి లింక్ ఏంటి ? హీరో తన తండ్రిని కాపాడుకోగలిగారా ? విలన్స్ గ్యాంగ్ బాగ్ కోసం హీరోని ఏం చేసారు అనేది ఈ చిత్ర కథలో కీలకం.
మొదట అరగంట కథ చాలా నెమ్మదిగా ఉంటుంది. ఆ తర్వాత వేగం పుంజుకోవడంతో ఆసక్తి పెరుగుతుంది. డైరెక్టర్ రాసుకున్న స్క్రీన్ ప్లే కి మాత్రం మంచి మార్కులు వేయొచ్చు అని ఆడియన్స్ అంటున్నారు. చివరి వరకు ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయ్యారు.
ఇంటర్వెల్ లో వచ్చే టిస్టులు, సెకండాఫ్ కథ ఆడియన్స్ ని థ్రిల్ చేసే విధంగా ఉంటుంది. ఓవరాల్ గా స్టోరీ చూసుకుంటే రొటీన్ గా అనిపిస్తుంది. ఇంటర్వెల్ లోట్విస్ట్ మినహా ఫస్ట్ హాఫ్ అంతగా ఆకట్టుకోకపోవడం మైనస్. మ్యూజిక్ నుంచి కూడా ఈ చిత్రానికి సహకారం లభించలేదు.
దీనితో డైరెక్టర్ స్క్రీన్ ప్లేతో గట్టి ప్రయత్నమే చేసినప్పటికీ ఓవరాల్ గా ఎక్స్పీరియన్స్ గ్రేట్ అనిపించే విధంగా ఉండదు. ఈ తరహా కథలని ఇష్టపడే వారికకి మాత్రం భజే వాయువేగం చిత్రం నచ్చుతుంది.
కార్తికేయ నటన, స్క్రీన్ ప్లే ఈ చిత్రానికి పెద్ద ప్లస్. రొటీన్ స్టోరీ, సరైన మ్యూజిక్ లేకపోవడం కారణంగా భజే వాయువేగం చిత్రం యావరేజ్ మూవీగా నిలిచిపోతుందని ట్విట్టర్ ఆడియన్స్ అంటున్నారు. ఏదైనా మ్యాజిక్ జరిగితే ఈ చిత్రం మంచి వసూళ్లు సాధించే ఛాన్స్ ఉంది.