- Home
- Entertainment
- Karthika Deepam: షాకింగ్ ట్విస్ట్.. యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయిన డాక్టర్ బాబు, వంటలక్క!?
Karthika Deepam: షాకింగ్ ట్విస్ట్.. యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయిన డాక్టర్ బాబు, వంటలక్క!?
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో కొనసాగుతుంది.

ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. దీప కారులో హిమ అన్న మాటలు గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ భయ పడుతూ ఉండగా కార్తీక్ ధైర్యం చెబుతాడు.
అదే క్రమంలో కార్తీక్ (Karthik) ఎన్నో ఆనందాలు కోల్పోయాము.. ఎన్నో కష్టాలు పడ్డాము.. ఇప్పుడు అవన్నీ పొయ్యాయి. ఇప్పుడు వంటలక్క, డాక్టర్ బాబు మాత్రమే అంటూ ఆనందంగా చెబుతూ ఉంటాడు. దానికి దీప (Deepa) కూడా కొంత ఆనందం వ్యక్తం చేస్తుంది.
మరోవైపు సౌందర్య (Soundarya) పూజారి మాటలకు బయపడి టికెట్స్ బుక్ చేసుకుని కార్తీక్, దీప ల దగ్గరికి వెళ్లడానికి సిద్ధంగా ఉంటుంది. ఇక దాంతో ఆనంద్ రావు (Anand Rao) సౌందర్యతో కొన్ని మాటలే వినాలి, కొన్ని మాటలు నమ్మాలి. అంటూ ధైర్యం చెప్పి టికెట్స్ క్యాన్సిల్ చేపిస్తాడు.
మరోవైపు హిమ (Hima) వంటలక్క.. చికెన్ బాగా రుచి గా ఉంది త్వరగా వంట పూర్తి చెయ్యి అంటూ ఆట పట్టిస్తుంది. ఇక అదే క్రమంలో కార్తీక్, దీప లు ఐ లవ్ యు.. ఐ లవ్ యు టూ లు కూడా చెప్పుకుంటారు. ఇక దీప, కార్తీక్ (Karthik) కు ఇష్టమైన మందు బాటిల్ ను సప్రైజ్ గా ఇస్తుంది.
మరోవైపు సౌందర్య (Soundarya) అదేవిధంగా పూజారి చెప్పిన మాటలకు భయపడుతూ ఉంటుంది. ఇక అక్కడకు ఆనంద్ రావ్ (Anad Rao) వచ్చి అనేక విధాలుగా ధైర్యం చెబుతాడు. అంతేకాకుండా నిన్ను హాస్పిటల్ కు తీసుకు వెళతాను అని అంటాడు.
సౌందర్య (Soundarya) మాత్రం మీరు నాకు ఎంత ధైర్యం చెప్పిన నాకు ఆ విషయంలో మనశ్శాంతి ఉండడంలేదు అని ఏడుస్తుంది. తరువాయి భాగం లో మరోవైపు కార్తీక్ (Karthik) ఫ్యామిలీ కొండగట్టు ప్రాంతానికి వెళతారు. అక్కడ హిమ కారు డ్రైవ్ చేస్తాను అంటూ కారు స్టార్ట్ చేస్తుంది.
కొంత దూరం వెళ్ళిన తరువాత హిమ (Hima) కారు హ్యాండిల్ చేయలేకపోతోంది. ఆ తర్వాత కారు బోల్తా కొట్టి బ్లాస్ట్ అవుతుంది. దాంతో సౌర్య (Sourya) తప్ప ముగ్గురూ చనిపోతారు. ఇక వీరి ముగురి జ్ఞాపకార్ధ ఫోటోలు కూడా ఏర్పాటు చేస్తారు. ఇక ఈ క్రమంలో రేపటి భాగంలో ఎం జరుగుతుందో చూడాలి.