MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కార్తీక దీపం ఫేమ్ మోనితా ఇంట పెళ్లి సందడి, బర్త్ డే రోజే శోభా శెట్టి పెళ్ళి చూపులు

కార్తీక దీపం ఫేమ్ మోనితా ఇంట పెళ్లి సందడి, బర్త్ డే రోజే శోభా శెట్టి పెళ్ళి చూపులు

వెండితెర తారలతో పాటు.. ఫేమస్ బుల్లితెర తారలు కూడా వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఈక్రమంలోనే తెలుగు రాష్ట్రాలలో సూపర్ హిట్ సీరియల్ కార్తీక దీపం ఫేమ్ శోభాశెట్టి కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు తెలుస్తోంది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 24 2023, 11:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది తారులు పెళ్ళి చేసుకుంటున్నారు.వెండితెరతో పాటు బుల్లితెరపై కూడా ఫేమస్ అయినవాళ్లు పెళ్లి చేసుకుంటున్నారు. రీసెంట్ గా అమర్ దీప్, తేజస్వీ పెళ్ళి బంధంతో ఒకట్టి అయ్యారు. ఇక ఇప్పుడు కార్తీక దీపం ఫేమ్ మోనితా అలియాస్ శోభా శెట్టి కూడా పెళ్ళి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కార్తీక దీపం సీరియల్ లో వంటలక్క,  డాక్టర్ బాబు తరువాత అంత పేరు తెచ్చుకున్న పాత్ర డాక్టర్ మోనితా, విలన్ గా డాక్టర్ బాబు దంపతుల మధ్య చిచ్చు పెడుతూ.. దూరం చేస్తూ వచ్చిన పాత్ర మొనితది. నటి శోభా శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శోభా శెట్టి అనడం కన్నా మోనిత అంటేనే అభిమానులు టక్కున ఈమెను గుర్తుపడతారు.
 

36

కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది శోభ శెట్టి. ఫ్యాన్స్ ను కూడా సంపాదించుకుంది.  ఇక ఈ బుల్లితెర బ్యూటీ త్వరలో పెళ్ళి పీటలెక్కబోతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది శోభా శెట్టి. తన పెళ్ళి చూపుల కథ కూడా వివరించింది. 
 

46

కార్తీక దీపం సీరియల్ తో పాటు.. ఓన్ గా  యూట్యూబ్ ఛానల్ కూడా  రన్ చేస్తుంది శోభిత. ఇందులో  తనకు సంబంధించిన అన్ని పర్సనల్ విషయాలు.. వాటితో పాటు  సీరియల్ కు సంబంధించిన విషయాలను కూడా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా పంచుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈమె తన పెళ్లి చూపులు అంటూ ఒక వీడియోని షేర్ చేశారు. 
 

56

 ప్రతి సంవత్సరం  నా పుట్టినరోజు సందర్భంగా మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరిగేది.. అయితే ఈ పుట్టినరోజున మా అమ్మ నాకు తెలియకుండా పెళ్లి చూపులు ఏర్పాటు చేసింది అంటూ.. బ్రేకింగ్ న్యూస్ చెప్పింది మోనిత. అయితే ఇది తనకు ఎంతో థ్రిల్లింగ్ గా ఉంది అంటుంది శోభ.. ఎందుకంటే.. అబ్బాయి ఎవరో ఏంటో తెలియకుండానే పెళ్లి  అనేసరికి నాకు పెళ్లి కళ వచ్చేసింది అంటూ తెగ సిగ్గు పడిపోయింది. 

66

ఈ విధంగా శోభా శెట్టి తన పెళ్లి చూపుల గురించి ఈ వీడియోని షేర్ చేయడమే కాకుండా ఇల్లు మొత్తం డెకరేషన్ చేసి,ఇంటి ముందు టెంట్ వేసి పెళ్లి చూపులకు వచ్చిన వారికి విందు భోజనాలను కూడా కవర్ చేస్తూ.. వీడియోను తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Ramayana Stars: రామాయణ స్టార్స్ యశ్, రణ్‌బీర్... ఇద్దరిలో ఎవరి ఆస్తి ఎక్కువ?
Recommended image2
Spider Man: Brand New Day Review: స్పైడర్‌ మ్యాన్‌: బ్రాండ్‌ న్యూ డే రివ్యూ.. పీటర్‌ సాహసాలు ఈ సారి వేరే లెవల్‌
Recommended image3
Ikka On OTT: పనోడితో భార్య చేసిన మిస్టేక్, అడ్డంగా దొరికిపోయిన విలన్.. దుమ్ములేపుతున్న కోర్ట్ రూమ్ డ్రామా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved