అమెరికాకు సిద్దమైన వంటలక్క, డాక్టర్ బాబు.. సడన్ ఎంట్రీ ఇచ్చిన విహారి?
బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ తెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ సీరియల్ కథ ఆసక్తిగా మారటంతో మళ్లీ రేటింగ్ తో దూసుకుపోతుంది.
బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ తెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ సీరియల్ కథ ఆసక్తిగా మారటంతో మళ్లీ రేటింగ్ తో దూసుకుపోతుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.
కార్తీక్ (Karthik) కుటుంబాన్ని అమెరికాకు పంపించడానికి సౌందర్య డిసైడ్ అవుతుంది. దీంతో హిమను సౌందర్య (Soundarya) అమెరికాకు వెళ్ళాలని గట్టిగా చెబుతోంది. దాంతో హిమ కోపంగా బట్టలు సర్దుకుంటుండగా గతంలో విహారి గురించి కార్తీక్ రాసుకున్న డైరీ బయట పడుతుంది.
ఆ డైరీ చూసిన హిమ (Hima).. విహారి (Vihari) ఎవరు అంటూ.. కోపంగా విహారి పేరుపై ఆ గీతలు ఎందుకు గీసారని అనుకుంటుంది. దీప ఎందుకిలా చేసావని కార్తీక్ రాసుకోవడంతో ఏం జరిగిందని ఆ డైరీ అక్కడ పెట్టేసి అక్కడినుంచి వెళ్లిపోతుంది.
మరోవైపు సౌందర్య.. కార్తీక్ ను (Soundarya, Karthik) అమెరికాకు పంపించడానికి ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. కార్తీక్ మాత్రం అస్సలు ఒప్పుకోడు. భయపడి వెళ్లాల్సిన పనేముందంటూ సౌందర్య, దీపలను ప్రశ్నిస్తాడు. దీప (Deepa) కూడా అమెరికాకి వెళ్లడానికి ఒప్పించే ప్రయత్నం చేస్తుంది.
కార్తీక్ (Karthik) మాత్రం అమెరికాకు వెళ్లడానికి ఇష్టపడడు. ఎంతో ఇష్టపడి కట్టుకున్న హాస్పిటల్ వేరే వాళ్లకు ఇవ్వాల్సి వస్తుందని మళ్లీ అక్కడి ఏర్పాట్లు చేసుకోవాలని సాధ్యం కాదని అనేసరికి సౌందర్య (Soundarya) ధైర్యం చెప్పి హాస్పిటల్ ఏర్పాట్లు చేసుకోవచ్చని అమెరికాకి వెళ్లడానికి ఒప్పిస్తుంది.
ఇక కార్తీక్ (Karthik) కూడా హిమ, సౌర్య కోసం (Hima Sowrya) అమెరికాకు వెళ్తాను అంటూ మాట ఇస్తాడు. ఇక హాస్పిటల్, వీసా ఏర్పాట్ల కోసం మూడు నెలల సమయం పట్టడంతో మూడు నెలల సమయం గడిచిపోతుంది. అందరు మూడు నెలల తర్వాత మళ్లీ కనిపిస్తారు.
అందరు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తుంటారు. హాస్పిటల్, వీసా ఏర్పాట్ల గురించి మాట్లాడుకుంటారు. కార్తీక్ (Karthik) తన కుటుంబంతో అమెరికాకు వెళ్తున్న సందర్భంగా అందరూ కలిసి భోజనం చేస్తారు.
అంతలోనే కార్తీక్ (Karthik) అమెరికాకు వెళ్తున్నారని తెలిసి విహారి తన భార్యతో రావడంతో అందరు షాక్ అవుతారు. ఇక విహారి (Vihari) మొహమాటంతో అక్కడినుండి వెళుతుండగా హిమ విహారిని ఆపి తన తల్లితండ్రి ఎలా పరిచయమయ్యారని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తోంది.