- Home
- Entertainment
- కార్తీ సింప్లిసిటీ చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు, అందరినీ కూర్చోబెట్టి స్వయంగా భోజనాలు వడ్డించిన హీరో
కార్తీ సింప్లిసిటీ చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు, అందరినీ కూర్చోబెట్టి స్వయంగా భోజనాలు వడ్డించిన హీరో
హీరో కార్తీకి అందరికంటే విభిన్నమైన శైలి ఉంది. నటనలో కానీ రియల్ లైఫ్ బిహేవియర్ లో కానీ కార్తీ ప్రత్యేకంగా ఉంటారు. కార్తీ వ్యవహార శైలిలో సింప్లిసిటీ కనిపిస్తుంది. తాజాగా మరోసారి కార్తీ తన సింప్లిసిటీ చాటుకుని ప్రశంసలు దక్కించుకున్నారు.

కార్తీ హిట్ చిత్రాలు
హీరో కార్తీ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ కార్తీకి మాస్ ఆడియన్స్ లో, యువతలో సపరేట్ ఫాలోయింగ్ ఉంది. ఆవారా, నా పేరు శివ, ఖాకీ, సర్దార్, ఖైదీ లాంటి చిత్రాలతో కార్తీ నటుడిగా ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు.
సర్దార్ మూవీకి సీక్వెల్
హీరో కార్తీ ప్రస్తుతం సర్దార్ 2 చిత్రంలో నటిస్తున్నారు. మూడేళ్ళ క్రితం పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన సర్దార్ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్ ఇప్పుడు తెరకెక్కుతోంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. షూటింగ్ చివరి రోజున కార్తీ తన సింప్లిసిటీ చాటుకున్నారు. ఎక్కడ ఉన్నా అందరిలో సామాన్యుడిగా కలిసి పోవడం కార్తీ స్టైల్.
కార్తీ సింప్లిసిటీ
సర్దార్ 2 షూటింగ్ చివరి రోజున చిత్ర సభ్యులందరికీ విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ విందులో హీరో కార్తీ చిత్ర యూనిట్ మొత్తాన్ని కూర్చుబెట్టి తానే స్వయంగా అందరికీ భోజనం వడ్డిస్తున్నారు. ఓపిగ్గా ఎంతో ప్రేమతో ఒక్కరికి కార్తీ భోజనం వడ్డించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కార్తీ నుంచి వరుస సీక్వెల్ చిత్రాలు
కార్తీ సింప్లిసిటీని అభిమానులు కొనియాడుతున్నారు. రానున్న రోజులో కార్తీ నుంచి వరుసగా సీక్వెల్ చిత్రాలు రాబోతున్నాయి. నేచురల్ స్టార్ నాని హిట్ 3 చిత్రంలో చివర్లో కార్తీ ఎంట్రీ ఇచ్చారు అంటే హిట్ 4 మూవీలో హీరో కార్తీ అని అనౌన్స్ చేసేసినట్లే. అదే విధంగా ఖైదీ 2 కూడా రానుంది.
Unseen 🚨😍
Our man himself served briyani
for the completion of the #Sardar2 shoot.@Karthi_Offl#Karthi#MrVersatileKarthipic.twitter.com/JtxT0y5fPI— Karthi Trends (@Karthi_Trendz) July 31, 2025
సర్దార్ 2పై భారీ అంచనాలు
ఈ చిత్రాలతో పాటు ఖాకీ 2 చిత్రానికి కూడా సన్నాహకాలు జరుగుతున్నాయి. సర్దార్ మొదటి భాగంలో ప్లాస్టిక్ బాటిల్స్ వాడకం ఎంత ప్రమాదకరమో చూపించారు.అదే విధంగా దేశభక్తి, స్పై సన్నివేశాలు కూడా ఈ చిత్రంలో హైలైట్ గా నిలిచాయి. దీనితో సర్దార్ 2పై భారీ అంచనాలు ఉన్నాయి.