MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karthika Deepam 2 Today Episode: దీపకు జ్యో వార్నింగ్- జ్యోకు కార్తీక్ కౌంటర్- జ్యోపై సుమిత్ర కోపం

Karthika Deepam 2 Today Episode: దీపకు జ్యో వార్నింగ్- జ్యోకు కార్తీక్ కౌంటర్- జ్యోపై సుమిత్ర కోపం

Karthika Deepam 2 Today Episode (మే 22వ తేదీ)లో దీపను పనిమనిషి అని దారుణంగా అవమానించిన జ్యో. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కార్తీక్. దీపకు వార్నింగ్ ఇచ్చిన జ్యో. ఆఫీసు విషయాలు ఇంట్లో చెప్పి అక్కడ తిట్లు తిన్న జ్యో. ఈ రోజు ఎపిసోడ్ లో ఇంకా ఏం జరిగిందంటే... 

3 Min read
Author : Kavitha G
Published : May 22 2026, 09:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
Image Credit : Jiohotstar

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ శుక్రవారం ఎపిసోడ్ లో దీపకు మెయిల్ ఐడీ గురించి తెలియకపోవడంతో స్టాఫ్ అందరిముందు అవమానిస్తుంది జ్యోత్స్న. అర్హత లేని వ్యక్తిని తనకు పోటీగా తీసుకొచ్చారని దీపను నానామాటలు అంటుంది. నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోయేదాన్ని అని దీపను రెచ్చగొడుతుంది. హౌజ్ కీపింగ్‌కు మాత్రమే పనికి వచ్చే నీలాంటివాళ్లతో నాకు పోటీ ఏంటో అని దీపను చాలా తక్కువ చేసి మాట్లాడుతుంది జ్యోత్స్న.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28
కార్తీక్ సపోర్ట్
Image Credit : Jiohotstar

కార్తీక్ సపోర్ట్

అప్పుడే కార్తీక్, అక్కడ పనిచేసే వ్యక్తిని పిలిచి నీకు మెయిల్ ఐడీ ఉందా, ఎవరు క్రియేట్ చేశారు అని అడుగుతాడు. నా ఫ్రెండ్ క్రియేట్ చేశాడని చెప్తాడు ఆ వ్యక్తి. ఏదైనా విషయం మనకు తెలియకుంటే మన ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు. అది మన ఫోన్‌కు పంపిస్తారు. దాంతో లాగిన్ కావచ్చు. ఈ మాత్రం దానికే కంగారుపడిపోతే ఎలా అని ఇన్ డైరెక్ట్ గా దీపతో చెప్తాడు కార్తీక్. దాంతో దీప హ్యాపీగా లాగిన్ అవుతుంది.

Related Articles

Related image1
Karthika Deepam 2 Today Episode: దీపను దారుణంగా అవమానించిన జ్యో- దీప, CEO పోటీ నుంచి తప్పుకుంటుందా?
Related image2
Karthika Deepam 2 Today Episode: కాంచన, దీప సూపర్ హ్యాపీ- జ్యోపై పారు ఫైర్- సూరజ్ పై జ్యో రివేంజ్
38
జ్యో వార్నింగ్
Image Credit : Jiohotstar

జ్యో వార్నింగ్

ఆ తర్వాత జ్యోత్స్న దీప దగ్గరకు వెళ్లి, సీఈఓ అయి కన్నవాళ్లకు దగ్గర అవ్వాలని చూస్తున్నావా. కన్నతల్లిని అమ్మ అని పిలవాలి అనుకుంటున్నావా? వాళ్లు దూరమైతే ఎలా ఉంటుందో చూపిస్తా. నా ముందు మోకాళ్ల మీద కూర్చొని నేను ఓడిపోయాను జ్యోత్స్న. ఇక వదిలెయ్ అని నీతో అనిపించకపోతే నేను జ్యోత్స్ననే కాదు అని వార్నింగ్ ఇస్తుంది.

48
స్వప్న, కాశీల ప్రేమ
Image Credit : Jiohotstar

స్వప్న, కాశీల ప్రేమ

మరోవైపు కాశీ, స్వప్న ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులు ఏమన్నా మనం భరిస్తాం. కానీ, లైఫ్ పాట్నర్ ఒక మాట అంటే మాత్రం తీసుకోలేము. పెళ్లి బాగా కమర్షియల్ అయిపోయింది అంటుంది స్వప్న. వస్తువులకు వారెంటీ ఉన్నట్లే పెళ్లికి కూడా ఉంటే బాగుంటుందని అంటుంది స్వప్న. అదేంటీ అని అడుగుతాడు కాశీ. 

కలిసి ఉండలేము అని ఎలా విడాకులు తీసుకుంటున్నారో, కలిసి ఉంటాము అని కూడా అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకం పెట్టాలి అని చెప్తుంది స్వప్న. నీతో నేను వాదించలేను కానీ.. నాకోసం మంచి టమాట రసం పెట్టమని చెప్తాడు కాశీ. సరే అని వెళ్లిపోతుంది స్వప్న. అగ్రిమెంట్‌లు, గ్యారెంటీలు రాసుకుంటే అది వ్యాపారం అవుతుంది కానీ పెళ్లి కాదు అని మనసులో అనుకుంటాడు కాశీ.

58
కాంచన వార్నింగ్
Image Credit : Jiohotstar

కాంచన వార్నింగ్

మరోవైపు కార్తీక్, దీప, జ్యోత్స్న ఇంటికి వస్తారు. మొదటి రోజు ఆఫీసు ఎలా ఉందని దీపను అడుగుతుంది కాంచన. నేను చెబుతానని మొదలు పెడుతుంది జ్యోత్స్న. ముందు నాకొక విషయం అర్థం కాలేదు. బావ అంటే జాలిపడి దీప మెడలో తాళి కట్టాడు. చదువు సంధ్య లేని పల్లెటూరి మొద్దుని నువ్వు ఎలా కోడలిగా ఒప్పుకున్నావ్ అత్త అంటుంది జ్యోత్స్న. నోరు జారితే చేయి లేస్తుందని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది కాంచన.

ఆఫీస్‌ లో ల్యాప్‌టాప్ చూడగానే దీపకు చేతులు వణికాయి. ఇక పని ఏం చేస్తుంది. అదేమైనా కిచెన్ లో వంట చేయడమా? కనకపు సింహాసనంపై శునకాన్ని కూర్చోపెడితే ఏమవుతుందో తెలియదా.. ఆ పద్యం దీపలాంటి వాళ్లకు బాగా సూట్ అవుతుందని ఎగతాళి చేస్తుంది జ్యోత్స్న. అప్పుడే వచ్చిన సుమిత్ర కోపంగా జ్యోత్స్న అని అరుస్తుంది.

68
దీప గెలుస్తుంది
Image Credit : Jiohotstar

దీప గెలుస్తుంది

నువ్వు ఆగు అత్త.. నేను సమాధానం చెప్తాను అని స్టార్ట్ చేస్తాడు కార్తీక్. కుందేలు, తాబేలు కథ తెలుసు కదా.. కుందేలుది గెలుస్తానని గర్వం, కానీ తాబేలుది నమ్మకం. గెలుపు గర్వం ఏదో రోజు తల దించుకుంటుంది, నమ్మకం తల ఎత్తుకుంటుంది. నా భార్యకు ఉన్నతమైన విద్య లేదు, కానీ, సంస్కారం ఉంది అని దీప గురించి గొప్పగా చెప్తాడు కార్తీక్.

78
సుమిత్ర కోపం
Image Credit : Jiohotstar

సుమిత్ర కోపం

బాగా చెప్పావురా అని కార్తీక్‌ను మెచ్చుకుంటుంది సుమిత్ర. మమ్మీ.. బావ నన్ను తిడుతున్నాడు అర్థమవుతోందా అంటుంది జ్యోత్స్న. ఈ పంచాయతీ మొదలు పెట్టిందే నువ్వు. ఒక కూతురిగా నువ్వు గెలవాలని నేను కోరుకుంటాను. కానీ నిజాయతీగా గెలువు. నువ్వు నా బలహీనత కదా అని ఏం చేసిన భరిస్తా అనుకోకు. కన్నవాళ్లనే కాదు.. కడుపున పుట్టినవాళ్లను కూడా మర్చిపోయేంత శక్తి నాకు ఉంది అని జ్యోత్స్నకు గట్టిగా వార్నింగ్ ఇస్తుంది సుమిత్ర.

88
శ్రీధర్ సపోర్ట్
Image Credit : Jiohotstar

శ్రీధర్ సపోర్ట్

నేర్చుకోవాలనే తపన ఉంటే ఏదైనా నేర్చుకోవచ్చు. నువ్వు గెలుస్తావనే నమ్మకం నాకుంది అని దీపకు సపోర్ట్ గా మాట్లాడుతాడు శ్రీధర్. ఫ్రెషప్ అయి వస్తే భోజనం చేద్దామని కార్తీక్, దీపలతో చెప్తుంది కాంచన. మేడమ్ నాతో ఇంకా ఏదైనా పని ఉందా? వెళ్లొచ్చా అని జ్యోని అడుగుతాడు కార్తీక్. దాన్ని అడిగేదేంటీ నువ్వు వెళ్లు అంటుంది పారు. కోపంగా చూస్తుంది జ్యోత్స్న. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Prabhas: ప్రభాస్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసిన మూడు సినిమాలేంటో తెలుసా? ఆ సినిమాలు చేయకుండా ఉంటే?
Recommended image2
Purushaha Moview Review: పురుషః మూవీ రివ్యూ.. సప్తగిరి, పవన్‌ కళ్యాణ్‌, కసిరెడ్డి నవ్వించారా?
Recommended image3
Kiara Advani: కూతురి గురించి గేమ్ ఛేంజర్ నటి ఎమోషనల్ పోస్ట్.. కానీ అసలు ట్విస్ట్ ఇదే!
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: దీపను దారుణంగా అవమానించిన జ్యో- దీప, CEO పోటీ నుంచి తప్పుకుంటుందా?
Recommended image2
Karthika Deepam 2 Today Episode: కాంచన, దీప సూపర్ హ్యాపీ- జ్యోపై పారు ఫైర్- సూరజ్ పై జ్యో రివేంజ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved