Karthika Deepam: సౌర్య గురించి తెలుసుకొని షాక్ అయినా మోనిత.. బాధపడుతున్న కార్తీక్?
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకెళ్తుంది. ఒకటే కథతో నిత్యం ట్విస్ట్ ల మీద ట్విస్టులతో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు నవంబర్ 22 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్లో సౌర్య అక్కడికి రావడంతో ఎక్కడికి వెళ్లావు అని ఇంద్రుడు అడగగా ఏమీ లేదు బాబాయ్ జిరాక్స్ షాప్ దగ్గరికి వెళ్లాను అని అనడంతో ఎందుకమ్మా అనడంతో వీటి కోసం వెళ్ళాను బాబాయ్ అని సౌర్య తన చేతిలో ఉన్న పోస్టర్స్ ఇంద్రుడికి చూపించడంతో ఇంద్రుడు ఒక్కసారిగా షాక్ అవుతాడు. పోచస్ లో అమ్మ నాన్న ఫోటోలు వేయిద్దాం అంటే నా దగ్గర వాళ్ళ ఫొటోస్ లేవు అందుకే నా ఫోటో వేయించి నీ ఫోన్ నెంబర్ ఇచ్చాను బాబాయ్ ఈ సంగారెడ్డి మొత్తం ఈ పోస్టర్లు అతికిద్దాం అమ్మ నాన్నలు ఇక్కడికి వస్తే నీ నెంబర్ కచ్చితంగా ఫోన్ చేస్తారు అనడంతో ఇంద్రుడు ఏం మాట్లాడాలో తెలియక సరే అమ్మ అని అంటాడు.
అప్పుడు వెళ్దాం పద బాబాయ్ అనడంతో ఇప్పుడు వద్దమ్మ చీకటి పడింది రేపు ఉదయాన్నే వెళ్లి పోదాం అని అంటాడు ఇంద్రుడు. ఆ తర్వాత కార్తీక్ డాక్టర్ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది నాలుగు రోజుల్లో డిస్చార్జ్ చేయొచ్చు అని చెప్పడంతో ఆ డాక్టర్ థాంక్స్ చెప్పి కార్తీక్ కి డబ్బులు ఇస్తాడు. అప్పుడు ఆ డబ్బులు చూసిన కార్తీక్ మొన్న చైన్ అమ్మానని చెప్పాను ఇప్పుడు ఉంగరం అమ్మానని మోనిత కు చెప్పాలి లేకపోతే అనుమానం వస్తుంది అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు మోనిత కార్తీక్ ని ఫాలో అవుదాం అనుకుంటే కార్తీక్ మిస్ అయిపోయాడు అనుకునే టెన్షన్ పడుతూ ఉంటుంది.
కార్తీక్ కోసం దీప ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటుంది మోనిత. అప్పుడు మోనిత శౌర్య ఇంద్రుడు దంపతులు ఉన్న ఫోటోను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. కార్తీక్ మాటలు చూస్తే గతం గుర్తుకు రావట్లే ఉన్నాయి కానీ చేస్టలు చూస్తే గతం గుర్తుకు వచ్చింది అన్న డౌట్ వస్తోంది అని ఆలోచిస్తూ ఉంటుంది మోనిత. ఇంతలో దీప అక్కడికి వచ్చి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటూ మోనిత చేతిలో ఉన్న ఆ ఫోటోని లాక్కుంటుంది. అప్పుడు నీ కూతురు కనిపించిందా వంటలక్క అని అడుగుతూ ఉండగా ఇంతలోనే కార్తీక్ అక్కడికి వచ్చి ఇదిగో చూడు కార్తీక్ దీప కూతురు అని అనడంతో వెంటనే కార్తీక్ వంటలక్క కూతురు నీకు కనిపించిందా అని మోనిత ని ఎదురు ప్రశ్నిస్తాడు.
అప్పుడు కార్తీక్ ఇంతకుముందు ఎప్పుడు చూడలేదా అని పదేపదే అడగగా లేదు కార్తీక్ చూడలేదు అని గట్టిగా సీరియస్ అవుతుంది. అవన్నీ విడిచిపెట్టు కార్తీక్ నువ్వు ఎక్కడికి వెళ్లావు అని అనడంతో ఉంగరం తాకట్టు పెట్టడానికి వెళ్లాను అని అంటాడు కార్తీక్. అవునులే ఈ వంటలక్క కోసమా అని అరిచి అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. ఈ ఫోటోని జాగ్రత్తగా పెట్టుకో మోనిత కంట కనపడకుండా ఉండాల్సింది సరే జాగ్రత్తగా ఉండు అని చెప్పి కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు దీప బట్టలు సర్దుతూ ఉండగా ఒక్కసారిగా కళ్ళు తిరుగుతాయి. మరొకవైపు ఇంద్రుడు సౌర్య కలసి గోడలకి పోస్టర్స్ అతికిస్తూ ఉంటారు
మరొకవైపు చంద్రమ్మ సౌర్య పోటోలకు రంగులు వేస్తూ ఆ ఫోటోలు నెంబర్లు కనిపించకుండా చేస్తూ ఉంటుంది. అప్పుడు క్షమించు సౌర్యమ్మ ఇలా చేస్తున్నందుకు అని అనుకుంటూ ఉంటుంది. మరొకవైపు కార్తీక్ దీప దగ్గరికి వెళ్ళగా దీప పడుకుని ఉండడంతో ఏమైంది దీప ఇంకా పడుకొని ఉన్నావని అనడంతో డాక్టర్ బాబు ఈ మధ్య నాకు బాగుండడం లేదు అని అనగా కార్తీక్ బాధపడుతూ ఉంటాడు. అప్పుడు దీప నా కూతురు కనిపిస్తే నేను బాగా అయిపోతాను డాక్టర్ బాబు అనడంతో అది సరే ఫస్ట్ సౌర్య గురించి ఆలోచించడం మానేయ్ అలా ఆలోచించే నువ్వు ఇలా అయిపోయావు అని దీపకు ధైర్యం చెబుతూ ఉంటాడు కార్తీక్.
మరోవైపు మోనిత ఇంటికి వెళ్ళగా అక్కడ ఇంటికి తాళాలు వేసి ఉండడంతో ఏంటి ఇంటికి తాలాలు వేసి ఉన్నాయి అనుకుంటూ ఉంటుంది మోనిత. ఇప్పుడు కిటికీలో నుంచి దుర్గ బంగారం పిలవగ బయట తాళాలు వేసి లోపల ఏం చేస్తున్నావురా అని అరుస్తుంది మోనిత. అప్పుడు దుర్గ నువ్వు ఇంటి బయట ఎవరి తల పగలగొట్టావో చెబితే నేను తాళం తీస్తాను అని అంటాడు. అప్పుడు మోనిత నాకు తెలియదు అని అంటూ ఉంటుంది. అప్పుడు అసలు విషయం చెప్తావా లేకపోతే మనం ఇలా ఉండటం చూసి కార్తీక్ సార్ కి ఇంక అనుమానం పెంచమంటావా అని బెదిరిస్తాడు దుర్గ. అప్పుడు మోనిత నాకు తెలియదు రా తెలియదు తెలియదు అని అంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి కార్తీక్ వస్తాడు.