- Home
- Entertainment
- కార్తీకదీపం సీరియల్ సీజన్ 2 రాబోతోందా..? వైరల్ న్యూస్ పై క్లారిటీ ఇచ్చిన డాక్టర్ బాబు..
కార్తీకదీపం సీరియల్ సీజన్ 2 రాబోతోందా..? వైరల్ న్యూస్ పై క్లారిటీ ఇచ్చిన డాక్టర్ బాబు..
బుల్లితెర ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. ఫ్యామిలీ ఆడియన్స్ కు ఫేవరెట్ సీరియల్ కార్తీక దీపం మరోసారి తెరపై కనువిందు చేయనుంది. అయితే పాత సీరియల్ కాదు.. సరికొత్త కథతో.. ఫ్రెష్ ఎపిసోడ్స్ సందడి చేయబోతున్నాయి.

వెండితెరపై స్టార్ హీరోలకు, వారి సినిమాలకు ఎంత ఫాలోయింగ్ ఉందో.... బుల్లితెరపై కార్తీక దీపం సీరియల్ కు, ఆసీరియల్ హీరో కార్తీక్ కు అంతే ఫాలోయింగ్ ఉంటుంది. డాక్టర్ బాబు పాత్రలో అలా స్మాల్ స్క్రీన్ పై హీరోగా వెలుగు వెలిగారు నిరుపమ్, అంతే కాదు కార్తీకదీపంలో వంటలక్క పాత్రకు ఉన్నంత క్రేజ్ ఇన్నాళ్లలో ఎవరకీ రాలేదు. లేదు.
ఫ్యామిలీ ఆడియన్స్ మనసు దోచుకున్న కార్తీకదీపం సీరియల్.. వంటలక్క, నిరుపమ్.. ఈ సీరియల్ తో టీర్పీ రేటింగ్స్ కూడా కొల్లగొట్టి.. బుల్లితెర స్టార్స్ గా మారాడు . ఇక నిరుపమ్ కు సినిమా హీరోకు ఉన్నంత క్రేజ్ ఉంది బుల్లితెరపై. నిరుపమ్ కు అంత క్రేజ్ రావడానికి కారణం కార్తీక దీపం సీరియల్ ఫుణ్యమే.
తెలుగు భాషలో.. బుల్లితెర సీరియల్స్ లో.. కార్తీక దీపం సీరియల్ వెరీ స్పెషల్ అని చెప్పాలి. బుల్లితెరపై విపరీతమైన ఆదరణ దక్కించున్న వాటిలో కార్తీక దీపం సీరియల్ కూడా ఒకటి. ఆ ఇద్దరు తారలను తమ ఇంట్లో మనుషుల్లా ఓన్ చేసేసుకున్నారు ప్రేక్షకులు. తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఆదరణ దక్కించుకున్న సీరియళ్లల్లో టాప్ లో ఉన్న కార్తీక దీపం సీరియల్ రెండో సీజన్ కు ఏర్పాట్లు జరుగుతున్నట్టు న్యూస్ వైరల్ అవుతూ వస్తోంది.
కార్తీక దీపం 2 గురించి కొద్ది రోజులుగా వార్తలు వైరల్ అవుతూ వస్తున్నాయి. అయితే కార్తీక దీపం సీరియల్ కు సీక్వెల్ ఉంటుందా లేదా అనే విషయంలో.. క్లారిటీ ఇచ్చాడు డాక్టర్ బాబు. రీసెంట్ గా నిరుపమ్ పరిటాల ఓ ఇంటర్వూలో దీని గురించి క్లారిటీ ఇచ్చాడు. గతేడాది ఫిబ్రవరిలోనే కార్తీక దీపం సీరియల్ కు శుభం కార్డు వేశారు. దాంతో ఫ్యాన్స్ బాగా హార్ట్ అయ్యారు.
బాగా డిస్సపాయింట్ అయిన ఆడియన్స్ కు ఇంకా నిరాశ కలిగించే న్యూస్ చెప్పారు డాక్టర్ బాబు. నిరుపమ్ మాట్లాడుతూ...ఇప్పటికీ నేనెక్కడ కనిపించినా జనాలు వంటలక్క గురించి అడుగుతుంటారు. పేరు మర్చిపోయి నన్ను డాక్టర్ బాబు అనే అంటుంటారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో గొడవలుంటాయి. అందుకే కార్తీక దీపం సీరియల్ అందరికీ కనెక్ట్ అయింది అన్నారు.
అంతే కాదు నా భార్యతో బయటకి వెళ్లినా వంటలక్క గురించే అడుగుతుంటారు. తను నవ్వి ఊరుకుంటుంది. నాకు తెలిసినంత వరకు కార్తీక దీపం సీరియల్ కు కొనసాగింపు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ స్థాయి కథ కుదరాలి. అన్నీ కుదిరితేనే సీక్వెల్ చేయాలి. లేదంటే టచ్ చెయ్యకపోవడమే బెటర్. కానీ మా ఇద్దరి కాంబినేషన్‌లో మరో సీరియల్ చెయ్యొచ్చు అంటూ క్లారిటీ ఇచ్చాడు డాక్టర్ బాబు.
దాంతో.. స్వయంగా నిరుపమ్ ఈ విషయం చెప్పడంతో.. డిస్సపాయింట్ అయిన ఆడియన్స్.. డాక్టర్ బాబు, వండలక్క కాంబినేషన్ లో మరో సీరియల్ వస్తుందని తెలిసి కాస్త హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి. మరి ఆ సీరియల్ కార్తీకదీపాన్ని మరిపిస్తుందా చూడాలి.