- Home
- Entertainment
- Karthikeya2: నార్త్ లో కార్తికేయ 2 క్రేజ్ ఇలా పాకుతోంది ఏంటి.. అమితాబ్ ని కలిసిన చందూ ముండేటి
Karthikeya2: నార్త్ లో కార్తికేయ 2 క్రేజ్ ఇలా పాకుతోంది ఏంటి.. అమితాబ్ ని కలిసిన చందూ ముండేటి
చిన్న చిత్రంగా విడుదలైన కార్తికేయ 2 ఊహకందని బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. కేవలం మూడు రోజుల్లో నే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న కార్తికేయ 2 వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది.

చిన్న చిత్రంగా విడుదలైన కార్తికేయ 2 ఊహకందని బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. కేవలం మూడు రోజుల్లో నే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న కార్తికేయ 2 వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. హిందీలో అయితే వైల్డ్ ఫైర్ లాగా ఈ చిత్ర క్రేజ్ వ్యాపిస్తోంది.
తొలిరోజు ఈ చిత్రాన్ని నార్త్ లో 50 కన్నా తక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ చేశారు. ప్రస్తుతం 1000 థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ రన్ కొనసాగిస్తోంది ఈ చిత్రం. దర్శకుడు చందూ ముండేటి కృష్ణ తత్త్వం కాన్సెప్ట్ తో అద్భుతమైన మ్యాజిక్ చేశాడు. హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ నటన.. వైవా హర్ష, శ్రీనివాస్ రెడ్డి సపోర్టింగ్ రోల్స్, కాల భైరవ అందించిన సంగీతం ఈ చిత్రాన్ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లాయి.
ఇక బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ కేర్ 5 నిమిషాల పాత్రలో కనిపించారు. ఆయన పాత్ర 5 నిమిషాలే అయినప్పటికీ కృష్ణుడి గురించి ఆయన చెప్పిన డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పించాయి. నార్త్ ఆడియన్స్ ప్రతి ఒక్కరూ ఈ చిత్రానికి కనెక్ట్ అవుతున్నారు. తాజాగా దర్శకుడు చందూ ముండేటి లెజెండ్రీ నటుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్ ని కలిశారు. అమితాబ్ తో మీట్ అయిన క్రేజీ పిక్ ని చందూ ముండేటి ఫ్యాన్స్ తో పంచుకున్నారు.
'ఆయన ఇచ్చిన బ్లెస్సింగ్ జీవితాంతం గుర్తుంటాయి. అమితాబ్ గారికి ధన్యవాదాలు' అని చందు ముండేటి పోస్ట్ చేశారు. ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమితాబ్ బచ్చన్ కార్తికేయ 2 చిత్రాన్ని చూసినట్లు తెలుస్తోంది. అనంతరం దర్శకుడిని పిలిచి అభినందించారట. అమితాబ్ అంతటి నటుడు అభినందించడంతో కార్తికేయ 2 చిత్ర యూనిట్ సూపర్ హ్యాపీగా ఉంది. నార్త్ లో ఈ చిత్ర క్రేజ్ కి ఇదే నిదర్శనం అంటున్నారు.
కృష్ణుడు, రాముడు లాంటి వారిని మనం దేవుళ్లుగా భావించడం వల్ల కొంతమంది అవి కథలు అని కొట్టిపారేస్తున్నారు. వాళ్ళు నిజంగానే ఈ నేలపై అత్యున్నత విలువలతో జీవించిన మనుషులు అని.. అపర మేధాసంపత్తితో దేవుళ్లుగా పూజింపబడ్డారు అని.. ఇది కథ కాదు మన చరిత్ర అని ఈ చిత్రంలో బలంగా చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు చందు ముండేటి.
శ్రీకృష్ణుడి అపర మేధాసంపత్తి ఈ ప్రపంచం మొత్తం వ్యాపించి ఉంది అని.. పార్ట్ 3లో దానిని ఎక్స్ ఫ్లోర్ చేయబోతున్నట్లు చివర్లో దర్శకుడు హింట్ ఇచ్చారు. పార్ట్ 2 కంటే పార్ట్ 3ని ఇంకా భారీగా ప్లాన్ చేస్తారని చెప్పడంలో సందేహం లేదు.