ప్రభాస్ ‘స్పిరిట్’పై కరీనా కపూర్ కామెంట్స్.. ఇలా షాకిచ్చిందేంటీ?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో ‘స్పిరిట్’ (Spirit) రాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఈ చిత్రంపై షాకింగ్ కామెంట్స్ చేసింది.

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) వరుసగా బాలీవుడ్ హీరోయిన్లతో జోడీ కడుతూ భారీ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే డార్లింగ్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొణె, క్రితి సనన్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు కరీనా కపూర్ కూడా నటించబోతోందని వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలో ప్రభాస్ అప్ కమింగ్ ఫిల్మ్ ‘స్పిరిట్’పై బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ (Kareena Kapoor) షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘అర్జున్ రెడ్డి’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ ప్రధాన పాత్ర పోషించనున్నాడు.
అయితే గత కొద్ది రోజులుగా ఈ చిత్రంలో హీరోయిన్ గా కరీనా కపూర్ ను ఎంపిక చేసినట్టు ఇంటర్నెట్ లో వార్తలు చక్కర్లు కొట్టాయి. దానిపై చిత్ర యూనిట్ కూడా మౌనంగా ఉండటంతో కన్ఫమ్ అయ్యిందని అభిమానులు నిర్ణయానికి వచ్చారు. కానీ తాజాగా కరీనా షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ సరసన నటించడంపై క్లారిటీ ఇచ్చింది. ‘స్పిరిట్ చిత్ర యూనిట్ నన్ను కలవలేదు. నాకు ఎలాంటి సినిమా ఆఫర్ చేయలేదు. కానీ ప్రభాస్ తో కలిసి నటించే ఛాన్స్ వస్తే కచ్చితంగా చేస్తాను’ అంటూ కామెంట్ చేసింది. దీంతో దర్శకుడు సందీప్ రెడ్డి ఇంకా నటీనటుల ఎంపికను ప్రారంభించలేదని తేలిపోయింది.
ఇదిలా ఉంటే.. కరీనా, ప్రభాస్ తొలిసారిగా నటించబోతుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. ఈ చిత్రంలో టాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వనుందనడం అభిమానులను ఎగ్జైట్ చేసింది. కానీ ‘స్పిరిట్’ హీరోయిన్ గా తనకు ఆఫర్ రాలేదని కరీనా ఓపెన్ గా చెప్పడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇదేంటి ఇలా షాకిచ్చిందంటున్నారు.
ఏదేమైనా కరీనా బాలీవుడ్ లోనూ వరుస చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. రీసెంట్ ‘లాల్ సింగ్ చడ్డా’లో అమీర్ ఖాన్ సరసన నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ‘బాయ్ కాట్’కు గురికావడంతో విజయవంతంగా రన్ కాలేకపోయింది. మరోవైపు కరీనా కూడా ట్రోల్స్ కు గురైంది. ఇక కరీనా తదుపరి చిత్రాలపై ప్రస్తుతం ఎలాంటి బజ్ లేదు. ప్రభాస్ మాత్రం ‘సలార్’ (Salaar), ‘ప్రాజెక్ట్ కే’ చిత్రాల్లో నటిస్తున్నారు.